Showing posts with label rajinikanth. Show all posts
Showing posts with label rajinikanth. Show all posts

Tuesday, 23 April 2013

Rajini Vikramsimha Rights For 30 Crores

Rajini Vikramsimha Rights For 30 Crores.png

  30 కోట్లు పలికిన రజినీ సినిమా 
 
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ కి అటు తమిళంలో ఎంత మార్కెట్ ఉందో, ఇటు తెలుగులో కూడా ఇంచు మించు అంతే మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో ’ తెలుగు హక్కులు భారీ రేటు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త ఏంటంటే... రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొచ్చాడయాన్ ’ తెలుగులో  ‘విక్రమసింహ ’ పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. 

 విక్రమసింహసినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు 30 కోట్లు పెట్టి ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుబ్రమహ్మణ్యం కొన్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాక్. గతంలో ఈయన  సుమారు 30 తమిళ, ఆంగ్ల చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి, లాభాలు గడించాడు. ఇప్పుడు ఈ సినిమాను ఇంత రేటు పెట్టి కొన్నాడు. అయితే ఎంత రజినీ సినిమా అయినా డబ్బింగ్ హక్కులను ఇంత భారీ రేటు పెట్టి కొనడం చాలా రిస్క్ అంటున్నారు తెలుగు సినిమా ట్రేడ్ పండితులు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.

Dhanush And Sonam Kapoor Hot Romance In Raanjhnaa


  రజనీకాంత్ అల్లుడిపై మనసుపడిన బాలీవుడ్ భామ?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో దనుష్ పై బాలీవుడ్ భామ మనసుపడినట్లు తెలుస్తోంది. గతంలో దనుష్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుత్రి హాసన్ మద్య కెమిస్ట్రి జరిగినట్లు కోలీవుడ్ లో పుకార్లు పుట్టాయి. త్రీ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరి మద్య రొమాన్స్ నడుస్తుందని రుమార్లు పుట్టాయి. అయితే కొత్తగా బాలీవుడ్ భామ ధనుష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొలవేరి కుర్రోడి పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్ చేస్తుంది. రాంఝనాలో తనతోపాటు నటిస్తున్న తమిళ హీరో ధనుష్‌ను సోనమ్ కపూర్ ఆకాశానికి ఎత్తేసింది. తనకు ఏడేళ్ల నటనానుభవం ఉన్నా అతడి ముందుకు వచ్చాక కొత్తదానిని అనిపిస్తోందని చెబుతోంది. ఈ ప్రేమకథలో బెనారస్ నుంచి ఢిల్లీ జేఎన్‌యూకు చదువుకోవడానికి వచ్చే యువతి పాత్ర సోనమ్‌ది. ఆనంద్‌రాయ్ దర్శకుడు. ‘నాకంటే ఎంతో ముందుగానే ధనుష్ సినీపరిశ్రమలో ఉన్నాడు. అతనికి ఇది మొదటి హిందీ సినిమానే అయినా ధనుష్ బాలీవుడ్‌కు కొత్తవాడని నేను చెప్పలేను. మనకున్న అద్భుత నటుల్లో ధనుష్ ఒకడు. కచ్చితంగా నాకంటే మంచి నటుడు. అతనితో నటించేటప్పుడు నేను కొత్తదాన్ని అనిపించింది’ అని సోనమ్ తెలిపింది. 

  రాంఝనా జూన్ 28న విడుదలవుతోంది. తన అంతిమలక్ష్యం ఎప్పుడూ ఆనందమేనని చెప్పిన సోనమ్, భాగ్ మిల్ఖా భాగ్, ఖూబ్‌సూరత్ రీమేక్, యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఖూబ్‌సూరత్‌లో రేఖ పాత్రలో సోనమ్ కనిపిస్తుంది. అయితే అన్ని పాత్రలూ ఒకేసారి చేయడం కష్టమని, ఒకదాని షూటింగ్ ముగిశాకే మరోదాంట్లో నటిస్తున్నానని ఈమె తెలిపింది. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్న రేఖ పాత్రలో నటించే అవకాశం రావడం అద్భుతంగా ఉందని అనిల్ కపూర్ ముద్దుల కూతురు కూడా అయిన సోనమ్ చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్ లో పాగావేసిన డ్యాన్స్ మాష్టర్, దర్శకుడు, కొరియోగ్రాఫి గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభుదేవా .. సోనాక్షితో నడిపిని రొమాన్స్ గురించి బాలీవుడ్ బాబు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే తరహాలో హీరో దనుష్ , సోనమ్ కపూర్ల విషయం ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు.