టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.., ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ మద్య హీరోయిన్ మారిందనీ.., ఏకంగా సినిమానే ఆగిపోయిందని రూమర్లు వచ్చినా అవన్నీ అబద్దమంటూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., త్వరలోనే మూవీ యూనిట్ దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. సినిమాలో కొన్ని సీన్లను అక్కడ షూట్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫారిన్ టూర్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు.., హీరోయిన్ శృతి హాసన్ కూడా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఆఫ్రికాలో పాటలతో పాటు, కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపింది.
Read Full Story Here
No comments:
Post a Comment