Tuesday, 30 September 2014

Govindudu Andarivadele Telugu Movie Review and Rating

Govindudu Andarivadele Telugu Movie Review An NRI comes to India, settles the problems in his family and unites all of them. This is not at all a new story to the Telugu audiences. But knowing Krishna Vamsi's ability as a director, one can sure expect some different flavor. If a movie has good family elements, it will be definitely received well by the Telugu audiences. GAV is said to be nothing short of such elements. The last half an hour of the film is going to be very emotional according to the movie sources. Krishna Vamsi is one of the best at handling family entertainers and he is said to have done a great job for this film. Though he is going through a rough patch in his career for the last three to four years, one can't doubt his capability. He looks very confident this time. I would like to start off by congratulating Krishna Vamsi, Ram Charan and Bandla Ganesh for bringing us this memorable family entertainer. One needs to salute their conviction that even in the days of formulaic commercial cinema, they have gone ahead and dared to make a heart touching family entertainer. All those who had doubts about how Ram Charan will do an out and out family film, need to watch GAV to clear their doubts. Charan is just outstanding in the film. Right from his look to his performance, he has owned this film and has given his career best performance. He surprises you with his emotional acting capabilities and is mind blowing during the last half an hour. Yet another major highlight of the film is Kajal Agarwal. She looks ultra glamours, and shares a sizzling chemistry with Charan. Needless to say you can just be in awe of her timeless beauty, and the way she has performed. Credit should also go to Krishna Vamsi for showing her like never before. Prakash Raj’s inclusion in the last minute is bang on. The makers should be credited for selecting him, as he brings in a lot of depth to this film. As always, Jayasudha gives a decent performance and nicely supports Prakash Raj. Negatives: Though the director has ensured to balance the image of Srikanth through his role, the role of Kamalini Mukherjee is very petite. Also, the movie runs very slow in the first half as compared to the second half. But, the same is not a very big setback as such. The other negatives are appended below: BGM scoring Cooked up comedy It is not ethical to reveal the entire story. But in a single word, the movie has met the expectations. The film was awarded an ‘U/A’ certificate by Central Board of Film Certification. Few sources reported that few romantic songs and scenes between the lead pair were the main reason for awarding an ‘U/A’ Certificate instead of a clean ‘U’. The censor board asked the film makers to obtain a No Objection Certificate from Animal Welfare Board of India in order to retain scenes featuring animals and deleted few romantic scenes apart from muting few double-meaning dialogues. The teaser received very good response from the critics and the viewers. Reviewing the teaser, a leading National Daily wrote “This film is no poor regional cousin of Bollywood. It’s got color, good-looking stars with baddies to boot and loads of song and dance executed with a finesse that only Indian film industry can. Click Here for more Telugu Cinema Reviews

Wednesday, 24 September 2014

Ram Gopal Varma Reveals His Suquence Secrets





రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులను భయపెట్టే డైరెక్టర్ గా అందిరికి తెలుసు. ఒక సినిమా ఫ్లాప్ అయినా.. దానికి సీక్వెన్స్ తీయటం అంటే వర్మకే సాధ్యం. ఐస్ క్రీం2 సినిమాను చూస్తేనే ఇది అర్ధం అవుతోంది. అయితే ఈ సినిమా సీక్వెన్స్ తీయటం వెనక ఉన్న సీక్రెట్స్ బయటకు తెలిసింది. వర్మ సినిమా కోసం కేవలం లక్షలు ఖర్చు పెట్టి.., కోట్లు పోగేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాకు అయ్యే ఖర్చు కేవలం నాలుగు లక్షల రూపాయలేనని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. నాలుగు లక్షలతో హీరో, హీరోయిన్లు కూడా దొరకరు కదా.., సినిమా మొత్తం ఎలా జరుగుతోంది అంటే వర్మ సీక్రెట్ వారు బయటకు చెప్పేశారు. Read more..

Click here for more Latest movie news ..

