Showing posts with label ramcharan nayak. Show all posts
Showing posts with label ramcharan nayak. Show all posts

Friday, 18 January 2013

Nayak SVSC Movies Halchal

nayake

       సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రావటం మామూలే. అయితే వీటికి తోడుగా ఏవో కొన్ని చిన్నసినిమాలుకూడా పెద్దపండుగకు సందడిచేస్తాయి. అయితే ఈ దఫా పండుగవేళ చిన్న సినిమాలు తమ ఉనికిని కోల్పోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘నాయక్’,  విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా వచ్చిన ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ ఈ రెండు మూవీలే ‘నాయక్’, ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రెండో వారంలోకూడా ఈ సినిమాలకు జోరుకి బ్రేకులు వేయలేమనే ఉద్దేశంతో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద తెలుగు సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కావున ఈ వారంకూడా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హవాని కొనసాగించనున్నాయి. ఈ సినిమాలకున్న క్రౌడ్స్ ఇలాగే కొనసాగితే ఈ వారం కూడా రికార్డ్ స్థాయిలోనే కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
     ఇదిలా ఉంటే, ఈ రెండు చిత్రాలే రాష్ట్రంలోని థియేటర్లను శాసిస్తున్నాయని, దీనికి కారణం ఇండిస్టీలో ''ఆ నలుగురు'' అని కొందరు చిన్న నిర్మాతలు గుర్రుగాఉన్నారు. సంక్రాంతి కానుక అంటూ పండుగకుముందే విడుదలైన చిత్రాలు నాయక్‌, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు.. ఈ రెండు చిత్రాలు రాష్ట్రంలో వున్న థియేటర్లన్నిం టినీ ఆక్యుపై చేశాయి. ఎక్కడ ఏ చిన్న ఊరు వున్నా అక్కడ ఈ రెండు చిత్రాలే నడుస్తున్నాయి. దీనికితోడు ప్రతి థియేటర్ల లోనూ మేనేజర్ల హవా నడుస్తోంది.
sss
        తెలంగాణా, ఆంధ్ర లోని మారుమూల ప్రాంతాల్లోని థియేటర్లలో కెపాసిటీకి మించి టిక్కెట్లు ఇవ్వడం, సెపరేట్‌ కుర్చీలు వేయడం జరిగింది. కోదాడలోని ఓ థియేటర్‌లో థియేటర్‌కు మించి జనాలున్నా... హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్ట కుండా హాలు నింపేశాడు. ప్రత్యేకంగా కుర్చీలువేసి మరీ చూపించే ఏర్పాట్లు చేశారు. కొందరైతే ఇదేమని అడిగితే.. చూస్తే చూడండి.. లేదంటే లేదు.. ఇక్కడ ఇలాగే వుంటుందని చెప్పడం విశేషం.దీంతో తమకు రావాల్సిన ఆదాయం కూడా గండికొట్టేశారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు.
        శ్రీకాంత్‌ చిత్రం సేవకుడు వారంముందు రిలీజ్‌ అయినా ఆ రెండు చిత్రాలు విడులకావడంతో అన్నిచోట్ల ఎత్తేశారు. ఏదో మారుమూల థియేటర్లలో ఒకటి అర థియేటర్లలో మాత్రమే సేవకుడు, కొన్ని చిన్న చిత్రాలు ఆడుతున్నాయి. మిగిలిన హీరోల చిత్రాలు విడులకు సిద్ధంగా వున్నా... థియేటర్లు లేక వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఫిలింఛాంబర్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
...avnk

Saturday, 12 January 2013

Charan Naayak Movie Record Collections


 



 
Nayak-Movie-Latest-Wallpapers-
     
    మొన్న అంటే జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్ కలెక్షన్ల పరంగా కొత్తపుంతలు తొక్కుతోంది. రిలీజ్ నాడే బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రెండు రోజుల  వసూళ్లు చూస్తుంటే, టాలీవుడ్ పాత రికార్డులు తిరిగిరాస్తుందేమో అనిపిస్తుంది. తెలుగువిశేష్.కాం కు అందిన విశ్వసనీయ, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ‘నాయక్’ చిత్రం సాధించిన కేవలం ఆంధ్రప్రదేశ్ షేర్  12,72 కోట్లు.
నాయక్ రెండు రోజుల వసూళ్లు ప్రాంతాల వారీగా :

