Thursday 8 August 2013

Shahrukh Eid Presentation Chennai Express

spacer

షారుఖ్ రంజాన్ కానుక

షారుఖ్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ ఇప్పటికే సినీ ప్రేమికులలో అమితమైన ఉత్కంఠను రేపింది.  ఒకప్పుడు దక్షిణ భారతీయులను అనుకరించిన మెహమూద్ హిందీ సినిమా రంగంలో పేరు సంపాదించారు.  అగ్ర నాయకుడిగా, యాక్షన్ హీరోగా పేరుగాంచినా, షారుఖ్ ఖాన్ కూడా అదే పంథాలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న తమిళ ముక్కలతో తమిళ యాసతో హిందీ ప్రేక్షకులను అలరించారు.  ఇప్పుడు ఏకంగా చెన్నై ఎక్స్ ప్రెస్ పేరుతోనే పూర్తి నిడివి తమిళ నేపథ్యంలో వినోద భరితమైన సినిమాలో నటించిన సినిమా రేపు విడుదల కాబోతోంది.

ఈ సినిమాను యుటివి, రెడ్ చిల్లీస్ సంయుక్తంగా నిర్మించాయి.  ఈ సినిమాను రంజాన్ మాసాంతంలో ఈద్ నాడు విడుదల చెయ్యటం మాత్రమే కాకుండా, విదేశాలలో ఇంతవరకూ ఎప్పుడూ చెయ్యనన్ని థియేటర్లలో ఒకే సమయంలో విడుదల చేస్తున్నారు.  50 కంటే ఎక్కువ దేశాలలో 700 మించిన సినీ పరదాల మీద ఏక కాలంలో విడుదల కాబోతున్న చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా మొదటిసారిగా మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, పెరు, ఇజ్రాయిల్ లో కూడా అదే రోజు అదే సమయానికి విడుదల కావటం చరిత్రను సృష్టిస్తోంది. 

షారుఖ్ ఖాన్ కున్న అభిమానగణం ఎక్కువగా ఉండటంతో పాటు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సమయం వలన ముస్లిం దేశాలైన ఇండోనేషియా, గల్ఫ్, మలేసియా, సింగపూర్ లలో రంజాన్ సంబరాల మూలంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది.  ఈ సమయం అందరికీ విలువైనదే కాబట్టి అంతర్జాతీయంగా ఎన్నో నిర్మాణ సంస్థలు థియేటర్లకు పోటీపడతాయి.  అలాంటి సందర్భలో చెన్నై ఎక్స్ ప్రెస్ ఆయా దేశాల్లో థియేటర్లను దక్కించుకోవటం కూడా గొప్పే.

చాలా చోట్ల సినిమా టికెట్ రేట్లు కూడా 40 శాతం వరకు పెరిగిపోయాయి.  అయినా పరవాలేదు- దటీజ్ షారుఖ్ అంటున్నారు దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు. 

- See more at: http://www.teluguwishesh.com/teluguhome/376-topnews/46575-sharuk-eid-presentation-chennai-express.html#sthash.0h8JQch7.dpuf

No comments:

Post a Comment