Friday, 19 September 2014

Govindudu Andarivadele Latest Trailer







Govindudu Andarivadele Latest Trailer

Mahesh Babu Aagadu Movie Review and Rating


 చిత్రం  :  ఆగడు

బ్యానర్  : 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్

 దర్శకుడు  : శ్రీనువైట్ల

 నిర్మాత  :    రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సునీల్ సుంకర

సంగీతం  :    ఎస్‌ఎస్ తమన్

 సినిమా రేటింగ్  :  3

 ఛాయాగ్రహణం  :

 కె.వి.గుహన్

 ఎడిటర్  :

ఎం.ఆర్. వర్మ

నటినటులు  :   మహేష్‌బాబు, తమన్నా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్

విడుదల తేది : Friday, 19 September 2014

ఆగడు
కధ విషయానికి వస్తే.., దూకుడు సినిమాలాగే ఇందులో మహేష్ పోలిస్. అయితే ఆ సినిమాలో మొదటి నుంచే పోలిస్ అయితే., ఇక్కడ మాత్రం సినిమా ప్రారంభం అయ్యాక కొద్ది సేపటికి పోలస్ అవతారం ఎత్తుతాడు. ఇక కధ విషయానికి వస్తే మహేష్ పేరు శంకర్. సినిమాలో శంకర్ ఓ అనాధ.. కాని చాలా తెలివైన అబ్బాయి. శంకర్ తెలివిని చూసిన పోలీస్ రాజ నరసింగరావు (రాజేంద్ర ప్రసాద్) అతన్ని చేరదీస్తాడు. తనలాగే పోలిస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ కు ఓ కొడుకు ( అజయ్) ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల శంకర్ ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్తాడు. దీంతో నర్సింగరావు శంకర్ ను దూరం పెడతాడు. అజయ్ ను తనలా పెంచి పెద్ద చేస్తాడు.

అటు జైలుకు వెళ్ళిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ అవుతాడు.. అప్పుడే బుక్క అనే పట్టణంలో విలన్ దామోదర్ (సోనూ సూద్) చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తారు. ఇక్కడితో సెకండ్ ఆఫ్ సినిమా మొదలవుతుంది. ఇక బుక్కకు వచ్చిన శంకర్ కి షాక్ లాంటి నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి.? దామోదర్ ను ఎలా ఎదుర్కున్నాడు. శంకర్ మర్డర్ కేసు నిజా నిజాలేమిటి? మిగతా అంశాలను థియేటర్ కు వెళ్ళి చూడవచ్చు.

మహేష్ బాబు తాజా చిత్రం ‘ఆగడు’ విడుదలైంది. దూకుడు నుంచి కామెడి క్యారెక్టర్ పెంచుకుంటూ వచ్చిన మహేష్.., అదే పోలిస్ పంధా.., కామెడీ కలిపి తీసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాలతో.., విడుదలకు ముందే సంచలనాలతో వచ్చిందీ సినిమా. 14 రీల్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి మహేష్ పక్కన తమన్నా హీరోయిన్ గా నటించగా.., శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో ఆడింది. తెలుగు రాష్ర్టాల్లోనూ దాదాపు రెండు వందలకు పైగా థియేటర్లలో సినిమా విడుదలైంది. మరి ఇంత సంచలనాలను నమోదు చేసుకున్న సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Mahesh Babu Aagadu Movie Review and Rating
ప్లస్ పాయింట్స్ :

