Showing posts with label Dabangg 2. Show all posts
Showing posts with label Dabangg 2. Show all posts

Tuesday, 19 February 2013

Kareena To Do 4 Item Songs


kareena-_kapoor-item-songs

      బాలీవుడ్ సినీ ప్రపంచం లో తిరుగు లేని తార, నటనకీ, గ్లామర్ కి పెట్టింది పేరు, కరీనా కపూర్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ చెల్లెలిగా, కపూర్ కుటుంబం వారసురాలిగా, సినీ ప్రస్తానం ప్రారంభించిన కరీనా, ఆనతి కాలం లో నే తనకంటూ ప్రత్యెక గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో వైవిద్యభరితమైన సాహసోపూరితమైన పాత్రలను పోషించి, ఆఫర్లు, అవార్డ్లు, రేవార్డ్లు అందుకుంది. తన కన్నా 10 సంవత్సరాలు పెద్దవాడైన సైఫ్ తో ప్రేమాయాణం సాగించి వార్తల్లో నిలిచింది. సైఫ్ తో పెళ్లి తరువాత కూడా, పాత్రల ఎంపిక లో, నటనలో ఏ మాత్రం జోరు తగ్గించకుండా, ముందుకు దూసుకుపోతోంది.

kareena-kapoor

    ఇటు హీరోయిన్ గానే కాక, అటు ఐటం భామ గా కూడా, కరీనా సుప్రసిద్ధం. తన సినిమాల్లో తానె ఐటం సాంగ్స్ పై నర్తించడం కూడా చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది కరీనా. తన తాజా చిత్రం, 'గోరి తేరే ప్యార్ మే' లో ఏకంగా కరీనా 4 ఐటం సాంగ్స్ పై నర్తించబోతోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'ఏక మే ఔర్ ఏక తు' జంట కరీనా - ఇమ్రాన్ ఈ సినిమాలో కూడా కలిసి నటించబోతున్నారు. తాజాగా కరీనా ఈ సినిమాలో హీరోయిన్ గానే కాక, ఐటం భామగా కూడా, అది కూడా ఒకే చిత్రం లో 4 పాటల్లో కనిపించబోతుందన్న విషయం బయట పడింది.