Showing posts with label Samantha avoids Bollywood offers and continues to act in Telugu movies. Show all posts
Showing posts with label Samantha avoids Bollywood offers and continues to act in Telugu movies. Show all posts

Tuesday, 30 April 2013

Samantha Rejects Hindi Movie Offers

Samantha rejects Hindi movie offers.png

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు సౌత్ లో ఫేమస్ అయిన తరువాత బాలీవుడ్ పై మోజు పెంచుకొని అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లలో కొంత మంది రాణిస్తే, మరికొంత మంది అడ్రస్ లేకుండా పోయారు. కానీ వీరందరికి భిన్నంగా టాలీవుడ్ లో టాస్ రేసులో దూసుకుపోతున్న సమంతా బాలీవుడ్ ని తిరస్కరిస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.... అక్కడి నుండి పలు అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ నేను చేయనని ఖరాఖండిగా చెప్పేశాను.

 ప్రస్తుతం నేను తెలుగు స్టార్ హీరోల ప్రక్కన నటిస్తున్నాను. ఇక్కడి తెలుగు ప్రేక్షకులు నన్నే కోరుకుంటున్నారు. పైగా పారితోషికం కూడా బాగానే ఇస్తున్నారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నేను కష్టాలు పడలేను. నన్ను ఇంతగా ఆదరిస్తున్న దక్షిణాది ప్రేక్షకులకే నా మొదటి ప్రాధాన్యం. ఇప్పట్లో బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచన లేదని, దానికి ఇంకా టైం ఉందని చెప్పుకొచ్చింది. మరి అవకాశాలు రాక అలా మాట్లడుతుందో లేక ఇక్కడి ప్రేక్షకులను బుట్టలో వేయడాని చెబుతుందో సినీ జనాలకు తెలియాలి అంటున్నారు.