Showing posts with label trs focus glamour heroine. Show all posts
Showing posts with label trs focus glamour heroine. Show all posts

Tuesday, 25 December 2012

KCR Focus Tollywood Actress Anushka

kcr focus  tollywood actress anushka

        టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు  రాబోయే  ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని కొత్త పావులు కదుపుతున్నారు.  అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కొంత మంది రాజకీయ నాయకులు చేరటంతో  పార్టీ వర్గాలు ఆనందంగా ఉన్నా, కేసిఆర్ మాత్రం పార్టీ నుండి వారిపై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.  ఇప్పటికే  తెలంగాణ రాములమ్మ లో టీఆర్ఎస్ పార్టీ  అటూ ఇటూ ఊగుతూ అడుగులు వేస్తున్న విషయం కేసిఆర్ కు తెలుసు. రాములమ్మ పార్టీ దూరం అయితే  వచ్చే నష్టం కూడా ముందే పసిగట్టాడు కేసిఆర్. అందుకోసం చెల్లెమ్మ వెళ్లిపోతే .. ఆ స్థానంలో  మరో సినీ గ్లామర్ ఉన్న హీరోయిన్ కోసం  కేసిఆర్ ఫిలింనగర్లో తిరుగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.   ఇప్పటికే రాములమ్మ గులాబీలపై మోజు పోవటంతో.. కమలం పై కన్నుపడినట్లు తెలుస్తోంది.  మెదక్ జిల్లా ఎంపీ విజయశాంతి కి టీఆర్ఎస్ పార్టీ వల్ల పెద్ద ఒరిగింది ఏం లేదని ఆమె తన సన్నిహితులు వద్ద చెబుతున్నట్లు సమాచారం.  రాములమ్మ కమలనాధులతో కలిసి రహస్య పార్టీలకు హజరవుతున్నట్లు  కేసిఆర్ కు తెలియటంతో.. ముందు జాగ్రత్తగా  రాములమ్మకు పోటీగా ఉంటే  సినీ గ్లామర్  రుద్రమదేవి మీద మనసు నిలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. విజయశాంతి  ఓసేయ్ రాములమ్మ సినిమా తీసి  తెలంగాణ ప్రజలకు దగ్గరైనట్లే  ఇప్పుడు టాలీవుడ్  టాప్ హీరోయిన్  అయిన  అందాల అనుష్క కోసం కేసిఆర్ రాజకీయ ప్లాన్ వేస్తున్నట్లు ఆ పార్టీ రాజకీయ నాయకులు అంటున్నారు. 

kcr focus  tollywood actress anushka

  అనుష్కది తెలంగాణ ప్రాంతం కాకపోయిన, ఆమె నటిస్తున్న ‘రుద్రమదేవి’  సినిమా  తెలంగాణ ప్రజలకు , కాకతీయ వంశానికి చెందటంతో అనుష్క కోసం కేసిఆర్ పావులు కదుపుతున్నారు.  ఆ సినిమా ఇప్పడు షూటింగు జరుగుతుంది. ఆ సినిమా విడుదలయ్యేనాటికి  రాష్ట్రం ఎన్నికల వాతవరణం వస్తుంది కాబట్టి,  రుద్రమదేవిని  తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కేసిఆర్ ఇప్పటి నుంచి  గులాబీలు  తయారు చేస్తున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. అన్నీ రాజకీయ పార్టీల్లోను  సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీలో  మెగా గ్లామర్, టీడీపీలో  నందమూరి వారి గ్లామర్, ఇక రీసెంట్ గా వచ్చిన  వైకాపా పార్టీలో  అక్కినేని, ఘట్టంనేని, దర్శకులతో  సీని గ్లామర్ నిండిపోయింది.  ఇక మిలిగింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికి వరకు రామలమ్మ గ్లామర్ తో  చెల్లెమ్మ అనే బిరుదుతో  కేసిఆర్ నెట్టాకొచ్చారు. కానీ ఇక నుండి అలా రాములమ్మ వెళ్లిపోతే  సినీ గ్లామర్ లేని పార్టీ గా మిలిగిపోతుందన భావించి  ముందుగా  రుద్రమదేవికి  గులాబీల తీవాచీ పరుస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ అనుష్క కేసిఆర్ ఇచ్చే గులాబీలు తీసుకుంటుందో..లేక ఆయన చేవిలో ఆ గులాబీలు పెడుతుందో చూడాలి. కేసిఆర్ మాత్రం బొమ్మాళీ నిన్ను వదల అంటూ వెంటపడి సాధిస్తాడో  చూడాలి...