Friday 30 November 2012

IT Raids On Brahmanandam


 

IT-raids-on-Brahmanandam       
ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో భారీగా బంగారం, ఆభరణాలు బయటపడ్డాయని సమాచారం. మొన్న గురువారం కొందరు సినీ, టీవీ నటుల ఇళ్లపై  ‘ఐటీ దాడుల’ చేసిన నేపధ్యంలో బ్రహ్మీ ఇంట్లో ఈ భారీగా గోల్డ్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. బ్రహ్మీ తన ఇంటి మీద ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని షూటింగ్ నుంచి ఇంటికి చేరుకున్న బ్రహ్మానందం ఐటీ అధికార్లకు ఇటీవలే కుమారుడుకి వివాహం చేసిన విషయం తదితర అంశాల్లో వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.

           ఐటీ దాడులు చోటుచేసుకున్న సమయంలో సుమ రామోజీ ఫిలింసిటీలోను, సునిత తిరుపతిలోను, గీతామాధురి ఒక మ్యూజికల్ నైట్ షో నిమిత్తం అబుదాబీలోను ఉన్నట్లు తెలిసింది. ఉదయభాను ఇంటికి ఐటీ అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. వీరి ఇండ్లలో ఎక్కువగా విదేశీ వస్తువులు తారసపడినట్టు తెలుస్తుంది.

         సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ దాడులు అధిక మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే నిర్మాతలు, పంపిణీదారుల మీదే జరుగుతుంటాయి. అయితే ఈసారి విచిత్రంగా బుల్లితెర మీద వ్యాఖ్యానాలు సాగించుకునే కళాకారులు, గాయనీమణులు, ఆడియో వేడుకలకు వ్యాఖ్యానం జరిపే యాంకర్స్ మీద సైతం ఈ దాడులు జరగటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
...avnk

Tuesday 27 November 2012

Damarukam Is A Biggest Hit Nag Career

డమరుకం చిత్రం చూశాక అక్కినేని నాగేశ్వరరావు తన భుజం తట్టి ఓ మంచి చిత్రాన్ని తీర్చిదిద్దావన్న ప్రశంస ఎంతో మనోబలాన్ని అందించిందని, అనేక అవాంతరాలు ఎదురైనా శివుడికి ఇష్టమైన కార్తీకమాసం కోసమే డమరుకం ఆగిందని, చిన్న చిత్రాలు తీసి విజయం సాధించినా పెద్ద చిత్రాల విజయం ఎంత రుచిగా వుంటుందో డమరుకంతో తెలిసిందని చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
       ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలో డా.వెంకట్ నిర్మించిన డమరుకం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్ ప్రధానపాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. డమరుకం విజయం తనను అగ్ర చిత్రాల దర్శకుడుగా మార్చిందని, మరో అవకాశం వచ్చిందని ఆయన సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఓ చిత్రంతో ప్రేక్షకులందరినీ మెప్పించడం కష్టమని, కొంతమందికి కొన్ని సన్నివేశాలు నచ్చకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు.
damarukam_ineree
       నాగార్జున నటించిన తొలి సోషియో ఫాంటసీ చిత్రంగా, హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విజయం తనకవసరమని, అలాగే నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ షేర్ వసూలుచేసిన చిత్రం కూడా ఇదని నిర్మాత  అన్నారు. సినిమా విడుదలలో జాప్యం జరిగినా ప్రేక్షకులలో, అభిమానులలో ఎటువంటి క్రేజ్ తగ్గలేదని, ఆదివారంనుండి ఫ్యామిలీ ఆడియెన్స్‌ తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతున్నాయని తెలిపారు. సినిమాకి వెళితే శివాలయానికి వెళ్లినట్లేనని ప్రేక్షకులు భావించడం శివలీలగా తాను భావిస్తున్నానని, ఇంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.





        35 నిమిషాలపాటు ముగింపు సన్నివేశాలు ఆ చిత్రానికి హైలెట్ అని, హాలీవుడ్ రేంజ్‌లో క్లైమాక్స్‌ను గ్రాఫిక్స్‌లో చిత్రీకరించామని, ఈ సందర్భంగా ఫైర్‌ప్లే గ్రాఫిక్స్ వారికి కృతజ్ఞతలని ఆయన అన్నారు. నాగార్జున గోదావరి మాండలికంలో మాట్లాడటం కూడా చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారిందని, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, హలో బ్రదర్ చిత్రాల తర్వాత ఆయనతో ఆ మాండలీకంలో మాట్లాడించామని, ఆయన బాడీలాంగ్వేజ్‌కి కాస్ట్యూమ్స్ అన్నీ కుదిరాయని తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని ఈ విజయం ద్వారా నిరూపించుకుని, జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తానని, కామెడీని మాత్రం ఎప్పటికీ వదలనని, ఇవివి స్టయిల్‌లోనే కామెడీ చేయాలన్న బాణీలోనే నడుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వివరించారు. త్వరలో నాగచైతన్య చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నామని, ఈ చిత్రానికి కథ తయారుచేయాలని ఆయన వెల్లడించారు.
...avnk

Monday 26 November 2012

Nayak Movie First Look

nayak_first_look      
రామ్ చరణ్ హీరోగా వినాయక్ తెరకెక్కిస్తోన్న 'నాయక్ ' సినిమా ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం వెలువడింది. తొలి పోస్టర్ బయటకు వచ్చింది మొదలు నాయక్ సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాడు. ద లీడర్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది.

        కాగా, ఈ సినిమాను జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ మూవీ గురించి ఏమంటున్నారంటే.. తాము అనుకున్న ప్రకారం ఈ సినిమా నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తూ వస్తున్నామని చెప్పారు.

nayak_english
     
విభిన్నమైన పాత్రలో చరణ్ నటించిన తీరు ... దర్శకుడిగా వినాయక్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఇక కాజల్ ... అమలాపాల్ అందచందాలు, వాళ్ల పాత్రలను మలచిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని చెప్పారు.

         తమన్ సంగీతాన్ని సమకూర్చుకున్న  'నాయక్ ' సినిమా డిసెంబరు రెండవ వారంలో ఆడియోను ... సంక్రాంతి కానుకగా జనవరి 9 న సినిమాను విడుదల చేయబోతున్నారు.

...avnk