Saturday 2 February 2013

Rana Comments On Samantha

a

      వెండితెరమీదకి వచ్చిన అనతికాలంలోనే టాలీవుడ్ లోనేకాదు బాలీవుడ్ లో సైతం తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్న యంగ్ హీరో, ఆరడుగుల పైచిలుకు అందగాడు మూవీ మొఘల్ మనువడు రానా దగ్గుబాటి. ఈ కుర్రహీరో చేసిన సంచలన ప్రకటన ఏంటో చూద్దాం..  ‘ఇప్పటివరకూ నా జీవితంలో సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమలో పడ్డాను. మొదటగా ‘క్షణ క్షణం’ సినిమా చూసిన తర్వాత శ్రీ దేవితో ప్రేమలో పడ్డాను, ఆ తర్వాత ‘ఏ మాయ చేసావే’ సినిమా చూసి సమంతతో ప్రేమ లో పడ్డాను. ఆ సినిమాలో సమంత సూపర్బ్ గా ఉంటుందని’ జబర్దస్త్ ఆడియో వేడుకలో రానా సెలవిచ్చాడు. ఇక సిద్దార్థ్ వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు. జబర్దస్త్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని’ తెలిపాడు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.

aaa
       ఇక, రానా- ప్రభాస్ అన్నదమ్ములుగా, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘బాహుబలి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రభాస్ – రానా ఈ రోజు నుంచి కత్తి ఫైట్స్ నేర్చ్గుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క కూడా కత్తి ఫైట్ నేర్చుకుంటోంది. ఈ సంగతిని రాజమౌళి ఇలా వివరించాడు. ‘ఈ రోజు ప్రభాస్ – రానాకి కత్తి ఫైట్ ట్రైనింగ్ మొదటి రోజు. వారున్న హైట్, పర్సనాలిటీకి ఎగురుతుంటే మనుషుల్లా అనిపించడం లేదు. వీరికి తగ్గట్టుగానే అనుష్క హైట్ కూడా 5′.10 కావడంతో వారికి సమానంగా ఉంది. ఈ ట్రైనింగ్ చాలా బాగుంది. కానీ సమస్య మొత్తం ఫోటోగ్రఫీ డైరెక్టర్ కే ఎందుకంటే వారిద్దరినీ ఒకే ఫ్రేంలో చూపించాలి కదా’ అని చలోక్తి విసిరాడు.
...avnk

No comments:

Post a Comment