Wednesday 16 July 2014

Team India And England Cricket Teams In Lords Ground

 
lords-ground-in-englad.gif
 
ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ టూర్ లో వుంది. మొన్నటికి మొన్ని ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చూపించింది. ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టేలా భారత క్రికెటర్లు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నమ్మకంతోనే రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. సుప్రసిద్ధ లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య 17.07.2014 నుంచి ప్రారంభం కానుంది.

అయితే భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ కఠిన పరీక్షగా నిలిచిపోయింది. గతంలో ఈ స్టేడియంలో భారత్ ఏర్పరచిన గణాంకాలు ఎంతో భయంకరంగా వున్నాయి. 82 ఏళ్ల క్రితం భారత్ అడుగు పెట్టిన ఈ మైదానంలో మొత్తం 16 టెస్ట్ మ్యాచులు ఆడింది. అయితే అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచులన్నింటిలో భారత్ కేవలం 1 మ్యాచ్ మాత్రం గెలవగలిగింది. అది కూడా 28 సంవత్సరాల క్రితం. ఇక 11 మ్యాచుల్లో ఓటమి పాలవగా.. నాలుగు మ్యాచుల్ని ఎంతో కష్టంతో డ్రా చేసుకుంది. దీంతో భారత్ కు ఈ లార్డ్స్ స్టేడియం ఒక భూతంలా మారిపోయింది.

ఈ లార్డ్స్ స్టేడియంలో పిచ్ ముఖ్యంగా పిచ్ పేసర్లకు ఎంతో సహకరిస్తుంది. 200-2007 మధ్యకాలంలో ఈ మైదానంలో పేసర్లు 145 వికెట్లు తీసుకోగా... స్పిన్నర్లు 52 వికెట్లు తీసుకున్నారు. బ్యాట్స్ మెన్ ల ప్రదర్శన ఈ స్టేడియంలో అంతంగా మాత్రంగానే వుంది. ఏ జట్టు కూడా ఈ మైదానంలో అత్యధిక స్కోరును సాధించలేకపోయారు. ఇప్పుడు భారత్ - ఇంగ్లాండ్ కు మధ్య లార్డ్స్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ లో భారత్ కు ఒక సవాలుగా మారిపోయింది. ఇన్ని ప్రతికూలతలతో కూడిన ఈ మైదానంలో ధోనీ సేన ఎలా ఎదుర్కోబోతుందా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS
టీమిండియాకు భూతంగా మారిన లార్డ్స్ గ్రౌండ్!
టీమిండియాకు భూతంగా మారిన లార్డ్స్ గ్రౌండ్!

No comments:

Post a Comment