Friday, 19 April 2013

Archana Hopes On Panchami

archana hopes on Panchami.png

  అర్చన ఆశలన్నీ అందాల ఆరబోత పైనే

భానుడు తన ప్రతాపంతో జనాలకు వేడి పుట్టిస్తుంటే.... మరో ప్రక్క తన అందచందాలతో కుర్రకారుకు ఈ వేసవిలో మరింత వేడి పుట్టిస్తానంటుంది నటి అర్చన. అచ్చమైన తెలుగమ్మాయి అయిన వేద అర్చనగా తెలుగు తెరకు పరిచయం అయి బడా హీరోయిన్ గా వెలిగిపోదాం అనుకుంది. ఈ అమ్మడుకు బడా హీరోల ప్రక్కన మంచి అవకాశాలే వచ్చినా, అవి ఆఫర్లను తీసుకురాలేక పోయాయి. దీంతో గత కొన్ని రోజుల నుండి బొత్తిగా తెలుగు తెర పై కనిపించడం మానేసింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ ఇండస్ట్రీకి  మకాం మార్చి అవకాశాలు రాబట్టుకుంటున్న అర్చన ఇటీవల మత్తెక్కించే పాత్రలో తన అందాలను ఆరబోసిందట. ఈ అందాలకు ఫిదా అయిపోయిన ఓ తెలుగు దర్శకుడు ఈమెను హీరోయిన్ గా పెట్టి పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘పంచమి ’ లో అర్చన నటింపజేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో అర్చన ప్రేక్షకులకు హీటు పుట్టిస్తున్నాయి ఇంత వేసవి కాలంలో. ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు ఇంత వేసవి కాలంలో కూడా థియేటర్లో ఈమె అందాలకు వేడి పుట్టడం ఖాయం అంటున్నారు.
ఈమె కూడా ఈ సినిమాలో ఆరబోసిన అందాల పైనే ఆశలు పెట్టుకుందట. విరగకాసిన వెన్నెల లాగా అరబోసిన అందాలను చూసిన తెలుగు దర్శకులు ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

No comments:

Post a Comment