ఈద్ ముబారక్

సంవత్సరంలో ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈద్ ఉల్ ఫిత్ర్ ఒకటి.
చాంద్రమానం ప్రకారం ముస్లింలు అనుసరించే పంచాంగం ప్రకారం తొమ్మిదవ నెల
రంజాన్. ఈ రంజాన్ మాసంలో పగటి పూటంతా ఏమీ తినకుండా తాగకుండా, కనీసం పచ్చి
మంచినీళ్ళైనా తీసుకోకుండా గడిపి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే తిని గడపటం
ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజుల్లో కనీసం నాలుగు సార్లు నమాజు చెయ్యటం,
ఖురాన్ చదివి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యటం చేస్తారు.
రంజాన్ మాసాంతంలో ప్రార్ధనలు అయిన తర్వాత పదవ నెలయిన షవ్వల్ లో మొదటి రోజు పండుగ జరుపుకోవటమే ఈద్ ఉల్ ఫిత్ర్. రంజాన్ మాసంలో వారి ఉపవాస దీక్ష విజయవంతమైన సంబరాలు చేసుకునేదే ఈద్ ఉల్ ఫత్ర్. ఈ రోజు రెండు నకాత్ లు చేసిన తర్వాత శ్రద్ధగా మతాధికారుల హితోపదేశాలు విని, ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముబారక్ (అభినందన) తెలుపుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు.
కొందరు ముస్లింలు షవ్వల్ లో ఆరురోజుల పాటు ఉపవాసం చేస్తారు. రంజాన్ నెలతో పాటు షవ్వల్ లో ఆరు రోజులు చేసే ఉపవాస దీక్ష సంవత్సరమంతా చేసినదానితో సమానమని వారి నమ్మకం. అయితే షవ్వల్ లో మొదటి రోజు ఉపవాసం చెయ్యటం నిషేధం. ఈ రోజు అందరూ పండుగ జరుపుకునేరోజు. కాబట్టి రెండవ రోజు నుంచి ఆరు రోజులు ఉపవాస దీక్షలో కొందరు పాల్గొంటారు.
ఈద్ రోజున పండుగ ప్రార్ధనలు పూర్తైన తర్వాత ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు పండుగకు కావలసిన కొనుగోళ్ళు చేస్తారు. కొత్తబట్టలు, చెప్పులు, టోపీలు వగైరాలు. హైద్రాబాద్ లో లాల్ దర్వాజా దగ్గర మహిళలు గాజులు, స్త్రీల అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు.
రాష్ట్రమంతా ఈద్ ఉల్ ఫిత్ర్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు విశేష్ తరఫునుంచి ముస్లింలందరికీ ఈద్ ముబారక్.

No comments:
Post a Comment