Showing posts with label allu arjun. Show all posts
Showing posts with label allu arjun. Show all posts

Monday, 19 January 2015

Allu Arjun Trivikram Srinivas Movie Husharu


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగానే సమాచారం ఉంది తప్ప... ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లు వంటి ప్రమోషన్  విడుదల కాలేదు. తాజాగా సినిమా టైటిల్ పై మాత్రం ఫిలింనగర్ లో ఓ టాక్ విన్పస్తోంది. లేటెస్ట్ మూవీకి ‘హుషారు’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

Click Here to View Full Story

Click Here to View Latest Tollywood News

Friday, 19 April 2013

Allu Arjun To Romance Kaajal Vashisht


  జులాయి ముచ్చటగా మూడో అమ్మాయితో హాట్ రొమాన్స్

ఇప్పటికే జులాయి ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ముద్దు గుమ్మలే, కాకుండా మూడో భామతో రొమాన్స్ కు సిద్దమయ్యాడు జులాయి. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ముచ్చటగా మూడో అమ్మాయి ప్రవేశించింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైటిల్‌కు అనుగుణంగా అమలాపాల్‌, కేథరిన్‌ నాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే బ్యాంకాక్‌, స్పెయిన్‌ వంటి లొకేషన్లలో భారీ షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో మూడవ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ కాజల్‌ వశిష్ట్‌ నటిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కథానుసారమే మూడవ నాయికను కూడా తీసుకున్నారట. ఇంతవరకు ఈ విషయాన్ని ఫోకస్‌ చేయకపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొంత చిత్రీకరణను జరిపారని అంటున్నారు. ప్రభుదేవా హిందీ చిత్రం 'రౌడీ రాథోడ్‌'లో నటించిన ఆమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఎందరో ఉత్తరాది భామల కోవలో తాను కూడా టాలీవుడ్‌లో బిజీకావాలని కాజల్‌ వశిష్ట్‌ కోరుకుంటోంది. నటనకు అవకాశం వున్న చక్కటి పాత్రలు పోషించాలని అనుకుంటున్న తనకు ఐటెం సాంగ్స్‌ చేయాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని కాజల్‌ వశిష్ట్‌ స్పష్టంచేస్తోంది. ఇక 'దేశముదురు' తర్వాత అర్జున్‌, పూరీల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. తన చిత్రాలకు కాస్త భిన్నంగా ఉండేలా పూరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, అమోల్‌రాథోడ్‌ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు

Friday, 22 February 2013

Amala And Allu Arjun Lip Lock

allu-arjun-lip-kiss

ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగు, లిప్ లాక్ కిస్ ఉండటం సర్వసాధారణమైన విషయం. ఇవి రెండు సినిమాకు పెద్ద అస్సెట్. ఒక హీరో హీరోయిన్లు కూడా ఈ అదర చుంబనాలకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో దర్శకులు కూడా మరింత రెచ్చిపోతున్నారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా హీరోలు కూడా హీరోయిన్లను జుర్రేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అమలాపాల్ నటిస్తున్న ‘ఇద్దరు అమ్మాయిలతో ’ చిత్రంలో వీళ్ళద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2 నిమిషాలు సాగే ఈ లిప్ లాక్ సీన్ ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పూరి ఈ లిప్ లాక్ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చాడని కూడా అంటున్నారు. బన్నీ, అమలా లిప్ లాక్ కిస్ కూడా పెద్దగా టేకులు తీసుకోకుండా, ఒకరి రసాలను ఒకరు జుర్రేసుకొని పెదవులు తుడిచేసుకున్నారట . అమలా రసాలను అర్జున్ బాగానే ఎంజాయ్ చేసింటాడు. మరి ప్రేక్షకులను ఈ సీన్ ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

Tuesday, 22 January 2013

Amala Paul Fights In Iddarammayilato

112

        'ఇద్దరమ్మాయిలతో' పూరీ జగన్నాథ్ చాలా పనులే చేపిస్తున్నాడు. థారు ఫైట్‌ మాస్టర్‌ కెచ్చా శిక్షణలో, ఇప్పటికే బన్నీతో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలను బ్యాంకాక్‌లో చిత్రీకరించిన సంగతి మనకుతెలుసు. ఇదిలా ఉంటే.. అభిమానులు ఈ మూవీలో కొత్త అమలాపాల్‌ను చూడటం ఖాయం. ఎందుకంటే అమల పాల్‌ కూడా ఇందులో అదిరిపోయే ఫైట్స్‌ చేస్తోంది. ఇందుకోసం మాస్టర్‌ కెచ్చా 'నింజా' అనే ప్రత్యేకమైన ఫైటింగ్‌లో అమలాపాల్‌కు శిక్షణ ఇచ్చారు. థాయ్ లాండ్ లోని దూరంగా దట్టమైన అడవుల్లో ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. నింజా ఫైట్‌ చాలా కష్టంగా వుందని, మాస్టర్‌ ఎంతో శ్రమకోర్చి నేర్పుతున్నారని అమలాపాల్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా విడుదల చేసింది.

     కాగా, ఇద్దరమ్మాయిలతో స్పానిష్ షెడ్యూల్ ఫిబ్రవరి 1వతేదీనుంచి మొదలుకానుంది. తొలిసారి డిజిటల్ కెమేరాలతో షూట్ చేస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరిన్ నటిస్తున్నారు. దేవీ శ్రీ సంగీతం. నిర్మాత బండ్ల గణేష్.
...avnk

Tuesday, 18 December 2012

Bunny Nani And Gowtham Menon Movie



bunny
      nani మొన్ననే 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రాన్నిచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ త్వరలో ఇద్దరు హీరోలతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతం స్వయంగా వెల్లడించాడు.  త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-నాని కాంబినేషన్లో ఈ మల్టీ స్టారర్ తీయాలని వుందని గౌతమ్ అంటున్నాడు. దీనిని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీస్తానని చెప్పాడు. లవ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా దీనిని ప్లాన్ చేస్తున్నానని అంటున్నాడు.
        వేదం సినిమా కోసం విష్టుతో జోడీకట్టిన బన్నీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. కథ నచ్చకపోతే క్రుష్ణవంశీ అయితే ఏంటి అని ఇటీవలే స్టేట్ మెంట్ ఇచ్చిన నాని మనసు ఎటు వెళ్తుందో...
...avnk