ఈ మధ్యన కథానాయికలు అవకాశాల కోసం ఏ
పాత్రలు అయినా చేయడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లుగా ఓ
వెలుగు వెలుగు వెలిగిన ఛార్మి, శ్రేయ వంటి వాళ్ళు వేశ్య పాత్రల్లో
నటించారు. వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ పయణిస్తుంది. వేదగా తెలుగు
ప్రేక్షకులకు సుపరిచితం అయి, అర్చనగా వెండితెర అడపాదడపా సినిమాల్లో
నటిస్తున్న త్వరలో అర్చన కూడా వేశ్యగా మారబోతుంది. ఇప్పటికే శ్రీయ నటించి
పవిత్ర సినిమా ట్రైలర్లకు, ఛార్మి నటించిన ‘ప్రేమ ఓ మైకం ’ సినిమా
ట్రైలర్లకు మంచి రెప్పాన్స్ రావడంతో ఇదే తరహా కాన్సెప్ట్ తో మరో చిత్రం
తీయడానికి జాతీయ స్టాయిలో పేరు సంపాదించుకున్న ‘1940 లో ఓ గ్రామం ’
సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహ నంది ఈ సినిమా చేయబోతున్నాడు.
ఇందులో
అర్చనను వేశ్య పాత్రకు ఎంపిక చేశారు. శివాజీ హీరోగా నటించే ఈ సినిమా త్వరలో
సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మరి ఈ వేశ్య పాత్ర ద్వారా అయిన అర్చనకు
అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
No comments:
Post a Comment