యంగ్
టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఇద్దరు కలిసి నటించబోతున్నారా
? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వీరు నటించబోయేది వాస్తమే కానీ...
సినిమాలో కాదు... ఓ బంగారం షాపు యాడ్ లో. ఇప్పటికే మలబార్ గోల్డ్ అండ్
డైమండ్స్ యాడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ లోనే కరీనా కపూర్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన ఫోటో
షూట్ కూడా జరపనున్నారు. యాడ్ చిత్రీకరించి టీవి లకు ఇస్తారు. చాలా పెద్ద
బడ్జెట్ తో ఈ యాడ్ నిర్మాణం కానుందని సమాచారం.
ఆ విషయం ప్రక్కన పెడితే
ఎన్టీఆర్ ఇప్పుడు తాను నటించిన ‘బాద్ షా ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమా విజయ ఆనంద క్షణాలను కొన్ని చెప్పాడు. నా
కెరీర్‌లో గొప్ప విజయాన్ని నాకు అందించిన దర్శకుడు, నా అన్న.. శ్రీను
వైట్లకు కృతజ్ఞతలు. కేవలం ఆయన్ని నమ్మే యేడాదిపాటు ఈ సినిమాతో ప్రయాణం
చేశా. ఈ సినిమా హిట్టవ్వకపోతే.. పరిశ్రమలో ఉండలేనేమో అనే ఆలోచనలు ఎంత
మాత్రం లేవు. నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా దైవం ఎన్టీఆర్ అండదండలు
నాకెప్పటికీ ఉంటాయి. అభిమానుల ప్రోత్సాహం కూడా మర్చిపోలేనుఅన్నారు.
No comments:
Post a Comment