నైజాం ఏరియా  – రూ. 4.35 కోట్లు
సీడెడ్ - రూ. 2,46 కోట్ల
పశ్చిమ గోదావరి  - రూ. 94 లక్షలు
తూర్పు గోదావరి  - రూ. 1.01 కోట్లు
వైజాగ్- రూ. 1.23 కోట్లు
గుంటూరు- రూ. 1.46 కోట్లు
కృష్ణ - రూ. 72 లక్షలు
నెల్లూరు - రూ. 55 లక్షలు
ఆంధ్రప్రదేశ్ లో రెండురోజుల కలెక్షన్ల మొత్తం  : రూ.  12. 72 కోట్లు
...avnk

Wednesday, 9 January 2013

Naayak Movie Punch Dialogues

 

Naayak_9
Naayaks99
     
Naayak_999
       
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్, అమలా పాల్ ముఖ్యతారాగణంగా సుప్రసిద్ధ దర్శకుడు వివి వినాయక్ చేసిన మాస్ మషాలా ఎంటర్ టైనర్ నాయక్ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు ప్రతీ థియేటర్నీ భారీ కటౌట్లు పూల మాలలతో అలంకరించారు. మూవీ విడుదలైన ప్రతీ థియేటర్ వద్దా ఈ తెల్లవారుఝామునుంచే కోలాహల వాతావరణం కనిపిస్తుంది. తమ అభిమాన హీరో చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ బారులు తీరారు.
      అనుకున్నట్టుగానే నాయక్ సినిమా ప్రతీ సెంటర్ లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్ని ఊర్లు, పట్టణాలు, నగరాల్లో అభిమానగణం సంబరాలు చేసుకుంటున్నారు.
నా జోలికొస్తే ఓకే, కాని నావాళ్ల జోలికొస్తే చంపేస్తా..
పవర్ స్టార్ ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్ ఎవడికైనా దొరుకుతుందా..
ఫామ్ లో ఉన్న లీడర్, ఫాలోయింగ్ ఉన్న హీరోని ఫాలో కావాలి.
హాఫ్ డేలో అంబానీని దాటిస్తా..
నేనేదైనా ఒకేసారి చెప్తా..
కరెంట్ షాక్ కొట్టిందని, ట్రాన్స్ ఫార్మర్ తో పెట్టుకుంటామా సార్..
నిప్పు అని తెలిసాక పట్టుకోకూడదు వెధవని తెలిసాక పెట్టుకోకూడదు.
లివర్ పాడైతే అప్పుచేసి అపోలో హాస్పిటల్ లో మార్పించుకుంటా, కానీ లవర్ పోతే..
మీడియా పబ్లిక్ కోసం పనిచేయాలికాని, పబ్లిసిటీ కోసం కాదు.
వాడు ఆదారిలో వరి పండించే రకం.

      ‘నాయక్’ సినిమా రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : http://www.teluguwishesh.com/teluguhome/200-movie-reviews/41343-ram-charan-naayak--naayak-review--naayak-movie-review--naayak-rating.html

 

Friday, 4 January 2013

Nayak Movie Theaters List

Nayak-Movie-Latest-Posters-1846
           
    మోగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, కాజల్‌ అగర్వాల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్‌గా కమర్షియల్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ నిర్మాతగా యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై అత్యంత భారీగా రూపొందుతున్న చిత్రం 'నాయక్‌'. నిన్ననే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఇక కేవలం 4రోజులే విడుదల తేదీ కావటంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రవర్గం సన్నాహాల్లో మునిగిఉంది.  జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా థియేటర్స్‌ లో నాయక్‌ విడుదల కానుంది. కొద్దిసేపటిక్రితం ఈ చిత్రం ట్విన్ సిటీస్ లో ఏఏ థియేటర్లలో విడుదలవుతుందో వెల్లడించే జాబితాను విడుదల చేశారు. ఇక్కడ కనిపిస్తున్న థియేటర్స్ లిస్ట్ అదే.. మల్టీ స్టారర్ మూవీ సీవాసిచె కంటే భారీగా విడుదలవుతోన్న ఈ చిత్రం తీరు చూస్తుంటే రిలీజ్ రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టే యోచన కనిపిస్తుంది. 
 
           ఇదిలా ఉండగా ‘నాయక్’ మూవీ  ఓవర్సీస్ లో కూడా  రికార్డ్ స్థాయిలో విడుదల కానుంది.  యు ఎస్ లో కూడా రికార్డ్ స్థాయిలో విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని అక్కడ 100 స్క్రీన్స్ లో విడుదల చెయ్యాలన్న యోచనలో ఉన్నారు. ఒక తెలుగు చిత్రం ఈ స్థాయిలో విడుదల అవుతూ ఉండటం ఇదే మొదటి సారి. ఈ చిత్ర ప్రింట్లు రేపు ఇక్కడనుండి బయలుదేరుతాయి. జనవరి 8న అక్కడ ప్రేమియర్లు ప్రదర్శిస్తారు.

