ప్రముఖ
నిర్మాత దిల్ రాజు కు అనుకొని కష్టం వచ్చి పడింది. దిల్ రాజు నిర్మాత
గా నిర్మించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సంకాంత్రి
పండుగకు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు మరో
పెద్ద సినిమా విడుదల అవుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ఫిలింనగర్
పెద్దలను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. దిల్ రాజు మొదట నాయక్
సినిమా నైజాం రైట్స్ తీసుకోవడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన దిల్ రాజ్
లాస్ట్ నిమిషాంలో వెనక్కి తగటం పై నాయక్ సినిమా హీరో రామ్ చరణ్,
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరో మహేష్ బాబు దిల్ రాజు ను పిలిచి
తిట్ల వర్షం కురిపించినట్లు ఫిలింనగర్లో టాక్. ఈ రెండు సినిమాలు ఒకే
వారంలో విడుదల కావటంతో దిల్ రాజు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇప్పటికి నాయక్ సినిమా కోసం 1210 థియేటర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
దిల్ రాజ్ నైజాం ఏరియా తీసుకుంటే, తన సినిమా కు థియేటర్స్ తగ్గుతాయి
కాబట్టి , మన సినిమాను ఒక వారం వాయిదా వేద్దామాని మహేష్ బాబు చెప్పటం,
మహేష్ బాబు సీరియస్ గా దిల్ రాజు ను అరిచినట్లు ఫిలింనగర్ వాసులు
అనుకుంటున్నారు. మహేష్ తిట్టిన తిట్లతో దిల్ రాజు నేరుగా రామ్ చరణ్
వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పిటంతో.. అక్కడ కూడా సేమ్ రియాక్షన్
వచ్చేసరికి ఎందుకొచ్చిన గొడవ అని నైజాంలో నాయక్ సినిమా నేను రిలీజ్
చేయలేనని చెప్పినట్లు టాలీవుడ్ సమాచారం. అంతేకాకుండా దాసరి నారాయణ
రావు కూడా రావటంతో దిల్ రాజు వెనక్కి తగ్గినట్లు అనే గుసగుసలు
వినిపిస్తున్నాయి. మొత్తం మీద దిల్ రాజు ఇద్దరు హీరోలతో తిట్లు తినటంతో
ఆయనకు అవమానం జరిగినట్లుగా ఉందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు
టాలీవుడ్ సమాచారం.
No comments:
Post a Comment