సమైక్యాంద్ర ఉద్యమం దెబ్బ టాలీవుడ్ మీద పడిందని అందరు అంటున్నారు. కానీ అది కేవలం మెగా కుటుంబం పైనే పడిందనే విషయం రీసెంట్ గా అర్థమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా వాయిదా మీద వాయిదాలు పడుతు వస్తుంది. చివరకు ఒక అక్టొబర్ నెలలో విడుదల చెయ్యటానికి సిద్దమయ్యారు. కానీ ఈలోపే అత్తారింటికి దారేది సినిమా నెట్ లో హల్ చల్ చేస్తుంది. 80 నిమిషాల పాటు ఉన్న అత్తారింటికి దారేది వీడియో నెట్ లో రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాకుండా..80 నిమిషాల పాటు ఉన్న అత్తారింటికి దారేది సినిమా సీడీలు, డివిడిలు మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్ర యూనిట్ వాళ్లకు కూడా సినిమా ప్రదర్శన వేయాలేదని... అలాగే ప్రివ్యూ కూడా ఎక్కడా ప్రదర్శించలేనందున లీక్ అయ్యే అవకాశాలు కూడా లేవని తొలుత భావించినా.. తర్వాత మాత్రం అసలు విషయం తెలిసింది. గతంలో కూడా ‘అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యేలోపే అందులోని కొన్ని డైలాగులు బయటకు లీకయిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎక్కడైన అత్తారింటికి దారేది సినిమా సిడి, డివిడిలు, అమ్ముతున్నట్లు తెలుస్తే వెంటనే ఈ క్రింది మెయిల్ కు సమాచారం అదించామని మెగా అభిమానులు కోరుకుతున్నారు.
No comments:
Post a Comment