         కాగా, నిన్న సెన్సార్‌ సభ్యుల నుండి ఎక్సార్డనరీ రిపోర్టు రావటంతో నిర్మాత దానయ్య అతని టీం సభ్యులు మాంచి ఖుషీ మీదున్నారు. అంతేకాదు  సంక్రాంతికి ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రం అని సెన్సారు సభ్యులు చెప్పటం ఆనందంగా వుందని. ఈ చిత్రం మెగా అభిమానులకి ఐదు రోజుల ముందే పండగ వాతావరణాన్ని కల్పిస్తుందని నిర్మాత అంటున్నారు.

nayak1        
         చరణ్ ఫెర్ఫామెన్స్,  వినాయక్‌ టేకింగ్‌, థమన్‌ సంగీతం, ఆకుల శివ, కథ, మాటలు. కాజల్‌, అమలాపాల్‌ల అందమైన అభినయాలు, పోసానికామెడీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు.

కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.
         ఇక,  తాజాగా అందిన వివరాల ప్రకారం తొలి రోజు ఏయే ఏరియాల్లో ‘నాయక్' చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో థియేటర్ల సంఖ్య ప్లస్  ఏరియాల వారిగా  :
 నైజాం : 320+
సీడెడ్ : 140+
నెల్లూరు : 45+
గుంటూరు : 90+
కృష్ణా : 85+
వెస్ట్ గోదావరి : 85+
ఈస్ట్ గోదావరి : 95+
ఉత్తరాంధ్ర : 105+
కర్నాటక : 125+
తమిళనాడు : 45(చెన్నై-24, కోయంబత్తూర్-02, మధురై-01, తంజావూరు-01,తిరువల్లూరు-06, ఇతర ప్రాంతలు-10+)
రెస్టాఫ్ ఇండియా : 40 ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్ల సంఖ్య దాదాపు గా 1200    
         
          ఇదే కాకుండా ఈ సారి యూఎస్‌తో పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయి స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా, ఈ సంక్రాంతికి రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న ‘నాయక్' చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానగణం సంబరపడిపోతున్నారు.
...avnk

Nayak Movie Sensor Report

Naayak-Movie-Latestew
       
        మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  మాస్ లీడర్ గా కనిపించబోతోన్న మూవీ ‘నాయక్’ ఇంకో ఐదురోజుల్లో వెండితెరలపై అలజడి రేపనుంది.  సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కొంచెం సేపటి క్రితం ‘ఎ’ సర్టిఫికేట్ ప్రజంట్ చేసింది. మనకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా లో పోసాని కామెడీ కేక పుట్టింస్తుందని తెలుస్తోంది. సెంకండాఫ్ లో 45 నిమిషాలపాటు వినాయక్ టేకింగ్ అద్భుతమట. రామ్ చరణ్ నటన ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అరిపించాడంటున్నారు. సెన్సార్ సభ్యులు కూడా చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేసినట్టు వినికిడి. 
      
        ఈ పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ – అమలా పాల్ జోడీ కట్టారు.  వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించాడు. ఎస్.ఎస్ తమన్ సంగీతం. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారి ఈ మూవీ ద్వారా చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు.
...avnk

Monday, 26 November 2012

Nayak Movie First Look

nayak_first_look      
రామ్ చరణ్ హీరోగా వినాయక్ తెరకెక్కిస్తోన్న 'నాయక్ ' సినిమా ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం వెలువడింది. తొలి పోస్టర్ బయటకు వచ్చింది మొదలు నాయక్ సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాడు. ద లీడర్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది.

        కాగా, ఈ సినిమాను జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ మూవీ గురించి ఏమంటున్నారంటే.. తాము అనుకున్న ప్రకారం ఈ సినిమా నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తూ వస్తున్నామని చెప్పారు.

nayak_english
     
విభిన్నమైన పాత్రలో చరణ్ నటించిన తీరు ... దర్శకుడిగా వినాయక్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఇక కాజల్ ... అమలాపాల్ అందచందాలు, వాళ్ల పాత్రలను మలచిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని చెప్పారు.

         తమన్ సంగీతాన్ని సమకూర్చుకున్న  'నాయక్ ' సినిమా డిసెంబరు రెండవ వారంలో ఆడియోను ... సంక్రాంతి కానుకగా జనవరి 9 న సినిమాను విడుదల చేయబోతున్నారు.

...avnk