ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలో డా.వెంకట్ నిర్మించిన డమరుకం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్ ప్రధానపాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. డమరుకం విజయం తనను అగ్ర చిత్రాల దర్శకుడుగా మార్చిందని, మరో అవకాశం వచ్చిందని ఆయన సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఓ చిత్రంతో ప్రేక్షకులందరినీ మెప్పించడం కష్టమని, కొంతమందికి కొన్ని సన్నివేశాలు నచ్చకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు.
నాగార్జున నటించిన తొలి సోషియో ఫాంటసీ చిత్రంగా, హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విజయం తనకవసరమని, అలాగే నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ షేర్ వసూలుచేసిన చిత్రం కూడా ఇదని నిర్మాత అన్నారు. సినిమా విడుదలలో జాప్యం జరిగినా ప్రేక్షకులలో, అభిమానులలో ఎటువంటి క్రేజ్ తగ్గలేదని, ఆదివారంనుండి ఫ్యామిలీ ఆడియెన్స్ తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతున్నాయని తెలిపారు. సినిమాకి వెళితే శివాలయానికి వెళ్లినట్లేనని ప్రేక్షకులు భావించడం శివలీలగా తాను భావిస్తున్నానని, ఇంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
35
నిమిషాలపాటు ముగింపు సన్నివేశాలు ఆ చిత్రానికి హైలెట్ అని, హాలీవుడ్
రేంజ్‌లో క్లైమాక్స్‌ను గ్రాఫిక్స్‌లో చిత్రీకరించామని, ఈ సందర్భంగా
ఫైర్‌ప్లే గ్రాఫిక్స్ వారికి కృతజ్ఞతలని ఆయన అన్నారు. నాగార్జున గోదావరి
మాండలికంలో మాట్లాడటం కూడా చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారిందని,
ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, హలో బ్రదర్ చిత్రాల తర్వాత ఆయనతో ఆ మాండలీకంలో
మాట్లాడించామని, ఆయన బాడీలాంగ్వేజ్‌కి కాస్ట్యూమ్స్ అన్నీ కుదిరాయని
తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని ఈ విజయం ద్వారా నిరూపించుకుని,
జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తానని, కామెడీని మాత్రం ఎప్పటికీ
వదలనని, ఇవివి స్టయిల్‌లోనే కామెడీ చేయాలన్న బాణీలోనే నడుస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు
తెలియజేస్తున్నానని వివరించారు. త్వరలో నాగచైతన్య చిత్రం చేయడానికి
సిద్ధమవుతున్నామని, ఈ చిత్రానికి కథ తయారుచేయాలని ఆయన వెల్లడించారు.
...avnk
No comments:
Post a Comment