Bollywood Heroines For Chiru 150 Film చిరంజీవి 150 కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ?
మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా చేస్తానని ఇటీవల తనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఎప్పటి నుండో అనుకుంటున్న ఈ చిత్రం పై చాలా రోజుల తరువాత క్లారిటీ రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నా చిరంజీవి త్వరలో ముఖానికి రంగేసుకోబోయే ఈ చిత్రం ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ? ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు ? ఇందులో నటించబోయే హీరోయిన్స్ ఎవరు ? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్థార్ చిరంజీవి ఇమేజ్ కి, పేరుకు తగ్గట్లు ఉండే టైటిలే కాకుండా ఆయన పేరు కూడా కలిసి వచ్చే విధంగా ఓ మంచి టైటిల్ వెతికే పనిలో ఉన్నారట. ఇక కథ విషయానికి వస్తే ఇన్ని రోజులు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టోరీతో సినిమా ఉంటుందని, అది తనకు ఫేవరగా ఉండే విధంగా ఉండేలా చూసుకుంటాడని వార్తలు వచ్చినా, ఈయన చేయబోయే సినిమా ఇంద్ర సినిమా లాంటి ఫవర్ ఫుల్ స్టోరీతో ఠాగూర్ సినిమా లాగా సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉంటూ మంచి ఎంటర్ టైనర్ గా ఉండే విధంగా కథ తయారు చేస్తున్నారని అంటున్నారు.

కథ, టైటిల్ కి తగ్గట్లు చిరంజీవి బాడీనీ మలచడానికి ప్రత్యేక ట్రైనర్లను కూడా పిలిపించి బాడీనీ ట్యూన్ చేస్తున్నారట. ఇక హీరోయిన్స్ కి కథకు, చిరు ఇమేజ్ కి తగ్గట్లు నార్త్ ఇండియన్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న దీపికా పదుకునే, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా లాంటి పేర్లనే కాకుండా, సౌత్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న సమంతాల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. వీరిలో చిరుకు ఎవరు కరెక్టుగా సరిపోతారో వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని చేయబోతున్న ఈ సినిమా విషయంలో రాజీ పడటం లేదు. అసలే చిరంజీవి సినిమా అంటే హీరోయిన్లు నటించడానికి క్యూ కడతారు. మరి అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో ఈ మల్టీపుల్ హీరోయిన్లను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ సినిమా గురించి మరిన్ని హాట్ న్యూస్ త్వరలో మీకందిస్తాం. చదువుతూనే ఉండండి తెలుగు విశేష్.
చిరంజీవి 150 కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ?

No comments:
Post a Comment