Showing posts with label pawan kalyan latest news. Show all posts
Showing posts with label pawan kalyan latest news. Show all posts

Tuesday, 14 October 2014

పవన్ సినిమా డివిడిలు పాడయ్యాయట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరూ విడిపోయిన తర్వాత చాలాకాలం వరకు వారిద్దరికీ సంబంధించిన వ్యవహారాలు మళ్లీ తెరమీదకు రాలేదు. ఆమధ్య ఎప్పుడో కోర్టు కేసులకోసం వీరిద్దరికి సంబంధించిన వార్తలు బాగానే షికార్లు చేశాయి కానీ.. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలాకాలం తర్వాత రేణుదేశాయ్ తెరకెక్కిస్తున్న ‘‘ఇష్క్ వాలా లవ్’’ మూవీ నేపథ్యం నుంచి వీరిద్దరి మధ్య వార్తలు వేగవంతమయ్యాయి. తన మూవీ ప్రమోషన్ కోసమే లేక పవన్ మీదున్న అభిమానమో తెలియదు కానీ... రేణు మాత్రం మొదట్లో పవన్ కల్యాణ్ ను తన గురువంటూ బాగానే పొగిడేసింది. ఆయన బర్త్ డే నాడే మూవీ టీజర్ రిలీజ్ కావడం తన అదృష్టమంటూ చెప్పింది. మళ్లీ పవన్ అభిమానులు కాస్త నిరాశపడేలా ఫేస్ బుక్ లో పవన్ గురించి ఒక వివరణ కూడా ఇచ్చుకుంది. ఇలా వీరిద్దరికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. తాజాగా రేణు దేశాయ్ మరోసారి పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం!

For More Details logon to www.teluguwishesh.com

Wednesday, 16 July 2014

Star War Between Pawan Kalyan And Mahesh Babu In The Tollywood


star-war-of-pawan-and-mahes.gif

తెలుగు చిత్రపరిశ్రమలో వున్న హీరోలందరూ ఒకవైపు అయితే.... పవన్, మహేష్ లు మరోవైపు. ఈ ఇద్దరికి వున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు దక్కలేదు. వీరిద్దరి స్టార్ డమ్ ముందు ఏ హీరో నిలబడలేక తప్పుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డమ్ కోసం పోటీలు జరుగుతున్నాయి. రోజురోజుకో రసవత్తరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఇద్దరి మధ్య ఢీ అంటూ ఢీ అంటూ వార్ నడుస్తోంది. వీరికి తగ్గట్టు అభిమానులు కూడా తమ హీరోల గురించి ప్రత్యేకంగా ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు.

అలాగే టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా మహేష్, పవన్ లను ఇద్దరే ఇద్దరు అని కితాబిస్తున్నారు. మాస్, క్లాస్ కు తేడాలేకుండా అన్నిరకాల చిత్రాల్లో నటిస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు... అటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ.. అభిమానులను ఆనందంతో తడిపేస్తున్నారు. ఒకరు దూకుడు ప్రదర్శనతో ముందుకు దూసుకుపోతుంటే... మరొకరు గబ్బర్ సింగ్ అంటూ రికార్డులు సృష్టించుకుపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధులదాకా వీరిద్దరికీ భీభత్సమైన క్రేజ్ వుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

ఇప్పుడు తాజాగా చెన్నైలో నిర్వహించిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో కూడా మరోసారి వీరిద్దరి మధ్య వున్న ఫైట్ రసవత్తరంగా మారింది. వీరిద్దరిలో ఎవరు ఫిలింఫేర్ అవార్డు గెలుస్తారోనన్న ఆశతో అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. చిత్రపరిశ్రమలో వీరిద్దరిలో టాప్ హీరో అనేది ఇంకా ఫైనల్ కాకపోయినా... అవార్డ్స్ ఫంక్షన్ లో మాత్రం పవన్ కన్నా మహేష్ బాబుయే ముందున్నాడు. ఈసారి కూడా ఫిలింఫేర్ అవార్డును తన సొంతం చేసుకున్నాడు మహేష్! ఇప్పటికీ మహేష్ తన కెరీర్ లో నాలుగు సార్లు ఈ ఫిలింఫేర్ అవార్డును తీసుకోగా... పవన్ కల్యాణ్ కు ఇంతవరకు ఒక్కటి మాత్రమే పొందగలిగాడు.

