Telugu Wishesh no delay in coverage of developments in the Telugu film and movie reviews
Saturday, 19 July 2014
Suresh Raina And Sruthi Hassan Love Affair
గతంలో సెక్సీ నటి శృతిహాసన్, భారత్ డ్యాషింగ్ క్రికెటర్ అయిన సురేష్ రైనాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. త్వరలోనే వారు తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టనున్నారనే నేపథ్యంలో... ఇద్దరు తమ మధ్య ఎటువంటి బంధం లేదంటూ ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! ఏదో అప్పుడప్పుడు సరదాగా వుండటం కోసం ఇలా కలుస్తుంటాం! దానిని మీరు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ’’ గుర్రుగా మీడియాకు స్పష్టం చేశారు..... Read More.....
గతంలో
సెక్సీ నటి శృతిహాసన్, భారత్ డ్యాషింగ్ క్రికెటర్ అయిన సురేష్ రైనాల మధ్య
ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో
మునిగితేలుతున్నారని.. త్వరలోనే వారు తమ పెళ్లి విషయాన్ని
బయటపెట్టనున్నారనే నేపథ్యంలో... ఇద్దరు తమ మధ్య ఎటువంటి బంధం లేదంటూ ఆ
వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! ఏదో
అప్పుడప్పుడు సరదాగా వుండటం కోసం ఇలా కలుస్తుంటాం! దానిని మీరు ఇంత
రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ’’ గుర్రుగా మీడియాకు స్పష్టం చేశారు. -
See more at:
http://www.teluguwishesh.com/cinema-movies-films/699-hot-gossips/54634-suresh-raina-and-sruthi-hassan-love-affair.html#sthash.ehYj9e4w.dpuf
Salman Khan Liplock Scene With Jaqueline Fernandez In Kick
‘‘లిప్ లాక్’’తో కిక్కెక్కించనున్న పెళ్లికాని ప్రసాద్!
ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమల్లో ‘‘లిప్ లాక్’’ సన్నివేశాలు చాలా సాధారణం అయిపోయాయి. చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాలకు వరకు కనీసం ఒక్క సన్నివేశంలోనైనా చుంబనాలు చేసుకోవడం సహజంగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీ విషయం కాస్త పక్కనపెడితే... బాలీవుడ్ లో చుంబనాల్లో నెంబర్ 1 హీరోగా ఇమ్రాన్ హష్మి పేరు సంపాదించుకున్నాడు. అతనితో మొదలైన ఈ చుంబనాలు పోటీ... నేటి యువహీరోలు సైతం ఎగబడి మరీ చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలు లేకుండానే విచ్చలవిడిగా వెండితెరపై ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. Read More......
Brahmanandam Saitan Raj Promo Song Geethanjali Movie
అంజలి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి’. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగు ఉందని అందుకోసం స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సమంత, కాజల్ లు ఇద్దరూ కూడా ఈ సినిమాలోని ఐటెం సాంగులో నటించట్లేదని తేలిపోయింది....... Read More......
Friday, 18 July 2014
Tollywood Hero Allu Arjun To Open Joyalukkas Showroom
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఊపిరాడక కొద్ది సేపు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దీంతో వెంటనే పోలీస్ సిబ్బంది రావటంతో అల్లుఅర్జున్ ఊపిరీ పీల్చుకున్నారు. ఇప్పటి వరకు హీరోయిన్లకు అభిమానుల సెగ బాగా తాకింది.అంతో ..హీరోయిన్లు అభిమానుల మద్య ఊపిరాడక.. అల్లాడిపోయేవారు. ఆ సమయంలో..కొంటె అభిమానులు..చిల్లరపనులు చేసేవారు.Read More.....
Goa Beauty Ileana Turning As Bold Actress To Get Movie Offers In Tollywood And Bollywod For Stardom
గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్య తన హాట్ అందాలను జనాలకు పంచిపెడుతూ వార్తల్లో ఎక్కుతోంది. టాలీవుడ్ లో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు... ఆమధ్య కాలంలో తన సన్నజాజి నడుము సోయగాలతో యువజనాలను తన వలలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే బాలీవుడ్ మీదున్న అత్యాశతో టాలీవుడ్ మీద కొన్ని ఘాటు విమర్శలు చేసి, ముంబయికి చెక్కేసింది. Read More....
