Wednesday 9 January 2013

Acid Attack On Actress Kangna Sister


Acid attack on Kangna's sister

     బాలీవుడ్  హీరోయిన్  కంగనా రనౌత్  ఇప్పుడు ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్  బాధితురాలు తరపున పోరాటం చేయటానికి  నడుం బిగించింది. బాలీవుడ్  నుండి అనేక మంది స్టార్ హీరోయిన్లు  బాధితురాలికి  మద్దతు తెలిపారు, కొంత మంది  కామెంట్స్  చేశారు. మరికొందరు  ఆమె కన్నీటీ  నివాళులు ఆర్పించారు. కానీ  కంగనా  మాత్రం  నడి రోడ్డు పైకి వచ్చి  గ్యాంగ్  రేప్  నిందితులకు  కఠినమైన శిక్ష పడాలని హల్ చల్ చేసింది.  కంగనా అలా రోడ్డు పై హల్ చల్ చేయటం  పై బాలీవుడ్ స్టార్స్  అందరు అవాక్కుయ్యరు.  కంగనా అలా చేయటం వెనక పెద్ద రహస్యం దాగి  ఉందని కొంతమంది  చెబుతున్నారు.  కంగనా బాధపడటం వెనుక ఆమె సొంత చెల్లీకి కూడా ఇలానే జరిగిందేనే వాదానలు వినిపిస్తున్నాయి.  అసలు విషయం ఏమిటయ్య అంటే .. చాలా మంది బయటపడి  చెప్పుకోరు. అలాంటి వారిలో కంగనా ఒకరు. ఆమె ఎప్పుడు  కూడా తన చెల్లి జరిగిన  అన్యాయం గురించి  ఎక్కడ చెప్పలేదు. కానీ మహిళలు  పట్ట పగలు  కూడా  రోడ్ల మీద నడిచే  పరిస్థితి లేకుండా పోతుందని కంగనా అంటుంది.  అందుకే  తన చెల్లికి జరిగిన విషయం గురించి బయటపెట్టింది. తన చెల్లెలికి  ఎదురైన  అనుభవాన్ని  వివరించించి ‘ ఏక్  నిరంజన్’లో  నాయిక కంగనా  రనౌత్.  ఆరేళ్ల క్రితం  జరిగిన సంఘటన. 
Acid attack on Kangna's sister
కంగనా కుటుంబం అంత డెహ్రాడూన్ లో   ఉండే రోజుల్లో  తన చెల్లి  క్లాస్ మెట్   ప్రేమిస్తున్నానంటూ   ఆమె వెంటపడేవాడు. అయితే  తన చెల్లి  ఎంతకీ  ప్రేమను  అంగీకరించకపోవడంతో    దాన్ని  అతను  అవమానంగా  భావించి  ఒక రోజు   ఆవేశంగా  మా ఇంటికొచ్చి  చెల్లి ముఖంపై  యాసిడ్  పోశాడు.  ఆ బాదతో  నా చెల్లి విలవిల్లాడిపోయింది.   ఆమె పడిన బాధ నా కళ్లముందు  కదిలాడుతుందని  కంగనా  కంటి నుండి కారుతున్న కన్నీళ్లను  తుడుచుకుంటూ  చెప్పింది.  నా చెల్లి  మానసికంగా  చాలా కుంగిపోయింది.   అయితే  మేం న్యాయం కోసం  ఏళ్ల తరబడి  కోర్టుల  చుట్టూ తిరిగితే   గానీ అతనికి  శిక్షపడలేదు. ఆ నరకయాతన ఎలా ఉంటుందో  నాకు తెలుసునని కంగనా  చెబుతుంది. అందుకే   ఢిల్లీ గ్యాంగ్ రేప్  బాధితురాలికి అండగా  ఉండాలనుకుంటున్నానని కంగనా  అంటుంది.  అయితే  ప్రభుత్వం చేపట్టిన   కార్ల  అద్దాలకు  నల్లని  ఫిల్మ్ లను  తొలగించడం  మొదలు అమ్మాయిలు  రక్షణ కోసం  ప్రభుత్వం  తీసుకునే   ప్రతి చర్యకు  ప్రతి ఒక్కరు  మద్దతు పలకాలని   కంగనా  అందరినీ  కోరుకుంటుంది...ఇంతకీ ఆమె చెల్లి పేరు ఏమిటో తెలుసు?  రంగోళి రనౌత్. ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి? అక్టోబరు 05 2006 లో జరిగిన సంఘటన? కంగనా ఇప్పుడు బయట పెట్టింది?  అప్పడు మీడియా ద్వారా అందరికి తెలుసు? కానీ ఆమె  ఢిల్లీలో జరిగిన సంఘటనకు మద్దతు ఇవ్వటం వెనక ఉన్న రహస్యం ఇదేనని బాలీవుడ్  పెద్దలు అంటున్నారు.

No comments:

Post a Comment