Friday, 21 December 2012

Dasari Narayana Rao Sensational Comments

dasari narayana rao makes sensational comments

  చిరంజీవి నా బిడ్డ లాంటివాడు ,  మా ఇద్దరికీ గొడవలున్నాయనే రీతిలో మా మధ్య వర్గ పోరాటం  ఉన్నట్టుగా  మీడియా వారు చిత్రికరిస్తున్నారని ప్రముఖ దర్శకుడు  దాసరి నారాయణ రావు అన్నారు.   అయితే నా దగ్గర ఎంతో  మంది సాయం పొందారు. వారికి అది గుర్తులేక .. ఫంక్షన్లకు  దాసరి వస్తే  నేను లేవాలా?  అంటున్నారు.  నాతో చాలెంజ్ చేసి మాట్లాడే స్టార్స్  వచ్చారు.  నా ఇంటి చుట్టూ సైకిల్  వేసుకుని  తిరిగిన వారిని నేను మర్చిపోలేదు.   ఎండుగడ్డి  ఉన్న స్టూడియోలో  పచ్చగడ్డిని  మొలిపిస్తే  అక్కడి నుంచి  నన్ను బయటకు గెంటారు.  ఆ విషయాన్ని  నా ఆత్మకథలో  రాయాలా వద్దా?  ఐదేళ్ల నుంచి  ఆత్మకథ రాసే ప్రయత్నం  జరుగుతోంది.  ఎవరినీ నొప్పించకుండా ఆత్మకథ రాస్తా.  ఆత్మ కోసం 6400 ఫొటోలను  సేకరించాను  అని దాసరి  నారాయణరావు చెప్పారు  నిన్న ఒక పుస్తక ఆవిష్కరణలో  ఆయన చిత్రపరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే  ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత మంది సినీ నటులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఎందరో సూపర్ స్టార్లు  అమితాబ్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్  లాంటి వారు కూడా  రజనీకాంత్ సూపర్ స్టార్ అని  కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో  ఎన్టీఆర్  , తమిళ్ లో  ఎంజీఆర్ , కన్నడంలో రాజ్ కుమార్  వంటి వారందరూ  అంతే.   సూపర్ స్టార్ కన్నా గొప్పవాళ్లు  ఎవరు ఉండని దాసరి అన్నారు.  అయితే రజనీకాంత్  ఒక్కడే  సూపర్ స్టార్  అని దాసరి  వ్యాఖ్యానించడం పరోక్షంగా  చిరంజీవిని  అవమానించడమేనని మెగా స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం  చేశారు.  దీనిపై  చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు , దాసరి తో ఫోన్ లో  మాట్లాడినట్లు తెలుస్తోంది. 

dasari narayana rao makes sensational comments

   దాసరి వ్యాఖ్యలు   చిరంజీవిని  ఉద్దేశించి చేసినట్లు తనకేమీ అనిపించలేదని  నాగబాబు అన్నారు.  తన సోదరుడు  స్వీయ ప్రతిభతోనే చిత్రసీమలో   ఉన్నతస్థానానికి  ఎదిగినట్లు  నాగబాబు తెలిపారు.  అన్నయ్యని  అన్నట్లు అనిపించలేదు.  అన్నయ్య ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు   అప్లైచేసి , తన సొంతంగా ఎదిగారు.  దాసరి  ప్రస్ర్టేషన్ లో అలా మాట్లాడి ఉండోచ్చు దాన్ని పట్టించుకోవక్కర్లేదు   ఆయనకు ఆ ప్రస్ట్రేషన్  ఎందుకు వచ్చిందో  నాకు  తెలీదు.  అన్నయ్య మీద రాస్తే రాయనియ్యండి. అందరు రాస్తారు చరిత్రలు అని నాగబాబు మెగా అభిమానులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తర్వాత స్టార్లు లేరనే దాసరి గారి   వ్యక్తిగత అభిప్రాయంతో  నేను ఏకీభవించను.  కానీ  నేను కూడా కేవీరెడ్డి గారి తర్వాత  దర్శకులే లేరంటే అది నా వ్యక్తిగత అభిప్రాయమవుతుందని  నాగబాబు చాలా సింపుల్ అందరికి  అర్థం అయ్యే విధంగా చెప్పారు. నాగబాబు మాటలకు మెగా అభిమానులు  శాంతించినట్లు తెలుస్తోంది.  దాసరి కూడా చివరకు  చిరంజీవి  నా బిడ్డలాంటివాడు  , మా ఇద్దరి మధ్య గొడవలు  పుట్టడానికి కారణం మీడియాలో రాసే రాతలే కారణం అని ఆయన గొంతు సవరించుకుంటూ.. మీడియా పై దాసరి నిప్పులు కురింపించారు.  ఈ దాసరి వివాదం ఇంతటి ఆగిపోతుందో , లేక ఎక్కడివరకు వెళ్ళుతుందో  చూడాలి.  

dasari narayana rao makes sensational comments

   టాలీవుడ్ లో  దాసరి మాటలకు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాసరి  చిరంజీవిని , అక్కినేని వారిని టార్గెట్ చేసిన మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఏమైనా దాసరి అలా మాట్లాడి ఉండకూడదని సినీ పండితులు అంటున్నారు.  తెలుగుతో  ఎన్టీఆర్  తరువాత స్టార్లు లేరని అనటం ఆయన పెద్దరికాన్ని  కోల్పోతున్నాడనే అనే భావన కలుగుతుంది. తెలుగులో సీని దర్శకుడు అయిన దాసరి వ్యాఖ్యలు  చేసేటప్పడు  టాలీవుడ్ వర్గాలను దుష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని  సినీ పండితులు అంటున్నారు.  ‘‘ పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదనే’’  సామెతను దాసరి మాటలు గుర్తుచేస్తున్నాయాని .. సినీ రచయితలు  అంటున్నారు. ఈ వయసులో  దాసరి  ఎదిగేవారికి ఆయుధం కావాలి, గానీ  అడ్డం కాకూడదని సినీ పెద్దలు అంటున్నారు. జనరేషన్  మారుతున్న కొద్ది  కొత్త వాటిని ఆహ్వానించక తప్పదని సీనీ ప్రముఖులు అంటున్నారు.  ‘‘మా తాతలు  నేతిని తాగారు.. మా మూతులు వాసన చూడండి’’ అనే   రోజులు కావు అని దాసరి తెలుసుకోవాలని సినీ పండితులు అంటున్నారు. 

No comments:

Post a Comment