Friday 13 December 2013

Madhumati Telugu Movie Review


Madhumathi_TW

Madhumati Telugu Movie Review Rating :   1/5   1/5  Stars
  • చిత్రంమధుమతి
  • బ్యానర్గ్యాప్ బ్యానర్
  • దర్శకుడురాజ్ శ్రీధర్
  • నిర్మాతకడియం రమేష్
  • సంగీతంరాజ్ కిరణ్
  • సినిమా రేటింగ్     
  • ఛాయాగ్రహణంరాజ్ శ్రీధర్
  • విడుదల తేదిడిసెంబర్ 13, 2013
  • నటినటులుఉదయభాను, విష్ణు ప్రియన్, వేణు

Cinema Story
తెలంగాణ శకుంతల చిన్న కుమారుడు అయిన కార్తీక్ కి తన బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తుంది. కానీ కార్తీక్ ని ఆడవాళ్ళన్నా, పెళ్ళన్నా పెద్దగా ఇష్టం ఉండదు. కానీ కార్తీక్ వాళ్ళ బామ్మ పెళ్ళి చేయాలని పట్టబట్టి ఓ ముహూర్తం పెడతారు. పరిస్థితి గమనించిన కార్తీక్ ఇంట్లో వాళ్ళకు తనకు పెళ్ళయిందని ఓ చిన్న అబద్దం ఆడతాడు. దీంతో ఇంట్లో వాళ్లను భార్యను తీసుకురమ్మని చెప్పడంతో... దాంతో మధుమతి అనే వేశ్యను భార్యగా నటించాలని కొ్న్ని రోజుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటాడు. మధుమతిని భార్యగా ఇంట్లోవాళ్లకు పరిచయం చేస్తాడు. మధుమతిలో మంచితనం, కార్తీక్ ప్రవర్తన తీరుతో ఇద్దరూ పరస్పరం ఇష్టపడతారు. చివరికి వారి ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. కార్తీక్, మధుమతి కలుస్తారా ? అన్నది తెర పై చూడాల్సిందే.
cinima-reviews
మధుమతి 
దశాబ్దకాలానికి పైగా బుల్లితెర ప్రేక్షకులను తన అద్భుతమైన గొంతుతో, కవ్వింపు మాటలతో అలరించిన యాంకర్ ఉదయభాను మెల్లిగా వెండితెర పై అతిథి పాత్రలు, ఐటెం సాంగుల్లో మెరిసి ఇప్పుడు ఏకంగా తానే హీరోయిన్ గా నటించే స్థాయికి వచ్చింది. ఉదయభాను  ఎక్స్ ప్రెషన్స్ కి, ఆమె అందచందాలకు తగిన కథతో ముందుకు వచ్చి అన్నీ తానై ఉదయభానును ‘మధుమతి ’గా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. శృంగార భరితంగా ప్రారంభం నుండే పాపులర్ అయిన ఈ సినిమా పై తెలుగు రసిక ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆది నుండి విడుదల వరకు వివాదాలతో అలజడిని స్రుష్టించి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మధుమతి ప్రేక్షకుల మదిని ఏ మాత్రం దోచుకుందో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.
లేడి ఓరియెంటెడ్ చిత్రం తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది శ్రుంగార చిత్రం అయితే అన్నీ పక్కాగా ఉంటేనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలదు. ఎంచుకున్న హీరోయిన్ ఆ పాత్రకు న్యాయం చేయగలదా ? ఎలాగు శ్రుంగార భరిత చిత్రం కాబట్టి ఎవరైనా ఫర్వాలేదు అని తీసుకోకూడదు. ఏదో నాలుగు సీన్లు హాట్ హాట్ గా చిత్రీకరించి డబ్బులు పోగేసుకుందామనుకోవడం అస్సలు కుదరదు. కానీ మధుమతి సినిమా, ఉదయభాను నటన ఆ స్థాయిలో లేదు. సలే చిత్రం అదోలా ఉందంటే ఇక సెన్సార్ బ్లర్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని చిరాకు పెట్టిస్తుంది.

ఇలాంటి సినిమాల్లో ఎప్పుడైతే ఆడియన్స్ సినిమాలోని పాత్రలకి కనెక్ట్ కాలేరో అప్పుడు ఆ సినిమా కంచికి వెళ్లిపోయినట్లే. ఇక్కడ అదే జరిగింది. గతంలో ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాలతో పోలిస్తే ఇది ఇంకా వరస్ట్. కేవలం ఉదయభాను ఉందనే కాన్సెప్ట్ తో సినిమాకు వెళితే అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఉదయభానును ఓ హాట్ లేడీగా భావించే రసిక జనాలను మాత్రమే ఈ సినిమా కొంత వరకు ఆకట్టుకుంటుంది. ఏ క్లాస్ ప్రేక్షకులకు సూటయ్యే సినిమా కానే కాదు.  ఈ చిత్రంపై నెలకొన్న వివాదాలు, చిత్ర నిర్మాతలపై  ఉదయభాను హాట్ హాట్  వ్యాఖ్యలు ‘మధుమతి ’కి ఏ మాత్రం కాసులు కురిపిస్తాయో చూడాలి.
Cinema Review

ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన ఉదయభాను నటనలో కొత్తేం కాదు. ఇప్పటికే వెండితెర పై నటించిన ఈమె ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్లు నటించే ప్రయత్నం చేసింది. సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వేశ్యగా ఉదయభాను పూర్తి స్థాయిలో రాణించలేక పోయింది. మధుమతి పాత్రకు మంచి మార్కులే వేసుకున్నా, ఫెర్మామెన్స్ పరంగా అక్కడక్కడ తేలిపోయింది. కార్తీక్ పాత్రలో హీరోగా శివకుమార్  అంతంత మాత్రమే చేశాడు. ఇందులో ఇద్దరు కమేడియన్స్ ఉన్నా వారిని పూర్తి స్థాయిలో వాడుకోక పోవడంతో హస్యం అంతంత మాత్రంగానే ఉంది. మిగతా వారు పాత్రలు పోషించినా వారి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే కావడంతో కనీసం కొత్తగా చూపించలేక పోయాడు.

కళాకారుల పనితీరు
ఈ సినిమాకు అన్నీ తానైన రాజ్ శ్రీధర్ ఏ ఒక్క విభాగంలో ఆకట్టుకోలేక పోయాడు. దర్శకుడిగా, స్టోరీ పరంగా, స్త్ర్కీన్ ప్లే ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు.  సినిమాటోగ్రఫీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం కూడా బాలేదు. ఎడిటింగ్ కూడా అందరిలానే బాలేదు. నిర్మాణ విలువలు యావరేజ్. కామెడీని, సన్నివేశాన్ని బట్టి పెట్టిన కొన్ని సంభాషణలు తేలిపోయాయి. కొన్ని సందర్భాల్లో అర్థమే లేకుండా పోయాయి.

Madhumati Telugu Movie Review, Udaya Bhanu Madhumathi Movie Review, Madhumathi Telugu Movie Review, Madhumati Telugu Movie Review and Rating, Madhumathi Telugu Movie Review and Rating, Madhumathi Movie Stills, Madhumati Movie Wallpapers, Madhumathi Movie Songs, Madhumati Movie Trailers, Madhumati Movie Videos, Madhumati Movie Photos, Madhumati Telugu Movie Press Meet, Madhumati Telugu Movie Release Date, Telugu Movie Reviews, Movie Ratings, Cinema Reviews, Tollywood Movie Review, Director Raaj Shreedhar, Cast and Crew, Udaya Bhanu, Vishnu Priyan , Seeta.

No comments:

Post a Comment