తనలో ప్రతి సినిమాలో కొత్తదనం చూపించటానికి ప్రయత్నిస్తున్న మహేష్ ఇందులోనూ బాగా ప్రయత్నించాడు. కొత్త యాటిట్యూడ్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీ బాగా ఉన్నాయి. ఫ్యాన్స్ ను ఇవి చాలాబాగా ఆకట్టుకున్నాయి కూడా. మహేష్ పంచ్ డైలాగులు మాట్లాడిన ప్రతి సీనుకు థియేటర్లో ప్రేక్షకులు ఈలలేస్తున్నారు. యాక్షన్ పరంగా మహేష్ లో లోపాలు  చూపలేము. అటు డాన్స్ పరంగా కూడా గతంలో పోలిస్తే కొన్ని కొత్త స్టెప్పులున్నాయి. అటు హీరోయిన్స్ ఇద్దరిది సినిమాలో స్పెషల్ క్యారెక్టరైజేషన్. ముందుగా తమన్నా గురించి చెప్పాలంటే.. ‘ఆగడు’లో ఆమె క్యారెక్టర్ తక్కువ సమయం ఉంటుంది. అయినా సరే ఉన్నంతసేపు ఆడియన్స్ ను అలా తనగురించే ఆలోచించేలా చేసింది. కొత్త డ్రెస్సులు, సాంప్రదాయ లంగీ వోనీలో ఆకట్టుకునేలా ఉంది. సాంప్రదాయంగా ఉన్నా పాటల వరకు వస్తే.., అన్నీ పక్కన బెట్టి.., ప్రేక్షకులకు అందాలను ఆరబోసింది. సినిమా చివర్లో వచ్చే శృతి హాసన్ తానేమి తక్కువ తీసిపోను అన్నట్లుగా.., మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డాన్స్ చేసింది.

ప్రధాన పాత్రలను పరిశీలిస్తే., మహేష్ తండ్రిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ తన వంతుగా సినిమాకు న్యాయమే చేసాడు. కామెడి బ్రహ్మ బ్రహ్మానందం కూడా తనవంతుగా ప్రేక్షకులను నవ్వించి మంచి మార్కులేసుకున్నాడు. ముఖ్యంగా ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. అటు దూకుడు నుంచి మహేష్ తో కన్పిస్తున్న వెన్నెల కిశోర్ ఈ సినిమాలో మహేష్ వెంట మొత్తంగా కన్పిస్తాడు. అయితే పోకిరి సినిమా నుంచి మహేష్ వెంట పూర్తిగా ఉండే నాజర్ తక్కువగా కన్పిస్తాడు. అయినా సరే ఆయన నేపథ్యంగా సాగే సెటైర్లు బాగుంటాయి. ఇక నవ్వుల రాజా పోసాని గురించి చెప్తే నవ్వకుండా ఉండలేము. డైలాగ్స్ డెలీవరి ద్వారా అంతగా నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

‘ఆగడు’లో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ కధ. కొత్తగా కధలో చెప్పుకోదగినంతగా ఏమి లేకపోవటం బాగా దెబ్బతీసే విషయం. అదే పోలిస్ గెటప్, అదే చేజింగ్, సేమ్ స్టోరి అన్నట్లుగా భావన వస్తోంది. పోని ఈ మద్య పోలిస్ క్యారెక్టర్ నేపథ్యంగా వచ్చిన ఓ సినిమా హీరోను ఆదర్శంగా తీసుకుని కధను తయారు చేశారా అంటే... ట్విస్టులు సరిగా చూపించలేకపోయారు. దీంతో సినిమాలో తరవాత సీన్ ఏంటనేది ప్రేక్షకులు ముందే చెప్పేసుకుంటున్నారు. గత కాంబినేషన్ సినిమాను సగం కట్ చేసి పెట్టారా అని అనకుంటున్నారు. సినిమా ఫస్ట్ పార్ట్ కామెడి, కాస్త స్టోరితో నింపేసి.. సెకండ్ పార్ట్ మహేష్ ను చూపించటానికి సరిపుచ్చారు. ఫస్ట్ ఆఫ్ నవ్వుకుని బయటకు వెళ్లి వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ తర్వాత కాస్త విసుక్కున్నారు. టైమింగ్ సరిగా లేకపోవటంతో సెకండ్ ఆఫ్ ఇబ్బందిగా అన్పించింది.

