1 Nenokkadine Telugu Movie Review
1 Nenokkadine Movie Review, Mahesh 1 Nenokkadine Movie Review, 1 Nenokkadine Telugu Movie Review, 1 Nenokkadine Movie Rating, 1 Nenokkadine Movie Review and Rating, One Nenokkadine Movie Review, 1 Nenokkadine Movie Stills, 1 Nenokkadine Movie Trailers, 1 Nenokkadine Movie Teasers, 1 Nenokkadine Movie Wallpapers, 1 Nenokkadine Movie Gallery and more on teluguwishesh.com
గౌతమ్ (మహేష్ బాబు) రాక్ స్టార్ గా సంగీత ప్రియుల్ని అలరిస్తుంటాడు.
అలా జీవితం సాగిపోతున్న అతన్ని పీడకకల రూపంలో గతం వెంటాడుతుంటుంది. కానీ
అతనికి గతం గుర్తుకు రాదు. కలలో వచ్చిన వారందర్ని నిజజీవితంలో వారే వీరు
అని ఊహించుకొని చంపేస్తుంటాడు. అలా చంపేసినట్లు భ్రమ పడి జైలుకెళతాడు. కానీ
అక్కడ వైద్యులు అతనికి మానసిక వ్యాధి ఉందని నిర్ధారిస్తారు. వీరందరిని
నమ్మలేని గౌతమ్ తాను నమ్మిందే చేసుకుంటూ పోతాడు. ఈ క్రమంలో జర్నలిస్టు అయిన
సమీర ( కృతి) అతని గురించి తెలుసుకోవాలని భావించి అతని సహాయం చేస్తుంది.
అలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కానీ ఎవరో కొందరు గౌతమ్ పై దాడి
చేసే ప్రయత్నం చేస్తుంటారు. మరి వారు ఎవరు ? గౌతమ్ ఎవరు ? వాళ్ళ
తల్లిదండ్రుల్ని ఎవరు ఎందుకు చంపారు ? చివరికి మహేష్ కి నిజం తెలుస్తుందా
అన్నది తెర పై చూడాలి.
టాలీవుడ్ దర్శకులందరిలో
దర్శకుడు సుకుమార్ డిఫరెంట్. వైవిధ్య ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా పేరు
తెచ్చుకున్న ఈయన సినిమాలు కూడా డిఫరెంట్. 100 పర్సెంట్ లవ్ చిత్రం తరువాత
చాలా గ్యాప్ తీసుకొని ఓ వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాను టాలీవుడ్
సూపర్ స్టార్ పిన్స్ మహేష్ భాబును హీరోగా పెట్టి హాలీవుడ్ రేంజ్ లో తీశాడు.
ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చేయనటువంటి సినిమాను ఓ సామాన్య ప్రేక్షకుడి
దూరంగా వెళ్లి ఆలోచించి తీశాడు. మరి ఎప్పటి నుండో భారీ అంచనాలతో ఉన్న
సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి నుండి ఆయన
చెబుతున్నట్లుగా ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త తరహా చిత్రం అయ్యిందా ? లేక
అందరి అంచాలను తలకిందులు చేసిందా ? సుకుమార్ ఆలోచల్ని సామాన్య ప్రేక్షకుడు
ఏ మాత్రం అర్థం చేసుకున్నాడు అనేది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.
మహేష్ బాబు... టాలీవుడ్ లో ఇతని
అందంతో పాటు నటనకు ఎక్కడ వంక పెట్టేవారు ఉండరు. ఇప్పటి వరకు చేసిన
చిత్రాల్లో తానేంటో నిరూపించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా
అందుకున్న ఆయనకు ఆయనే సాటి. గత రెండు చిత్రాల్లో సాఫ్ట్ గా , సరదాగా
కనిపించిన మహేష్ ఈ చిత్రంలో మాత్రం ఇంత వరకు కనిపించని విధంగా కనిపించి
తనకు ఇచ్చిన పాత్రకు తగ్గ అభియాన్ని ప్రదర్శించి ఇలాంటి పాత్రలు ఇతని కోసమే
రాస్తారేమో అన్నట్టు ఒక స్టార్ నటుడి నటన ఎలా ఉంటుందో పరిక్షించే స్థాయిలో
అయన నటించారు.
ఈ సినిమా కథలో పసలేకుండా కంటెంట్ ఎక్కువగా
ఉన్నప్పటికి తన నటనతో ప్రేక్షకుల్ని అలానే కూర్చునే విధంగా చేశాడు. ఇక
ఇందులో తన బాడీనీ కూడా మార్చేసి కొత్త దనంగా కనిపించిన ఈయన స్టెప్పులు కూడా
ఇరగ దీశాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో మహేష్ నటనకు నూటికి నూరు
మార్కులు వేయవచ్చు. మహేష్ సరసన తొలిసారే అవకాశం దక్కించుకున్న కృతి సనన్ తన
అందంతో బాగానే ఆకట్టుకుంది నటనలో కూడా ఫర్వాలేదనిపించింది.
ఇక ఇందులో మిగతా పాత్రలు పోషించిన వారిలో
పోసాని కృష్ణ మురళి సుకుమార్ సినిమా కాదా అని కొత్తగా చేయాలని ట్రై చేశాడు
కానీ, ఆ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోయే సరికి తేలిపోయాడు. విలన్
పాత్రలు పోషించిన నాజర్ , ప్రదీప్ రావత్ , సాయాజీ షిండే , కెల్లీ దోర్జీ
మొదలగు వారి నటన సాధారణంగానే ఉంది. ఓవరాల్ గా వీరందరి నటనను మహేష్ డామినేట్
చేశాడు.
సాంకేతిక వర్గం :
తొలి సారిగా మహేష్ బాబు సినిమాకు సంగీతం
అందించిన దేవీ శ్రీ ప్రసాద్ మంచి ట్యూన్లు ఇచ్చాడు. ఆడియో విడుదల తరువాత
ఈయన సంగీతం వింటూ వింటూ పోతే అర్ధం అవుతుందని చెప్పిన దర్శకుడి మాట నిజం
అయింది. బయట ప్రేక్షకాదరణ పొందిన ‘సయోనరా ’, ‘యు ఆర్ మై లవ్ ’ పాటలు
థియేటర్లో ఇంకా బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా ఉండటంతో ఆ
సన్నివేశాల్లో ఉండే మైనస్ లు కనిపించకుండా పోయాయి. ప్రముఖ సినిమాటో
గ్రాఫర్ అయిన రత్నవేలు చిత్రీకరించిన ప్రతి సన్నీవేశం సినిమాకే కాక, తెలుగు
తెర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాలను
చిత్రీకరించిన వైనం, లండన్ మరియు గోవా అందాలను తెలుగు తెర మీద చాలా
అద్భుతంగా చూపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా
తెరకెక్కించిన ఈ సినిమా లెన్త్ చాలా ఎక్కువైంది. దాదాపు మూడు గంటలపాటు
ఉండటంతో ప్రేక్షకులు కాస్తంత నిరాశకు గురవుతారు. ఎడిటింగ్ విషయంలో చాలా కట్
చేయాల్సింది. అనవసర సన్నివేశాలు మొహమాట పడి కట్ చేయనట్లు అనిపిస్తుంది.
No comments:
Post a Comment