Tapsee Smoking 100 Cigerettes Per Daily
అవును.. మీరు చదివింది అక్షరాలా నిజం! తాప్సీ రోజుకు 100 సిగరెట్లకుపైన స్మోకింగ్ చేస్తుందట! ఈ విషయాన్ని స్వయాన తాప్సీయే ట్విటర్ ద్వారా తెలిపింది. ‘‘వామ్మో! నేను రోజుకు వందసిగరెట్ల పొగను తాగుతున్నానా..?’’ అంటూ ఆశ్చర్యపోతూ ట్వీట్ చేసింది. దీంతో ఈమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన అభిమాన తార రోజుకు ఇన్ని సిగరెట్లు తాగుతుందా అంటూ వారు కూడా తాప్సీ చేసిన ట్వీట్ కి ట్వీట్లు కలుపుకుంటూ పోయారు. అయితే చివరికి తాప్సీ ఇచ్చిన సమాధానం చూసి అందరూ ఖంగుతిన్నారట!.....Read More.........
Romantic Song Between Tamanna And Prabhas In Bahubali Movie
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘బాహుబలి’’ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వెలువడుతూనే వుంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జక్కన్న ఎన్నోరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. భారీఫైట్ల సన్నివేశాల కోసం హీరో ప్రభాస్, రానాలతోపాటు సహనటులతో కూడా ఎక్సర్ సైజులు చేయిస్తున్నాడు. రానా - ప్రభాస్ ల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాల కోసం కొన్ని ప్రత్యేక కెమెరాలను వినియోగిస్తున్నాడు. Read More......
Sruthi Hassan Special Song In Agadu Movie With Mahesh Babu
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమా ‘‘ఆగడు’’! ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ
సినిమాలో శృతిహాసన్ ఒక ప్రత్యేక గీతంలో నటించనుందని అందరికీ తెలిసిన
విషయమే! ఈ పాట షూటింగ్ జూలై 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 4 నిముషాల
వరకు నిడివి వుండే ఈ పాట... ప్రేక్షకజనాలను బాగా నచ్చుతుందని, సినిమాకు
ప్రత్యేకంగా క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.
తాజాగా ఈ పాటకోసం శృతిహాసన్ బికినీ ధరించుకుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబులాంటి స్టార్ హీరోతో మొదటిసారి స్టెప్పులు వేసే అవకాశం రావడంతో శృతి ఇలా శృతిమించేవిధంగా డ్రెస్సులు ధరిస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. Read More......

Thursday, 17 July 2014
Dasari Narayana Rao Grand Daughter Neerajitha
ప్రస్తుతం మన టాలీవుడ్ లో వారసత్వాల పర్వం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కొత్త హీరోలకు అవకాశాలు లేకుండా అక్క, అత్త, అన్నయ్య, మామయ్య కొడుకులు అంటూ ఎగబడుతూ మరీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పారేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో వస్తున్న దాదాపు సినిమాలన్నీ వారసత్వం నుంచి వచ్చిన వారివే! ఈ లెక్కప్రకారం చూస్తే.. మన టాలీవుడ్ లో వున్నంత వారసులు యావత్తు ప్రపంచంలో వున్న ఏ చిత్రపరిశ్రమల్లోనూ కనిపించరు.
