Showing posts with label bolo bolo remix song in evadu movie. Show all posts
Showing posts with label bolo bolo remix song in evadu movie. Show all posts

Wednesday, 6 February 2013

Bolo Bolo Remix Song In Evadu Movie

Ram-charan-merupu1

       ఇంతకుముందెన్నడూ లేనంత వెరైటీ స్టైల్లో  చరణ్ ‘ఎవడు’ సినిమాని తీర్చిదిద్దుతున్నానని చెబుతోన్న వంశీపైడిపల్లి సెంటిమెంట్ ను మాత్రం అధిగమించలేకపోతున్నాడు. ఫలితంగా ‘ఎవడు’ సినిమాలో చరణ్, తన ఇంతకు మునపటి సినిమాల్లాగే మరోసారి  తన తండ్రి  పాటకు స్టెప్పులేయబోతున్నాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'రౌడీఅల్లుడు' లోని 'బోలో బోలో బోలో రాణి... క్యా చాహియే' పాటను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.       
          బొంబాయి ఆటోవాలాగా చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' లోని ఈ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించింది. అదే పాటను 'ఎవడు'కు రీమిక్స్ చేస్తుండడం అభిమానులకు మరింత ఊపునిచ్చే వార్తే. కాగా, చిరంజీవి రీమిక్స్ పాటలతో తీసిన ఆయా సినిమాలు చరణ్ కు ఘనవిజయాన్నిచ్చాయి.
       సెంటిమెంట్ కు ఊతమిస్తూ ఒక్క ‘ఆరెంజ్’ చిత్రం,  మినహా చరణ్ తన ప్రతి సినిమాలోనూ తండ్రి చిరంజీవి హిట్ పాటను రీమిక్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి పాటను రీమిక్స్ చేయని ‘ఆరంజ్’ చిత్రం మాత్రం అట్టర్ ప్లాప్ అయిన సంగతి ఇక్కడ గమనార్హం.
..avnk