Sunday 3 February 2013

Mr Pellikoduku Audio Review

13

      కామెడీ నుంచి హీరోగా టర్న్ తీసుకుని దూసుకుపోతోన్న సునీల్‌ - ఇషాచావ్లా జంటగా మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ పై.లిమిటెడ్‌ నిర్మిస్తున్న చిత్రం 'మిష్టర్‌ పెళ్లికొడుకు'.  ఎన్‌.వి.ప్రసాద్‌, పారస్‌జైన్‌ నిర్మాతలు. ఆర్‌.బి.చౌదరి సమర్పిస్తున్నారు. దేవిప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నాగచైతన్య సీడీలోగోను విడుదల చేశారు. ఆడియో సిడీలను వి.వి.వినాయక్‌ ఆవిష్కరించి తమన్న, నాగచైతన్యకు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దేవిప్రసాద్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు: ‘సౌత్‌ ఇండియాలో అగ్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌. ఇక్కడ ఎంతోమంది గొప్ప టెక్నీషియన్లు పనిచేశారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న సూపర్‌గుడ్‌ పతాకంలో నేను సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ బ్యానర్‌లో నేను 'నువ్వువస్తావని' సినిమాకు కో-డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమాకి సంబంధించి మార్కులు వేయాల్సి వస్తే ఫస్ట్‌ మార్కు సునీల్‌ డ్యాన్స్‌ కి పడతాయి. తొలి ప్రేక్షకుడిగా నేను సునీల్‌ డ్యాన్సులను, పాటలను చాలా ఎంజాయ్ చేశాను. ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌తో గతంలో నేను 'లీలామహల్‌ సెంటర్‌'కు పనిచేశాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. యూత్‌తో పోటీపడాలని ఈ ట్రెండీ మ్యూజిక్‌ ఇచ్చారు. ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. దర్శకుడిగా ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. 'తను వెడ్స్‌ మను' సునీల్‌తో ఎలా తీస్తారు అని చాలా మందికి సందేహం కలిగింది. అది మల్టీప్లెక్స్‌ మూవీ కదా అని అన్నవారు కూడా ఉన్నారు. ఈ సినిమాను చూస్తే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. మేకింగ్‌పరంగా నిర్మాతలు తమ సత్తాను మరోసారి చూపారు. వాకాడ అప్పారావుగారు లేకుంటే ఈ సినిమానే లేదు. ఆయన ఈ సంస్థకు వెన్నెముక’ అని వెల్లడించారు.

         వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘కోడి రామకృష్ణ దగ్గరదేవి, సాగర్‌గారి దగ్గర నేను పనిచేసేవాళ్లం. అప్పటి నుంచి మేం ఫ్రెండ్స్‌. ఈ సినిమా హిట్‌ కావాలి. కష్టానికి ఓ రూపం ఇవ్వాల్సి వస్తే సునీల్‌ బొమ్మను పెడితే సరిపోతుంది. ఈ షేప్‌కి రావడానికి తను ఎంతటి నరకం అనుభవించాడో అర్థమవుతోంది. హ్యాట్సాఫ్‌ టు హిమ్’ అన్నారు.

      హీరో సునీల్‌ మాట్లాడుతూ ‘మిస్టర్‌పెళ్లికొడుకు అని పేరు పెట్టి హీరోని కామ్‌గా ఉండమన్నారు. అందాలరాముడు ఆర్తి పాత్రలాగే, ఇందులో ఇషా పాత్ర ఉంటుంది. నల్లమలుపు బుజ్జి చెప్పాడని ఈ సినిమా చూసి చేయడానికి ఒప్పుకున్నాను. మన కల్చర్‌కాని సబ్జెక్ట్‌ను మన కల్చర్‌లో ఒదిగిపోయేటట్టు చేసి సినిమా తీసిన దర్శకుడికి 100శాతం క్రెడిట్‌ దక్కుతుంది. అంతా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నారు’. అని కాంక్షించారు.
...avnk

No comments:

Post a Comment