Tuesday 18 December 2012

Mega Power Ram Charans Nayak Audio Release

mega power ram charans nayak audio release

    మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్,  హీరోయిన్ కాజల్ , అమలాపాల్ , వినాయక్ దర్వకత్వంలో  నటించిన  సినిమా నాయక్.  నాయక్ ఆడియో ఫంక్షన్ వేడుక  అభిమానుల సందడితో ఘనంగా జరిగింది.  అయితే నాయక్ ఆడియో ఫంక్షన్ కు  కేంద్ర మంత్రి  మెగా స్టార్  చిరంజీవి  రాకపోవటంతో అభిమానులు  కొత్త నిరాశ చెందారు. అయితే  మెగా స్టార్  చిరంజీవి స్థానంలో .. ఆయన సతిమణి  రామ్ చరణ్ తల్లి సురేఖ రావటంతో .. నిరాశతో అభిమానులకు ఉపచమనం కలింగింది. నాయక్ ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హాజరుకాడని కొన్ని మీడియా పత్రికలు  రాయటం జరిగింది.  అలాంటి మీడియా  పత్రికలకు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నోళ్లు మూయించారు.  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రాకతో  మెగా అభిమానులు మరింత ఉత్సహంగా కనిపించారు. పవన్ రాకతో  ఒక్కసారిగా  ఫంక్షన్ హాలు మొత్తం  హర్షధ్వనులతో మారుమోగిపోయింది.  మెగా కుటుంబం నుండి  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  రామ్ చరణ్ తేజ్ , రామ్ చరణ్  భార్య ఉపాసన , చిరంజీవి సతిమణి సురేఖ, అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,  రామ్ చరణ్  సోదరి, పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ హాజరవ్వటంతో.. మెగా అభిమానులకు ఆడియో వేదిక మీద మెగా కుటుంబాన్ని  చూసే అద్రుష్టం కలిగింది. 

mega power ram charans nayak audio release

   ఆడియో ఫంక్షన్ కు ఇద్దరు  అందాల భామలతో  వేదిక మరీ అందంగా తయారైంది. హీరోయిన్ కాజల్  పసుపు వర్ణం డ్రెస్ తో  మెగా అభిమానులకు కనువింద్ చేసింది. నాయక్ సినిమాలో  సెకండ్ హీరోయిన్ అయిన  అమలా పాల్.. ఎరుపు రంగు సెక్సీ డ్రెస్ లో  మెగా అభిమానులకు మతిపొగట్టింది. ఆడియో ఫంక్షన్ లో  రామ్ చరణ్  కొంచెం ఆవేశానికి గురైనట్లు తెలుస్తుంది.  రామ్ చరణ్  మాట్లాడుతూ  నాన్న ఈ వేడుకకి రాలేకపోయిన  ఆ లోటుని  కళ్యాణ్ బాబాయ్  తీర్చారని ఉద్రేకంగా చెప్పారు.  మెగా ప్యామిలీలో  నాన్న తరువాత నేను కాదు.  ఆ స్థానం  పవన్  బాబాయ్ దే. ఆయన్ని ఎవరైనా  ఏమైనా అంటే   నేను ఊరుకోను  అని రామ్ చరణ్ ఆవేశంతో  ఉక్రోశంగా  అన్నారు. ఇటీవల కాలంలో  రచ్చ పాటల వేడుకకు బాబాయ్  రాలేదని  రకరకాల  కథనాలు  వినిపించారు.   వేదికపై  అఅందరు ఉంటేనే  మా మధ్య ప్రేమ ఉన్నట్టు కాదు.  మా మద్య ఎలాంటి  అనుంబంధం ఉందో   మాకు తెలుసు.  మా నాన్నకి , బాబాయ్ కి  మధ్య ఎలాంటి  అనుబంధం  ఉందో, నాకు బాబాయ్ కి మద్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు.  నేను  చేయబోయే  తరువాత  సినిమా పాటల వేడుకకు  కూడా మా కళ్యాణ్ బాబాయ్  రాకపోవచ్చు.  అంతమాత్రానికే  మా మధ్య  ప్రేమ లేదనుకోవద్దు. 

mega power ram charans nayak audio release

   ఇలాంటి  లేనిపోని కథనాలు  వస్తే నేను పట్టించుకోను .  ఇలాంటి  విషయాలను  గురించి, ఓ పత్రిక, ఓ ఛానల్ ఏం రాసినా  అది నాకు  వెంట్రుకతో  సమానం అని రామ్ చరణ్ అన్నారు.   అంతేకాకుండా 37 యేళ్లుగా  మా మద్య ఉన్న  అనుబంధాన్ని  ఏ  ఛానల్  కూడా వీడదీయలేదని  చరణ్ అన్నారు.   వినాయక్  ఒక దర్శకుడు కాదు , నాకు ఇంకో బాబాయ్ లాంటి వాడన్నారు.   అయితే చివరిగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ   సరైన పరిస్థితుల, అవసరం  ఉంటే తప్ప నాకు  మాట్లాడాలని అనిపించదు.  అందరూ సంతోషంగా  ఉండాలి. చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా   మా కుంటుంబలోని వారే.  రామ్ చరణ్   డ్యాన్సుల్ని   నేను ఎంతగానో  ఆస్వాదిస్తాను  అని పవన్ మాట్లాడటం జరిగింది.  కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం  ఆన్ లైన్ లో మాట్లాడి  మెగా అభిమనులను  ఆనందం నింపారు.  నాయాక్  ఆడియో తో   మెగా బ్రదర్స్ మద్య విభేదాలు లేవని  మెగా అభిమానులకు కోసం రామ్ చరణ్  చెప్పటం జరిగిందని  అన్నారు. 

mega power  ram charans nayak audio release

No comments:

Post a Comment