టాలీవుడ్ లో పెద్దతలకాయలుగా పేరున్న వారందరీ వారసులూ ఇప్పటికే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టేసి, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన వారసులందరూ ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చినవారే! ఇప్పుడు తాజాగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా తన పేరును లిఖించుకున్న దాసరి నాయారణరావు కుటుంబం నుంచి ఆయన వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది. దాసరి ఇంతవరకు టాలీవుడ్ లో చాలామంది కొత్తవారికి దర్శకులుగానో, నటులుగానో నిలబెట్టారు. కానీ ఆయన కుమారుడు అరుణ్ కుమార్ ను మాత్రం హీరోగా నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన ముఖచిత్రం కూడా పరిశ్రమలో కనిపించడం లేదు. ఈ విషయంపై దాసరి ఎన్నోసార్లు తన ఆవేదనను కూడా వ్యక్తం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా దాసరి వారసత్వాతన్ని నిలబెట్టేందుకు ఆయన కుటుంబం నుంచి వారసురాలు రాబోతోంది. ఆమెవరో కాదు.. దాసరి మనువరాలు నీరాజిత. ప్రస్తుతం దాసరి తన స్వీయదర్శకత్వంలో మంచు విష్ణుతో కలిసి ‘‘ఎర్రబస్సు’’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలోనే నీరాజిత కూడా ఒక కీలకపాత్ర పోషిస్తోందని తాజా సమాచారం! అయితే దీనికి సంబంధించిన ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. నీరాజిత అయినా ప్రేక్షకులకు ఆకర్షించి, దాసరి వారసత్వాన్ని నిలబెడుతుందో లేదో వేచి చూడాల్సిందే!
AS

dasari narayana rao grand daughter neerajitha, Dasari Narayana Rao grand daughter role in yerra bassu movie, dasari grand daughter neerajitha latest news, dasari grand daughter neerajita latest news, dasari grand daughter neerajita special role in yerra bassu movie, dasari grand daughter neerajita ready to enter in tollywood, dasari grand daughter neerajita in yerra bassu movie, dasari grand daughter neerajita latest news, dasari grand daughter neerajita photos
Parineeti Chopra Wants To Work With Prince Mahesh Babu
టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ ఎంతుంతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు... కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా ప్రిన్స్ కు బాగానే ఫాలోయింగ్ వుంది. ఈయన హిట్ అయిన దాదాపు అన్నీ సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం తలదన్నేసేలా పర్సనాలిటీ కలిగి వుండటం వల్ల అందరూ ఇతనిని డ్రీమ్ బాయ్ గా పిలుచుకుంటారు. ఇక అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
తన స్టైల్ తో అమ్మాయిలను నిద్రపట్టనివ్వకుండా చేస్తున్న ప్రిన్స్... ఇప్పుడు బాలీవుడ్ భామల మనసులను కూడా దోచేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో వున్న అగ్రహీరోయిన్లు సైతం మహేష్ బాబుతో నటించడానికి తహతహలాడుతుంటారు. బాలీవుడ్ భామలందరూ సౌత్ ఇండస్ట్రీలో నటించే అవకాశం వస్తే అది కేవలం మహేష్ తోనే ఎంట్రీ అయి వుండాలని కోరికలు చెప్పుకుంటున్నారు. ఈ జాబితాలో చాలామందే వున్నా... ఇప్పుడు ఇందులో లేటెస్ట్ గా పరిణీతి చోప్రా కూడా చేరిపోయింది.
పరిణీతి చోప్రా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన తీపి కోరికల గురించి వెల్లడించింది. దక్షిణాదిన సినిమా ఆఫర్లు వస్తే, ఎవరితో నటించడానికి ఇష్టపడుతారని ప్రశ్నిస్తే... దానికి వెంటనే మహేష్ బాబు సరసన నటించాలని వుందంటూ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చేసింది. గతంలో కూడా తాను మహేష్ బాబు మీద మోజు పడిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అంటే పరిణీతికి కూడా ప్రిన్స్ నిద్రపట్టనివ్వకుండా కలలో వస్తున్నాడేమోనని సినీ విశ్లేషకులు అంటున్నారు.
గతకొంతకాలం క్రితం పరిణీతిని రానా సరసన నటించాల్సిందిగా అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆ విశేషాల గురించి ఏమీ ప్రస్తావించకుండా కేవలం మహేష్ బాబు గురించి చెబుతోందంటే... పీకల్లోతుదాకా తన ప్రేమలో పడిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈమె కోరికను తీరుస్తాడా..? వేచి చూడాల్సిందే!

