Showing posts with label nayak movie collection news. Show all posts
Showing posts with label nayak movie collection news. Show all posts

Wednesday, 9 January 2013

Nayak Movie Collections

c
       
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ ‘నాయక్’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి మురిసిపోతున్నారు. నాయక్ ప్రమోషన్లో భాగంగా హైదరబాద్ వచ్చిన కాజు, చరణ్ తో కలిసి నాయక్ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ సందర్శించారు. ఈ సందర్భంలో కాజల్  మాట్లాడుతూ మగధీర సమయంలో రెండేళ్ళు కలిసి పనిచేశాం. అందుకని చరణ్ తో కలిసి పనిచేయడం ఈజీగా అయిపోయింది. మగధీరకి వచ్చిన స్థాయిలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వివి వినాయక్ కి స్పెషల్ థాంక్స్ అని సెలవిచ్చింది. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతితెలిసిందే. 
        ఇదిలా రిలీజ్ రోజైన నిన్న రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ‘నాయక్’ సినిమా రెండోరోజైన ఇవాళ కూడా అదే హవా కొనసాగిస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి సెలవుల సీజన్ కి ముందు విడుదల కావడం, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవులు  ఉండటంతో కలక్షన్లు మరింత భారీగా ఉండే  అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే, నైజాం, ఉత్తరాంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ఓపెనింగ్ డే  నాడు ‘నాయక్’ రికార్డు  కలెక్షన్లు నమోదయ్యాయి.   చరణ్ యాక్షన్, డాన్సులు, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
...avnk