సినిమాలో కామెడి చూపించాలని శ్రీనువైట్ల బాగా కష్టపడ్డారు. పంచ్ డైలాగులు.., ప్రాసల కోసం రైటర్లను పట్టు వదలకుండా కూర్చున్నారు. కానీ.., ఆయన కధ విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోలేదు. అందుకే పంచ్ డైలాగ్స్ పేలాయి కాని వాటికి కధతో అసలు సంబంధం లేదు. కొన్నిచోట్ల ఇది స్పష్టంగా కన్పించటం వల్లే.., పేలకుండా ప్రేక్షకుల ముందు ఇబ్బందిపడ్డాయి. అటు మీలో ఎవరు కోటీశ్వరుడు బాగా కష్టపడి తీసినా అంత బాగా లేదు అనేది టాక్. పాత కధను చూపించటంతో బాగా ఎక్కువ సేపు చూపించారు అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

సాంకేతిక విభాగం :

చివరగా ఇతర విభాగాల పనితీరు చూస్తే.., సినిమా తీసిన డైరెక్టర్ శ్రీనువైట్ల బాగానే కష్టపడ్డాడు. కొందరి పాత్రలు పెంచాడు.. కొందరి పాత్రలు తగ్గించాడు. అయితే ఇక్కడే ఆయన ఓ పొరపాటు చేశాడు. అయితే అది సినిమా తీసేముందు ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకున్నాడు కాని అంతగా నాడి పట్టలేకపోయింది. అదేమంటే గతంలో లాగానే సేమ్ స్టోరి క్యారెక్టరైజేషన్ ప్రధాన ఎజెండాగా ఉన్నపుడు ఇందులో కొత్తగా ప్రధానమైన అంశం ఏదైనా ఉండాలి లేదా.., ట్విస్టులను చూపాలి. లేకపోతే పాత సినిమాకు కొత్త సినిమాకు తేడా ఏముంటుంది. అందుకే ఇక్కడ కాస్త దెబ్బయిపోయారు. ఇక నిర్మాత పరంగా 14రీల్స్ బ్యానర్ కూడా బాగానే ఖర్చు పెట్టింది. అది సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది.


ఎడిటింగ్ విషయంలో కూడా సినిమా కాస్త నష్టపోయింది. అంటే అంతా అవసరం లేని సీన్లను ఎం.ఆర్. వర్మ పెట్టడం వల్ల నిడివి ఎక్కువ అయి సెకండ్ ఆఫ్ స్లో అయింది. ఇంటర్వల్ తర్వాత చాలా సన్నివేశాలు అంతగా ప్రాధాన్యం లేనివే. వాటిని కట్ చేసి ఉంటే బాగుండేది. రైటర్లు కూడా పంచుల కోసం ప్రాకులాడకుండా సన్నివేశాలకు తగ్గట్లు డైలాగులు రాసి ఉంటే ఏది పెట్టాలో సులువుగా డిసైడ్ చేసేవారు. ప్రాస ఉన్న డైలాగులన్నీ వాడే సరికి సినిమా కధ పెద్దగా అయినట్లు తెలుస్తోంది. మిగతా భాగాలను చూస్తే.,. సినిమాకు ప్రధాన ఆకర్షణ అయిన విజువల్స్ లుక్ బాగుంది. గ్రాండ్ గా అన్పించి ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్లనే కాకుండా ప్రతి ఒక్కరినీ బాగా చూపించాడు. లొకేషన్లను కూడా చాలా చక్కగా కవర్ చేయగలిగాడు. ఈ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ కే చెందుతుంది. గుహన్ ఆగడుకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అటు తమన్ పాటలు కూడా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆర్.ఆర్. కూడా సెట్ అయ్యేలా కంపోజ్ చేశారు. డాన్స్ కోసం రక్షిత్, ప్రేమ చేసిన కష్టం  ఫలించిందని చెప్పవచ్చు.

క్లుప్తంగా చెప్పాలంటే.. ::

ప్రేక్షకుల భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కధ పరంగా కాస్త వెనకబడింది. డైరెక్టర్ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే ఆయన ఏదో చూపించాలని ప్రయత్నించినా.., అది పెద్ద విషయం కాకపోవటం వల్ల ప్రేక్షకులు అంతగా పట్టించుకోవటం లేదు. నటన పరంగా, మహేష్ బాబు కొత్త మ్యానరిజం, డైలాగ్ డెలివరి, హీరోయిన్ నటన, గ్లామర్, స్పెషల్ సాంగ్ అంతా బాగుంది. ఇక కామెడి గురువులు కూడా తమ వంతు న్యాయం చేశారు. ప్రధాన పాత్రలు కూడా ఎక్కడా లోపాలను చూపలేము. అయితే కధ మాత్రం తీవ్రంగా దెబ్బకొట్టంది. అంతా బాగా చేసినా.. కధ విషయానికి వచ్చే సరికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఓకే. కాని బెస్ట్ కాదు. ఇప్పటికిప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి లేకపోవటం వల్ల ఈ సినిమా మాత్రం కలెక్షన్లను వసూలు చేస్తుందని చెప్పవచ్చు.


