Showing posts with label megastar chiranjeevi. Show all posts
Showing posts with label megastar chiranjeevi. Show all posts

Thursday, 16 January 2014

Bollywood Heroines For Chiru 150 Film

Bollywood Heroines For Chiru 150 Film  చిరంజీవి 150 కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ?

చిరంజీవి 150 కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ?


Bollywood heroines for chiru 150 film.gif

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా చేస్తానని ఇటీవల తనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఎప్పటి నుండో అనుకుంటున్న ఈ చిత్రం పై చాలా రోజుల తరువాత క్లారిటీ రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నా చిరంజీవి త్వరలో ముఖానికి రంగేసుకోబోయే ఈ చిత్రం ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ? ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు ? ఇందులో నటించబోయే హీరోయిన్స్ ఎవరు ? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

ప్రస్తుతం ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్థార్ చిరంజీవి ఇమేజ్ కి, పేరుకు తగ్గట్లు ఉండే టైటిలే కాకుండా ఆయన పేరు కూడా కలిసి వచ్చే విధంగా ఓ మంచి టైటిల్ వెతికే పనిలో ఉన్నారట. ఇక కథ విషయానికి వస్తే ఇన్ని రోజులు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టోరీతో సినిమా ఉంటుందని, అది తనకు ఫేవరగా ఉండే విధంగా ఉండేలా చూసుకుంటాడని వార్తలు వచ్చినా, ఈయన చేయబోయే సినిమా ఇంద్ర సినిమా లాంటి ఫవర్ ఫుల్ స్టోరీతో  ఠాగూర్ సినిమా లాగా సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉంటూ మంచి ఎంటర్ టైనర్ గా ఉండే విధంగా కథ తయారు చేస్తున్నారని అంటున్నారు.

chiru heroines

కథ, టైటిల్ కి తగ్గట్లు చిరంజీవి బాడీనీ మలచడానికి ప్రత్యేక ట్రైనర్లను కూడా పిలిపించి బాడీనీ ట్యూన్ చేస్తున్నారట. ఇక హీరోయిన్స్ కి కథకు, చిరు ఇమేజ్ కి తగ్గట్లు నార్త్ ఇండియన్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న దీపికా పదుకునే, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా లాంటి పేర్లనే కాకుండా, సౌత్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న సమంతాల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. వీరిలో చిరుకు ఎవరు కరెక్టుగా సరిపోతారో వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని చేయబోతున్న ఈ సినిమా  విషయంలో రాజీ పడటం లేదు. అసలే చిరంజీవి సినిమా అంటే హీరోయిన్లు నటించడానికి క్యూ కడతారు. మరి అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో ఈ మల్టీపుల్ హీరోయిన్లను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ సినిమా గురించి మరిన్ని హాట్ న్యూస్ త్వరలో మీకందిస్తాం. చదువుతూనే ఉండండి తెలుగు విశేష్.

Friday, 21 December 2012

Dasari Narayana Rao Sensational Comments

dasari narayana rao makes sensational comments

  చిరంజీవి నా బిడ్డ లాంటివాడు ,  మా ఇద్దరికీ గొడవలున్నాయనే రీతిలో మా మధ్య వర్గ పోరాటం  ఉన్నట్టుగా  మీడియా వారు చిత్రికరిస్తున్నారని ప్రముఖ దర్శకుడు  దాసరి నారాయణ రావు అన్నారు.   అయితే నా దగ్గర ఎంతో  మంది సాయం పొందారు. వారికి అది గుర్తులేక .. ఫంక్షన్లకు  దాసరి వస్తే  నేను లేవాలా?  అంటున్నారు.  నాతో చాలెంజ్ చేసి మాట్లాడే స్టార్స్  వచ్చారు.  నా ఇంటి చుట్టూ సైకిల్  వేసుకుని  తిరిగిన వారిని నేను మర్చిపోలేదు.   ఎండుగడ్డి  ఉన్న స్టూడియోలో  పచ్చగడ్డిని  మొలిపిస్తే  అక్కడి నుంచి  నన్ను బయటకు గెంటారు.  ఆ విషయాన్ని  నా ఆత్మకథలో  రాయాలా వద్దా?  ఐదేళ్ల నుంచి  ఆత్మకథ రాసే ప్రయత్నం  జరుగుతోంది.  ఎవరినీ నొప్పించకుండా ఆత్మకథ రాస్తా.  ఆత్మ కోసం 6400 ఫొటోలను  సేకరించాను  అని దాసరి  నారాయణరావు చెప్పారు  నిన్న ఒక పుస్తక ఆవిష్కరణలో  ఆయన చిత్రపరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే  ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత మంది సినీ నటులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఎందరో సూపర్ స్టార్లు  అమితాబ్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్  లాంటి వారు కూడా  రజనీకాంత్ సూపర్ స్టార్ అని  కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో  ఎన్టీఆర్  , తమిళ్ లో  ఎంజీఆర్ , కన్నడంలో రాజ్ కుమార్  వంటి వారందరూ  అంతే.   సూపర్ స్టార్ కన్నా గొప్పవాళ్లు  ఎవరు ఉండని దాసరి అన్నారు.  అయితే రజనీకాంత్  ఒక్కడే  సూపర్ స్టార్  అని దాసరి  వ్యాఖ్యానించడం పరోక్షంగా  చిరంజీవిని  అవమానించడమేనని మెగా స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం  చేశారు.  దీనిపై  చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు , దాసరి తో ఫోన్ లో  మాట్లాడినట్లు తెలుస్తోంది. 

