Showing posts with label parineeti chopra wants to work with mahesh babu. Show all posts
Showing posts with label parineeti chopra wants to work with mahesh babu. Show all posts

Thursday, 17 July 2014

Parineeti Chopra Wants To Work With Prince Mahesh Babu


parineeti-chopra-comments.gif 

టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ ఎంతుంతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు... కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా ప్రిన్స్ కు బాగానే ఫాలోయింగ్ వుంది. ఈయన హిట్ అయిన దాదాపు అన్నీ సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం తలదన్నేసేలా పర్సనాలిటీ కలిగి వుండటం వల్ల అందరూ ఇతనిని డ్రీమ్ బాయ్ గా పిలుచుకుంటారు. ఇక అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

తన స్టైల్ తో అమ్మాయిలను నిద్రపట్టనివ్వకుండా చేస్తున్న ప్రిన్స్... ఇప్పుడు బాలీవుడ్ భామల మనసులను కూడా దోచేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో వున్న అగ్రహీరోయిన్లు సైతం మహేష్ బాబుతో నటించడానికి తహతహలాడుతుంటారు. బాలీవుడ్ భామలందరూ సౌత్ ఇండస్ట్రీలో నటించే అవకాశం వస్తే అది కేవలం మహేష్ తోనే ఎంట్రీ అయి వుండాలని కోరికలు చెప్పుకుంటున్నారు. ఈ జాబితాలో చాలామందే వున్నా... ఇప్పుడు ఇందులో లేటెస్ట్ గా పరిణీతి చోప్రా కూడా చేరిపోయింది.

పరిణీతి చోప్రా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన తీపి కోరికల గురించి వెల్లడించింది. దక్షిణాదిన సినిమా ఆఫర్లు వస్తే, ఎవరితో నటించడానికి ఇష్టపడుతారని ప్రశ్నిస్తే... దానికి వెంటనే మహేష్ బాబు సరసన నటించాలని వుందంటూ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చేసింది. గతంలో కూడా తాను మహేష్ బాబు మీద మోజు పడిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అంటే పరిణీతికి కూడా ప్రిన్స్ నిద్రపట్టనివ్వకుండా కలలో వస్తున్నాడేమోనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

గతకొంతకాలం క్రితం పరిణీతిని రానా సరసన నటించాల్సిందిగా అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆ విశేషాల గురించి ఏమీ ప్రస్తావించకుండా కేవలం మహేష్ బాబు గురించి చెబుతోందంటే... పీకల్లోతుదాకా తన ప్రేమలో పడిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈమె కోరికను తీరుస్తాడా..? వేచి చూడాల్సిందే!

AS