Tuesday, 2 April 2013

Pawan Kalyan To Produce Gabber Singh 2

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... వయస్సు తో సంబంధం లేకుండా , ప్రతీ సినీ అభిమాని ఇష్టపడే పేరు ... తెర మీద పవన్ కనపడగానే చాలు , ఒక డైలాగ్ చెప్పగానే చాలు , తమను తాము మైమరచిపోయి ఈల వేసే అభిమానులు కొందరైతే , పవన్ పాట , ఆట , మాట తో కదం కలిపే వారు మరి కొందరు ... అందుకే ఈ స్టార్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా , నిర్మాతకి మాత్రం వేచ్చించిన డబ్బు తిరిగి రావడం ఖాయం ... అందుకే 'జల్సా' తరువాత, పోయిన సంవత్సరం వరకు పవన్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ సాధించకపోయినా , ఈ స్టార్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు ... 
అయిన పోయిన సంవత్సరం తో ఈ కొరత కూడా  తీరిపోయిందనుకోండి ... హరీష్ శంకర్ దర్శకత్వం లో, హిందీ లో ఘన విజయం సాధించిన , సల్మాన్ ఖాన్ ని నంబర్ వన్ గా నిలబెట్టిన 'దబంగ్ ' చిత్రాన్ని , కొన్ని మార్పులు చేర్పులు చేసి , పవన్ హీరో గా  'గబ్బర్ సింగ్ ' గా  విడుదల చేసారు ... చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే ... ఈ చిత్రం తరువాత అంతే భారీ అంచనాలతో విడుదల అయిన 'క్యామెరామ్యాన్ గంగ తో రాంబాబు ' చిత్రం పవన్ అభిమానులని నిరాశ పరచినా, 'గబ్బర్ సింగ్' విజయం తో మాత్రం పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ... 

ఇప్పుడు తనకు 'జల్సా' తో విజయాన్ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న పవన్ , ప్రస్తుతం ఈ సినిమా పైనే దృష్టి సారిస్తున్నా, ఇంకో వైపు తనకు విజయం తెచ్చిపెట్టిన 'గబ్బర్ సింగ్' కొనసాగింపు గురించి ఆలోచన మొదలుపెట్టేసాడు ... హిందీ లో 'దబంగ్' కి కొనసాగింపు గా 'దబంగ్ - 2' విడుదల అయ్యి విజయం సాధించడం , హరీష్ శంకర్ కొనసాగింపు కధలో కూడా మార్పులు చేసి , పవన్ తో 'గబ్బర్ సింగ్ - 2' కి తాను రెడీ అని చెప్పడం మనకు తెలిసిందే ... అయితే పవర్ స్టార్ కూడా ఈ చిత్రం పై మక్కువ చూపుతున్నాడని , సొంత బ్యానర్ పైనే సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని , త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు  త్వరలోనే విడుదల చేస్తారని తెలుగు సినిమా వర్గాల సమాచారం

No comments:

Post a Comment