గతంలో ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులను కొట్టేసిన మహేష్.. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు నాలుగోసారి అందుకున్నాడు. పవన్ కల్యాణ్ మాత్రం గత సంవత్సరంలో గబ్బర్ సింగ్ సినిమాకుగాను అవార్డు తీసుకున్నాడు. ఈ సంవత్సరంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించినా... అందుకు అవార్డు మాత్రం లభించలేదు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అయినా తమ హీరోయే బెస్ట్ అంటూ వారు కితాబిచ్చుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ దూసుకుంటూపోతే... మహేష్ బాబు కూడా ఆ రికార్డులకు సమానంగా పవన్ కు పోటీదారుడిగా ప్రతిసారి నిలుస్తున్నాడు. వీరిద్దరిలో ఇంతవరకు ఎవరు టాలీవుడ్ స్టార్ హీరో అని లెక్కలు తేల్చలేకపోయినా.. అవార్డులలో మాత్రం మహేష్ బాబు పవన్ కంటే ముందున్నాడు. మరి వీరి మధ్య నడుస్తున్న ఈ స్టార్ ఇంకెన్నాళ్లవరకు నడుస్తుందోనని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

AS

Tuesday, 2 April 2013

Pawan Kalyan To Produce Gabber Singh 2

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... వయస్సు తో సంబంధం లేకుండా , ప్రతీ సినీ అభిమాని ఇష్టపడే పేరు ... తెర మీద పవన్ కనపడగానే చాలు , ఒక డైలాగ్ చెప్పగానే చాలు , తమను తాము మైమరచిపోయి ఈల వేసే అభిమానులు కొందరైతే , పవన్ పాట , ఆట , మాట తో కదం కలిపే వారు మరి కొందరు ... అందుకే ఈ స్టార్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా , నిర్మాతకి మాత్రం వేచ్చించిన డబ్బు తిరిగి రావడం ఖాయం ... అందుకే 'జల్సా' తరువాత, పోయిన సంవత్సరం వరకు పవన్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ సాధించకపోయినా , ఈ స్టార్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు ... 
అయిన పోయిన సంవత్సరం తో ఈ కొరత కూడా  తీరిపోయిందనుకోండి ... హరీష్ శంకర్ దర్శకత్వం లో, హిందీ లో ఘన విజయం సాధించిన , సల్మాన్ ఖాన్ ని నంబర్ వన్ గా నిలబెట్టిన 'దబంగ్ ' చిత్రాన్ని , కొన్ని మార్పులు చేర్పులు చేసి , పవన్ హీరో గా  'గబ్బర్ సింగ్ ' గా  విడుదల చేసారు ... చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే ... ఈ చిత్రం తరువాత అంతే భారీ అంచనాలతో విడుదల అయిన 'క్యామెరామ్యాన్ గంగ తో రాంబాబు ' చిత్రం పవన్ అభిమానులని నిరాశ పరచినా, 'గబ్బర్ సింగ్' విజయం తో మాత్రం పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ... 

ఇప్పుడు తనకు 'జల్సా' తో విజయాన్ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న పవన్ , ప్రస్తుతం ఈ సినిమా పైనే దృష్టి సారిస్తున్నా, ఇంకో వైపు తనకు విజయం తెచ్చిపెట్టిన 'గబ్బర్ సింగ్' కొనసాగింపు గురించి ఆలోచన మొదలుపెట్టేసాడు ... హిందీ లో 'దబంగ్' కి కొనసాగింపు గా 'దబంగ్ - 2' విడుదల అయ్యి విజయం సాధించడం , హరీష్ శంకర్ కొనసాగింపు కధలో కూడా మార్పులు చేసి , పవన్ తో 'గబ్బర్ సింగ్ - 2' కి తాను రెడీ అని చెప్పడం మనకు తెలిసిందే ... అయితే పవర్ స్టార్ కూడా ఈ చిత్రం పై మక్కువ చూపుతున్నాడని , సొంత బ్యానర్ పైనే సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని , త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు  త్వరలోనే విడుదల చేస్తారని తెలుగు సినిమా వర్గాల సమాచారం