Showing posts with label nayak movie review. Show all posts
Showing posts with label nayak movie review. Show all posts

Wednesday, 9 January 2013

Nayak Movie Collections

c
       
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ ‘నాయక్’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి మురిసిపోతున్నారు. నాయక్ ప్రమోషన్లో భాగంగా హైదరబాద్ వచ్చిన కాజు, చరణ్ తో కలిసి నాయక్ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ సందర్శించారు. ఈ సందర్భంలో కాజల్  మాట్లాడుతూ మగధీర సమయంలో రెండేళ్ళు కలిసి పనిచేశాం. అందుకని చరణ్ తో కలిసి పనిచేయడం ఈజీగా అయిపోయింది. మగధీరకి వచ్చిన స్థాయిలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వివి వినాయక్ కి స్పెషల్ థాంక్స్ అని సెలవిచ్చింది. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతితెలిసిందే. 
        ఇదిలా రిలీజ్ రోజైన నిన్న రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ‘నాయక్’ సినిమా రెండోరోజైన ఇవాళ కూడా అదే హవా కొనసాగిస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి సెలవుల సీజన్ కి ముందు విడుదల కావడం, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవులు  ఉండటంతో కలక్షన్లు మరింత భారీగా ఉండే  అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే, నైజాం, ఉత్తరాంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ఓపెనింగ్ డే  నాడు ‘నాయక్’ రికార్డు  కలెక్షన్లు నమోదయ్యాయి.   చరణ్ యాక్షన్, డాన్సులు, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
...avnk

Tuesday, 8 January 2013

Producer Dil Raju

movie  Producer Dil Raju

 ప్రముఖ నిర్మాత  దిల్ రాజు కు అనుకొని కష్టం వచ్చి పడింది.  దిల్ రాజు నిర్మాత గా  నిర్మించిన సినిమా  సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సంకాంత్రి పండుగకు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే  ముందు  మరో  పెద్ద  సినిమా విడుదల అవుతుంది.   అయితే ఈ రెండు సినిమాలు  ఫిలింనగర్  పెద్దలను టెన్షన్ కు గురి చేస్తున్నాయి.  దిల్ రాజు   మొదట  నాయక్   సినిమా  నైజాం రైట్స్  తీసుకోవడానికి  అడ్వాన్స్ కూడా ఇచ్చిన  దిల్ రాజ్  లాస్ట్  నిమిషాంలో  వెనక్కి తగటం పై  నాయక్  సినిమా హీరో  రామ్ చరణ్,   సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు  హీరో మహేష్ బాబు  దిల్ రాజు ను పిలిచి  తిట్ల వర్షం కురిపించినట్లు  ఫిలింనగర్లో  టాక్.   ఈ రెండు  సినిమాలు  ఒకే వారంలో  విడుదల కావటంతో  దిల్ రాజు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.  ఇప్పటికి నాయక్  సినిమా కోసం  1210 థియేటర్స్  రెడీ అయినట్లు తెలుస్తోంది.  దిల్ రాజ్  నైజాం ఏరియా తీసుకుంటే,  తన సినిమా కు  థియేటర్స్  తగ్గుతాయి కాబట్టి ,  మన సినిమాను ఒక వారం వాయిదా వేద్దామాని  మహేష్ బాబు చెప్పటం, మహేష్ బాబు  సీరియస్ గా దిల్ రాజు ను అరిచినట్లు  ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు.  మహేష్ తిట్టిన తిట్లతో  దిల్ రాజు  నేరుగా  రామ్ చరణ్ వద్దకు వెళ్లి  అసలు విషయం చెప్పిటంతో.. అక్కడ కూడా సేమ్  రియాక్షన్  వచ్చేసరికి  ఎందుకొచ్చిన  గొడవ అని నైజాంలో   నాయక్  సినిమా  నేను రిలీజ్ చేయలేనని  చెప్పినట్లు  టాలీవుడ్ సమాచారం. అంతేకాకుండా  దాసరి  నారాయణ రావు  కూడా  రావటంతో  దిల్ రాజు  వెనక్కి తగ్గినట్లు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  మొత్తం మీద దిల్ రాజు ఇద్దరు హీరోలతో  తిట్లు తినటంతో   ఆయనకు అవమానం జరిగినట్లుగా ఉందని  తన సన్నిహితులతో  చెబుతున్నట్లు టాలీవుడ్ సమాచారం.