Wednesday, 16 July 2014
Brics Bank Presidency To India
దేశాల మొదటి అక్షరాలను కూర్చి బ్రిక్ దేశాలని పిలుస్తున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మంగళవారం బ్రెజిల్ లో జరిపిన సమావేశంలో 100 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంక్ ను ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అని పేరిడిన ఈ బ్యాంక్ ఒక్కోసారి ఒక్కో దేశం 5 సంవత్సరాల కాలానికి అధ్యక్షత వహిస్తుందన్న ప్రతిపాదనకు కూడా సర్వసమ్మతి లభించింది. ఇది భారత దేశంతో మొదలవుతోంది. అంటే న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ కి తొలి అధ్యక్ష పదవి భారత్ కి దక్కింది.
వర్ల్ డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండంతటి పటిష్టమైన గొప్ప బ్యాంక్ గా న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ని అభివృద్ధి పరచటానికి మంగళవారం బ్రిక్స్ ప్రతినిధులంతా నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యాంక్ ని సర్వసభ్య దేశాల పరస్పర సహకారంతో స్థానిక బ్యాంక్ లకు చేయూతనిచ్చి అభివృద్ధి పథంలో నడిచేట్టుగా చేస్తాయి. బ్రిక్స్ దేశాల న్యూడెవలప్ మెంట్ బ్యాంక్, చైనాలో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సంబంధాలు మెరుగుపరచాలన్న బ్రెజిల్, భారత్ దేశాల చిరకాల కోరికను అందులో వీటో పవర్స్ ఉన్న రష్యా, చైనా దేశాలు విస్మరిస్తూ వస్తున్నాయి. మంగళవారం బ్రిక్స్ దేశాలన్నీ కలిసి చేసిన తీర్మానంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో బ్రెజిల్, భారత్ దేశాల ఆకాంక్ష నెరవేరటానికి మద్దతునిస్తామని తెలియజేయటం జరిగింది.
-శ్రీజ

బ్రిక్స్
బ్యాంక్ కి అంకురార్పణ, భారత్ కి తొలి అధ్యక్ష పదవి - See more at:
http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/54510-brics-bank-presidency-to-india.html#sthash.0E4fxtAT.dpuf
Star War Between Pawan Kalyan And Mahesh Babu In The Tollywood
తెలుగు చిత్రపరిశ్రమలో వున్న హీరోలందరూ ఒకవైపు అయితే.... పవన్, మహేష్ లు మరోవైపు. ఈ ఇద్దరికి వున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు దక్కలేదు. వీరిద్దరి స్టార్ డమ్ ముందు ఏ హీరో నిలబడలేక తప్పుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డమ్ కోసం పోటీలు జరుగుతున్నాయి. రోజురోజుకో రసవత్తరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఇద్దరి మధ్య ఢీ అంటూ ఢీ అంటూ వార్ నడుస్తోంది. వీరికి తగ్గట్టు అభిమానులు కూడా తమ హీరోల గురించి ప్రత్యేకంగా ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు.
అలాగే టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా మహేష్, పవన్ లను ఇద్దరే ఇద్దరు అని కితాబిస్తున్నారు. మాస్, క్లాస్ కు తేడాలేకుండా అన్నిరకాల చిత్రాల్లో నటిస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు... అటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ.. అభిమానులను ఆనందంతో తడిపేస్తున్నారు. ఒకరు దూకుడు ప్రదర్శనతో ముందుకు దూసుకుపోతుంటే... మరొకరు గబ్బర్ సింగ్ అంటూ రికార్డులు సృష్టించుకుపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధులదాకా వీరిద్దరికీ భీభత్సమైన క్రేజ్ వుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.
ఇప్పుడు తాజాగా చెన్నైలో నిర్వహించిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో కూడా మరోసారి వీరిద్దరి మధ్య వున్న ఫైట్ రసవత్తరంగా మారింది. వీరిద్దరిలో ఎవరు ఫిలింఫేర్ అవార్డు గెలుస్తారోనన్న ఆశతో అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. చిత్రపరిశ్రమలో వీరిద్దరిలో టాప్ హీరో అనేది ఇంకా ఫైనల్ కాకపోయినా... అవార్డ్స్ ఫంక్షన్ లో మాత్రం పవన్ కన్నా మహేష్ బాబుయే ముందున్నాడు. ఈసారి కూడా ఫిలింఫేర్ అవార్డును తన సొంతం చేసుకున్నాడు మహేష్! ఇప్పటికీ మహేష్ తన కెరీర్ లో నాలుగు సార్లు ఈ ఫిలింఫేర్ అవార్డును తీసుకోగా... పవన్ కల్యాణ్ కు ఇంతవరకు ఒక్కటి మాత్రమే పొందగలిగాడు.
