Showing posts with label archana heroine. Show all posts
Showing posts with label archana heroine. Show all posts

Friday, 19 April 2013

Archana Hopes On Panchami

archana hopes on Panchami.png

  అర్చన ఆశలన్నీ అందాల ఆరబోత పైనే

భానుడు తన ప్రతాపంతో జనాలకు వేడి పుట్టిస్తుంటే.... మరో ప్రక్క తన అందచందాలతో కుర్రకారుకు ఈ వేసవిలో మరింత వేడి పుట్టిస్తానంటుంది నటి అర్చన. అచ్చమైన తెలుగమ్మాయి అయిన వేద అర్చనగా తెలుగు తెరకు పరిచయం అయి బడా హీరోయిన్ గా వెలిగిపోదాం అనుకుంది. ఈ అమ్మడుకు బడా హీరోల ప్రక్కన మంచి అవకాశాలే వచ్చినా, అవి ఆఫర్లను తీసుకురాలేక పోయాయి. దీంతో గత కొన్ని రోజుల నుండి బొత్తిగా తెలుగు తెర పై కనిపించడం మానేసింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ ఇండస్ట్రీకి  మకాం మార్చి అవకాశాలు రాబట్టుకుంటున్న అర్చన ఇటీవల మత్తెక్కించే పాత్రలో తన అందాలను ఆరబోసిందట. ఈ అందాలకు ఫిదా అయిపోయిన ఓ తెలుగు దర్శకుడు ఈమెను హీరోయిన్ గా పెట్టి పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘పంచమి ’ లో అర్చన నటింపజేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో అర్చన ప్రేక్షకులకు హీటు పుట్టిస్తున్నాయి ఇంత వేసవి కాలంలో. ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు ఇంత వేసవి కాలంలో కూడా థియేటర్లో ఈమె అందాలకు వేడి పుట్టడం ఖాయం అంటున్నారు.
ఈమె కూడా ఈ సినిమాలో ఆరబోసిన అందాల పైనే ఆశలు పెట్టుకుందట. విరగకాసిన వెన్నెల లాగా అరబోసిన అందాలను చూసిన తెలుగు దర్శకులు ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Tuesday, 2 April 2013

Actress Archana As Call Girl


Movie news

archana

ఈ మధ్యన కథానాయికలు అవకాశాల కోసం ఏ పాత్రలు అయినా చేయడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగు వెలిగిన ఛార్మి, శ్రేయ వంటి వాళ్ళు వేశ్య పాత్రల్లో నటించారు. వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ పయణిస్తుంది. వేదగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయి, అర్చనగా వెండితెర అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న త్వరలో అర్చన కూడా వేశ్యగా మారబోతుంది. ఇప్పటికే శ్రీయ నటించి పవిత్ర సినిమా ట్రైలర్లకు, ఛార్మి నటించిన ‘ప్రేమ ఓ మైకం ’ సినిమా ట్రైలర్లకు మంచి రెప్పాన్స్ రావడంతో ఇదే తరహా కాన్సెప్ట్ తో మరో చిత్రం తీయడానికి జాతీయ స్టాయిలో పేరు సంపాదించుకున్న ‘1940 లో ఓ గ్రామం ’ సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహ నంది ఈ సినిమా చేయబోతున్నాడు.



ఇందులో అర్చనను వేశ్య పాత్రకు ఎంపిక చేశారు. శివాజీ హీరోగా నటించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మరి ఈ వేశ్య పాత్ర ద్వారా అయిన అర్చనకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.