జబర్దస్త్ టీవీ షో కమెడియన్ వేణుపై దాడి జరిగింది. ఫిలింనగర్ లో ఉండగా ఆయనపై గౌడ సంఘం కార్యకర్తలు దాడి చేశారు. ఈనెల 18న వేణు నటించిన స్కిట్ లో గౌడ వర్గ మనోభావాలు దెబ్బతినేవిధంగా స్కిట్ చేశారని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిపై పోలిసులు కేసు నమోదు చేశారు. కల్లు వృత్తిని, గౌడ కులస్తుల శ్రామిక జీవన విధానాన్ని కించపర్చేలా స్కిట్ ఉందని ఆరోపిస్తూ మూడ్రోజుల క్రితమే పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పై స్పందించిన ఓయూ పోలిసులు వేణుపై ఐపీసీ సెక్షన్లు 323, 506 ప్రకారం కేసుపెట్టారు.
Click Here to View Full Story
No comments:
Post a Comment