కార్తిక్








aagadu movie review

Friday, 12 September 2014

Pawan Kalyan Upset Over Split Of Fans


Pawan kalyan upset over split of fans

రాష్ట్ర విభజనను చూశాం కానీ ఇప్పుడు ఫ్యాన్స్ విభజన కూడా జరుగుతోంది. తెలుగు రాష్ర్టాలు రెండు ముక్కలయినట్లుగా.., మెగా ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోతున్నారు. మెగాఫ్యాన్స్ ఇకపై చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గా వేర్వేరుగా కన్పించనున్నారు. రాష్ర్ట విభజనపైనే ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత ఇంటిలో జరుగుతున్న విభజనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులు రెండుగా విడిపోవటం ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. మెగా విభజనపై పవన్ స్పందించకపోయినా.., సన్నిహతుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తాజా ఘటన పవర్ స్టార్ ను బాధించిందట.Read More.....

Mahesh Babu Aagadu Second Trailer Released


Mahesh babu s aagadu second trailer released

ఆగడు సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన రెండవ ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ లో మహేష్ పోలిస్ యాక్షన్, సాంగ్, డైలాగులతో సెకండ్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే రెండు టీజర్లు, ఫస్ట్ ట్రైలర్ కు బాగానే రెస్పాన్స్ రావటంతో రెండవ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు వారం రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా వచ్చిన ఈ ట్రైలర్ తో తమకు లాభం కల్గిస్తుందని ఆగడు యూనిట్ భావిస్తోంది. Read More.....

Shankar Vikram Ar Rahman I Movie Motion Poster

 
Vikram s i movie gif 
 
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఐ’ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గురువారం విడుదలైన ఈ ఫొటోను ఇప్పటికే లక్షల మంది ఫ్యాన్స్ చూశారు. సినిమాలో హీరోగా నటిస్తున్న విక్రమ్ ఫస్ట్ లుక్ లో మంచి బాడి బిల్డింగ్ తో పాటు భయపెట్టే ముఖంతో అదరగొడుతున్నాడు. సినిమా ఓ యాక్షన్ మూవీ అని పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే శంకర్ మరి ఈ సినిమాలో ఏ మంత్రం వేశాడో తెలియాలంటే మాత్రం విడుదల వరకు వేచి చూడాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా సంచలనాలు నమోదు చేసే శంకర్ ఈ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకుంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు...... Read More.....
 
 
 
Read Latest Telugu Movie News
విక్రమ్ ‘ఐ’ ఫస్ట్ లుక్ సెన్సేషన్

Thursday, 4 September 2014

Aishwarya Rai To Act With Chiranjeevi In His 150th Film



Aishwarya rai to act with chiranjeevi in his 150 film

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. ఇంకా కథగానీ, డైరెక్టర్ గానీ ఫైనలైజ్ కాకపోయినప్పటికీ.. హీరోయిన్ల చిట్టా మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వుంది. ఇప్పటికే చిరు కొత్త సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా త్రిష, శ్రియ, నయనతార, అనుష్కలలో ఎవరో ఒకరు నటించడం ఖాయమని వార్తలు జోరుగానే సాగాయి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా తెరమీదకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ కూడా చేరిపోయింది. ప్రస్తుత అంతర్గత సమాచారాల ప్రకారం.. ఐశ్వర్య, చిరుతో చిందులేయడం ఖాయమని చెబుతున్నారు కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.  Read More.....

Click Here for More Telugu Movie News