Showing posts with label tollywood gossips. Show all posts
Showing posts with label tollywood gossips. Show all posts

Wednesday, 15 May 2013

Iddarammayailatho Movie Postponed Again

Iddarammayailatho Movie Release Again Postponed

Iddarammayailatho movie release again postponed.png

   ప్రముక దర్శకుడు పూరీ జగన్నాథ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో ’. ఈ సినిమా ఇప్పుడు వాయిద పడిందనే వార్తలు వస్తున్నాయి ఫిలింనగర్ నుండి. మొదట ఈ చిత్రాన్ని మే 9 విడుదల చేస్తారని ప్రకటించారు. తరువాత దాన్ని మే 24 కి వాయిదా వేశారు. ఇప్పుడు దానినే మే 31 ఇద్దరమ్మాయిలతో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. 

ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకొని పొస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా వర్క్ కంప్లీట్ కాకపోవడమే వాయిదాకు కారణంగా చెబుతున్నారు. వ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 

సినీ జనాలు మాత్రం ఈ సినిమా వాయిదా పై వేరేగా అనుకుంటున్నారు. మే 23న విడుదల చేస్తే ఐపీఎల్ కారణంగా కలెక్షన్లు తగ్గుతాయని, ఇప్పటికే బాద్ షా వంటి సినిమా కలెక్షన్లలో వీక్ అయిందని భావించిన నిర్మాత బండ్లగణేష్ దీనిని 31కి వాయిదా వేసాడని అంటున్నారు. మరి అప్పుడైనా విడుదల అవుతుందో లేదో చూడాలి.

Tuesday, 23 April 2013

Mohanbabu Satire On Mega Family



బాబు గారి సెటైర్లు ఎవరి మీదనో

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడుతాడనే పేరుంది. ఎలాంటి వేదికైనా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకొని పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. అవి ఎవర్ని ఉద్దేశించి అంటాడనే విషయం ప్రక్కన పెడితే.... తాజాగా ఆయన టీఎస్సార్  అవార్డుల ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలొకి వచ్చే యువ హీరోలు ఒక్క సినిమా హిట్టు అయితే చాలు. వారు సీఎం అయినంతగా ఫీలవుతున్నారని, అది సాంప్రదాయం కాదని ఆయన అన్నారు. సినీ ప్రస్థానం ప్రారంభించింది ఇప్పుడే అని, అందులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, విజయాల్ని, పరాజయాల్ని రెండింటిని సమానంగా స్వీకరించినప్పుడే హీరోగా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంచి సినీ స్టార్ల కుటుంబం నుండి వెండితెరకు వస్తున్నారు. మరి ఎవర్ని ఉద్దేశించి అన్నాడో అన్నదాని పై చర్చ జరుగుతుంది.



ఆ చర్చలు సాగుతుండగానే ఈ రోజు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ రాజకీయాలలోకి వస్తానని, అయితే ఏ పార్టీలో తాను చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని, ఆ పార్టీ పెట్టి సంపాదించుకునే ధైర్యం కాని లేవని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. తనకు పదవులపై ఆసక్తి లేదనీ, తాను రాజకీయాల్లోకి వస్తే పదవులు ఆశించనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూస్తానని అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది. అయితే కొందరు మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అన్నాడని,  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై మోహన్ బాబు సెటైర్ వేసి ఉంటారని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు కు, చిరంజీవి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మళ్లీ ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

Tuesday, 2 April 2013

Actress Archana As Call Girl


Movie news

archana

ఈ మధ్యన కథానాయికలు అవకాశాల కోసం ఏ పాత్రలు అయినా చేయడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగు వెలిగిన ఛార్మి, శ్రేయ వంటి వాళ్ళు వేశ్య పాత్రల్లో నటించారు. వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ పయణిస్తుంది. వేదగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయి, అర్చనగా వెండితెర అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న త్వరలో అర్చన కూడా వేశ్యగా మారబోతుంది. ఇప్పటికే శ్రీయ నటించి పవిత్ర సినిమా ట్రైలర్లకు, ఛార్మి నటించిన ‘ప్రేమ ఓ మైకం ’ సినిమా ట్రైలర్లకు మంచి రెప్పాన్స్ రావడంతో ఇదే తరహా కాన్సెప్ట్ తో మరో చిత్రం తీయడానికి జాతీయ స్టాయిలో పేరు సంపాదించుకున్న ‘1940 లో ఓ గ్రామం ’ సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహ నంది ఈ సినిమా చేయబోతున్నాడు.



ఇందులో అర్చనను వేశ్య పాత్రకు ఎంపిక చేశారు. శివాజీ హీరోగా నటించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మరి ఈ వేశ్య పాత్ర ద్వారా అయిన అర్చనకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.