Showing posts with label I. Show all posts
Showing posts with label I. Show all posts

Wednesday, 10 April 2013

Dhanush In Shankar Direction


ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి రికార్డులు స్రుష్టించిన దర్శకుడు శంకర్  త్వరలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా శకంర్ ఓ ప్రాజెక్టు అయిన తరువాత మరో దాన్ని మొదలు పెడతాడు. కానీ ఈసారి ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈయన తమిళ స్టార్ అయిన విక్రమ్ హీరోగా 100 కోట్ల బడ్జెట్ తో ‘ఐ ’ అనే సినిమా తీస్తున్నాడు. దాన్నే తెలుగులో ‘మనోహరుడు ’ పేరుతో అనువదిస్తున్నారు. శంకర్ ధనుష్ తో తీసే సినిమాకు సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, ఏజీఎస్ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతుందని సమాచారం. ఈ సినిమాకు సంభందించిన మిగతా వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం రజినీకాంత్ రికమెండ్ చేస్తేనే ధనుష్ తో సినిమా చేయడానికి శంకర్ ఒప్పుకున్నాడని కూడా అనుకుంటున్నారు.