Showing posts with label movie news. Show all posts
Showing posts with label movie news. Show all posts

Tuesday, 7 October 2014

అనుష్కకు కేసీఆర్ అండ


అందాల భామ అనుష్కకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. అనుష్క తాజా సినిమా ‘రుద్రమదేవి’కి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు కేసీఆర్ ను ‘రుద్రమదేవి’ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన రాణి రుద్రమదేవి కధను సినిమాగా తెరకెక్కించినందున.. తెలంగాణలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

Click Here to View Full Story

Wednesday, 6 February 2013

Bolo Bolo Remix Song In Evadu Movie

Ram-charan-merupu1

       ఇంతకుముందెన్నడూ లేనంత వెరైటీ స్టైల్లో  చరణ్ ‘ఎవడు’ సినిమాని తీర్చిదిద్దుతున్నానని చెబుతోన్న వంశీపైడిపల్లి సెంటిమెంట్ ను మాత్రం అధిగమించలేకపోతున్నాడు. ఫలితంగా ‘ఎవడు’ సినిమాలో చరణ్, తన ఇంతకు మునపటి సినిమాల్లాగే మరోసారి  తన తండ్రి  పాటకు స్టెప్పులేయబోతున్నాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'రౌడీఅల్లుడు' లోని 'బోలో బోలో బోలో రాణి... క్యా చాహియే' పాటను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.       
          బొంబాయి ఆటోవాలాగా చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' లోని ఈ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించింది. అదే పాటను 'ఎవడు'కు రీమిక్స్ చేస్తుండడం అభిమానులకు మరింత ఊపునిచ్చే వార్తే. కాగా, చిరంజీవి రీమిక్స్ పాటలతో తీసిన ఆయా సినిమాలు చరణ్ కు ఘనవిజయాన్నిచ్చాయి.
       సెంటిమెంట్ కు ఊతమిస్తూ ఒక్క ‘ఆరెంజ్’ చిత్రం,  మినహా చరణ్ తన ప్రతి సినిమాలోనూ తండ్రి చిరంజీవి హిట్ పాటను రీమిక్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి పాటను రీమిక్స్ చేయని ‘ఆరంజ్’ చిత్రం మాత్రం అట్టర్ ప్లాప్ అయిన సంగతి ఇక్కడ గమనార్హం.
..avnk

Tuesday, 5 February 2013

Balayya Own Direction

 

 

balakrishna-1

       నందమూరి నటసింహం..  బాలకృష్ణ తెలుగుతెరమీద ఓ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నాడు.  ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించటమే కాదు.. ఏకంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. 'ది లయన్ కింగ్' అనే  హాలీవుడ్ మూవీ 1994లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలోనూ, ఆయనకు జోడీగా నయనతార మహారాణి గానూ కనిపించనుంది. యలమంచిలి సాయిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుంది. 'శ్రీ రామరాజ్యం' సినిమాను కూడా యలమంచిలి సాయిబాబే  నిర్మించిన సంగతి మనకెరుకే.
  
    స్వయంగా నటసింహమే దర్శకత్వ భాద్యతలు చేపట్టడం ఈ సినిమాకే హైలెట్. గతంలో బాలకృష్ణ 'నర్తనశాల'తో దర్శకుడిగా అరంగేట్రం చేయాలనుకున్నారు. అయితే అందులో ప్రధాన పాత్రధారైన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది. +

      కాగా, టాలీవుడ్ లో విస్త్రుత స్థాయి చర్చకు తావిస్తోన్న ఈ భారీ మూవీ  జూన్ 10 వ తేదీ అంటే బాలయ్యబాబు జన్మదినం రోజున ఈ చిత్రం షూటింగు ప్రారంభంకాబోతోంది.
...avnk

Ramgopal Varma India Pai Dhadi


14
...avnk

Hero Siddarth In NTR Baadsha Movie

badsha_new_pic

      యంగ్ టైగర్ మూవీ బాద్ షా పలు అంశాల ప్రాతిపదికన తరచూ వార్తల్లో నిలుస్తూ హల్ చల్ స్రుష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్టీఆర్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈమూవీలో  హీరో నవదీప్‌ నెగెటివ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే,  హీరో సిద్ధార్థ్‌ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. తెలుగు  మూవీ యువ హీరోలు ఇటీవల కొంతకాలంగా, అతిథి పాత్రల్లో కనిపించడానికి ముందుకు రావటం శుభపరిణామం. ఇదే కోవలో  'ఎవడు'లో అల్లు అర్జున్‌ గెస్ట్ రోల్ పోషిస్తుండగా,  తులసిలో ఎన్టీఆర్‌ స్టెప్పులేసి అలరించిన సంగతి ఇక్కడ గమనార్హం.
          కాగా, బండ్ల గణేష్‌ ఖర్చుకు వెనకాడక నిర్మిస్తున్న 'బాద్‌షా'లో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. థమన్‌ స్వరాలిస్తున్నాడు.
...avnk

Monday, 4 February 2013

Maehsh Dream Project

mahe_e

       ప్రస్తుతం టాలీవుడ్ లో యమ దూకుడు ప్రదర్శిస్తోన్న హీరో ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు. ఇప్పటివరకూ ఏ తరహా పాత్ర పోషించినా.... అందులో ఎంచక్కా ఒదిగిపోయే మహేష్ చేయాలనుకుంటున్న పాత్ర ఒకటుంది. అదే గతంలో తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ 'గూఢచారి 116' సినిమాలో పోషించిన పాత్ర.

        అయితే, దీనికి మంచి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగలిగే దర్శకుడు కుదరాలి. అవన్నీ కుదిరినప్పుడు నేను తప్పకుండా స్పైక్యారెక్టర్‌ చేస్తానంటున్నాడు మహేష్‌ . మరి మహేష్‌ ఇంత చక్కటి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినప్పుడు, మన యువ దర్శకులు కథలు సిద్ధం చేసుకుని ఆయనని సంప్రదించడమే ఇక తరువాయి కదా.. ఇదిలా ఉంచితే.. అప్పుడే మహేష్ మనసెరిగిన ఓ ప్రముఖ దర్శకుడు దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.

     మరోవైపు..  రాజమౌళి దర్శకత్వంలో తాను నటించనున్నట్టు మహేష్ బాబు స్వయంగా ప్రకటించాడు. అయితే, ఇది కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇప్పటికే తాము మాట్లాడుకున్నామని మహేష్ వెల్లడించారు అంతేకాదు ప్రస్తుతం తాను సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జూన్ లో విడుదలవుతుందనీ.. శ్రీను వైట్లతో చేసే 'ఆగడు' సినిమా మార్చి నెలలో మొదలవుతుందనీ మహేష్ చెప్పారు.

       కాగా, వీటి తర్వాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సినిమాల్లో మహేష్ నటిస్తారు. ఆ పైనే రాజమౌళి సినిమా ఉంటుందనీ సమాచారం.
...avnk