ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. పవన్ మేనియాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ట్రేడ్ పండితుల ప్రకారం ఈ చిత్రం రూ.43 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే.. ఈ చిత్ర నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందన్న విషయాన్ని సురేష్ బాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న పవన్, శరత్ మరార్’లు సైతం నిర్మాణఖర్చుల వ్యవహారాలను బహిర్గతం చేయలేదు. ఏదైతేనేం.. ప్రస్తుతం ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తోంది కాబట్టి.. అందరూ ఇప్పుడు లాభ, నష్టాలను పంచుకునే పనిలో బిజీ అయిపోయారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం!
Click Here to Read Full Story
Click Here to Know Tollywood Movie News and Gossips