dasari narayana rao makes sensational comments

   దాసరి వ్యాఖ్యలు   చిరంజీవిని  ఉద్దేశించి చేసినట్లు తనకేమీ అనిపించలేదని  నాగబాబు అన్నారు.  తన సోదరుడు  స్వీయ ప్రతిభతోనే చిత్రసీమలో   ఉన్నతస్థానానికి  ఎదిగినట్లు  నాగబాబు తెలిపారు.  అన్నయ్యని  అన్నట్లు అనిపించలేదు.  అన్నయ్య ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు   అప్లైచేసి , తన సొంతంగా ఎదిగారు.  దాసరి  ప్రస్ర్టేషన్ లో అలా మాట్లాడి ఉండోచ్చు దాన్ని పట్టించుకోవక్కర్లేదు   ఆయనకు ఆ ప్రస్ట్రేషన్  ఎందుకు వచ్చిందో  నాకు  తెలీదు.  అన్నయ్య మీద రాస్తే రాయనియ్యండి. అందరు రాస్తారు చరిత్రలు అని నాగబాబు మెగా అభిమానులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తర్వాత స్టార్లు లేరనే దాసరి గారి   వ్యక్తిగత అభిప్రాయంతో  నేను ఏకీభవించను.  కానీ  నేను కూడా కేవీరెడ్డి గారి తర్వాత  దర్శకులే లేరంటే అది నా వ్యక్తిగత అభిప్రాయమవుతుందని  నాగబాబు చాలా సింపుల్ అందరికి  అర్థం అయ్యే విధంగా చెప్పారు. నాగబాబు మాటలకు మెగా అభిమానులు  శాంతించినట్లు తెలుస్తోంది.  దాసరి కూడా చివరకు  చిరంజీవి  నా బిడ్డలాంటివాడు  , మా ఇద్దరి మధ్య గొడవలు  పుట్టడానికి కారణం మీడియాలో రాసే రాతలే కారణం అని ఆయన గొంతు సవరించుకుంటూ.. మీడియా పై దాసరి నిప్పులు కురింపించారు.  ఈ దాసరి వివాదం ఇంతటి ఆగిపోతుందో , లేక ఎక్కడివరకు వెళ్ళుతుందో  చూడాలి.  

dasari narayana rao makes sensational comments

   టాలీవుడ్ లో  దాసరి మాటలకు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాసరి  చిరంజీవిని , అక్కినేని వారిని టార్గెట్ చేసిన మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఏమైనా దాసరి అలా మాట్లాడి ఉండకూడదని సినీ పండితులు అంటున్నారు.  తెలుగుతో  ఎన్టీఆర్  తరువాత స్టార్లు లేరని అనటం ఆయన పెద్దరికాన్ని  కోల్పోతున్నాడనే అనే భావన కలుగుతుంది. తెలుగులో సీని దర్శకుడు అయిన దాసరి వ్యాఖ్యలు  చేసేటప్పడు  టాలీవుడ్ వర్గాలను దుష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని  సినీ పండితులు అంటున్నారు.  ‘‘ పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదనే’’  సామెతను దాసరి మాటలు గుర్తుచేస్తున్నాయాని .. సినీ రచయితలు  అంటున్నారు. ఈ వయసులో  దాసరి  ఎదిగేవారికి ఆయుధం కావాలి, గానీ  అడ్డం కాకూడదని సినీ పెద్దలు అంటున్నారు. జనరేషన్  మారుతున్న కొద్ది  కొత్త వాటిని ఆహ్వానించక తప్పదని సీనీ ప్రముఖులు అంటున్నారు.  ‘‘మా తాతలు  నేతిని తాగారు.. మా మూతులు వాసన చూడండి’’ అనే   రోజులు కావు అని దాసరి తెలుసుకోవాలని సినీ పండితులు అంటున్నారు.