గతంలో ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులను కొట్టేసిన మహేష్.. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు నాలుగోసారి అందుకున్నాడు. పవన్ కల్యాణ్ మాత్రం గత సంవత్సరంలో గబ్బర్ సింగ్ సినిమాకుగాను అవార్డు తీసుకున్నాడు. ఈ సంవత్సరంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించినా... అందుకు అవార్డు మాత్రం లభించలేదు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అయినా తమ హీరోయే బెస్ట్ అంటూ వారు కితాబిచ్చుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ దూసుకుంటూపోతే... మహేష్ బాబు కూడా ఆ రికార్డులకు సమానంగా పవన్ కు పోటీదారుడిగా ప్రతిసారి నిలుస్తున్నాడు. వీరిద్దరిలో ఇంతవరకు ఎవరు టాలీవుడ్ స్టార్ హీరో అని లెక్కలు తేల్చలేకపోయినా.. అవార్డులలో మాత్రం మహేష్ బాబు పవన్ కంటే ముందున్నాడు. మరి వీరి మధ్య నడుస్తున్న ఈ స్టార్ ఇంకెన్నాళ్లవరకు నడుస్తుందోనని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Team India And England Cricket Teams In Lords Ground
ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ టూర్ లో వుంది. మొన్నటికి మొన్ని ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చూపించింది. ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టేలా భారత క్రికెటర్లు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నమ్మకంతోనే రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. సుప్రసిద్ధ లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య 17.07.2014 నుంచి ప్రారంభం కానుంది.
అయితే భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ కఠిన పరీక్షగా నిలిచిపోయింది. గతంలో ఈ స్టేడియంలో భారత్ ఏర్పరచిన గణాంకాలు ఎంతో భయంకరంగా వున్నాయి. 82 ఏళ్ల క్రితం భారత్ అడుగు పెట్టిన ఈ మైదానంలో మొత్తం 16 టెస్ట్ మ్యాచులు ఆడింది. అయితే అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచులన్నింటిలో భారత్ కేవలం 1 మ్యాచ్ మాత్రం గెలవగలిగింది. అది కూడా 28 సంవత్సరాల క్రితం. ఇక 11 మ్యాచుల్లో ఓటమి పాలవగా.. నాలుగు మ్యాచుల్ని ఎంతో కష్టంతో డ్రా చేసుకుంది. దీంతో భారత్ కు ఈ లార్డ్స్ స్టేడియం ఒక భూతంలా మారిపోయింది.
ఈ లార్డ్స్ స్టేడియంలో పిచ్ ముఖ్యంగా పిచ్ పేసర్లకు ఎంతో సహకరిస్తుంది. 200-2007 మధ్యకాలంలో ఈ మైదానంలో పేసర్లు 145 వికెట్లు తీసుకోగా... స్పిన్నర్లు 52 వికెట్లు తీసుకున్నారు. బ్యాట్స్ మెన్ ల ప్రదర్శన ఈ స్టేడియంలో అంతంగా మాత్రంగానే వుంది. ఏ జట్టు కూడా ఈ మైదానంలో అత్యధిక స్కోరును సాధించలేకపోయారు. ఇప్పుడు భారత్ - ఇంగ్లాండ్ కు మధ్య లార్డ్స్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ లో భారత్ కు ఒక సవాలుగా మారిపోయింది. ఇన్ని ప్రతికూలతలతో కూడిన ఈ మైదానంలో ధోనీ సేన ఎలా ఎదుర్కోబోతుందా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీమిండియాకు భూతంగా మారిన లార్డ్స్ గ్రౌండ్!

Subscribe to:
Posts (Atom)