Showing posts with label Jr NTR with Kareena Kapoor. Show all posts
Showing posts with label Jr NTR with Kareena Kapoor. Show all posts

Wednesday, 10 April 2013

Jr NTR And Kareena Kapoor To Act Together



యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఇద్దరు కలిసి నటించబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వీరు నటించబోయేది వాస్తమే కానీ... సినిమాలో కాదు... ఓ బంగారం షాపు యాడ్ లో. ఇప్పటికే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ లోనే కరీనా కపూర్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరపనున్నారు. యాడ్ చిత్రీకరించి టీవి లకు ఇస్తారు. చాలా పెద్ద బడ్జెట్ తో ఈ యాడ్ నిర్మాణం కానుందని సమాచారం.  

ఆ విషయం ప్రక్కన పెడితే ఎన్టీఆర్ ఇప్పుడు తాను నటించిన ‘బాద్ షా ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమా విజయ ఆనంద క్షణాలను కొన్ని చెప్పాడు. నా కెరీర్‌లో గొప్ప విజయాన్ని నాకు అందించిన దర్శకుడు, నా అన్న.. శ్రీను వైట్లకు కృతజ్ఞతలు. కేవలం ఆయన్ని నమ్మే యేడాదిపాటు ఈ సినిమాతో ప్రయాణం చేశా. ఈ సినిమా హిట్టవ్వకపోతే.. పరిశ్రమలో ఉండలేనేమో అనే ఆలోచనలు ఎంత మాత్రం లేవు. నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా దైవం ఎన్టీఆర్‌ అండదండలు నాకెప్పటికీ ఉంటాయి. అభిమానుల ప్రోత్సాహం కూడా మర్చిపోలేనుఅన్నారు.