మోగాపవర్‌స్టార్ రామ్‌చరణ్
హీరోగా, కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్‌గా కమర్షియల్ దర్శకుడు
వి.వి.వినాయక్ నిర్మాతగా యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై అత్యంత భారీగా
రూపొందుతున్న చిత్రం 'నాయక్'. నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఇక కేవలం 4రోజులే విడుదల తేదీ కావటంతో భారీ
ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రవర్గం సన్నాహాల్లో మునిగిఉంది.
జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా థియేటర్స్ లో నాయక్ విడుదల కానుంది. కొద్దిసేపటిక్రితం ఈ చిత్రం ట్విన్ సిటీస్ లో ఏఏ
థియేటర్లలో విడుదలవుతుందో వెల్లడించే జాబితాను విడుదల చేశారు. ఇక్కడ
కనిపిస్తున్న థియేటర్స్ లిస్ట్ అదే.. మల్టీ స్టారర్ మూవీ సీవాసిచె కంటే
భారీగా విడుదలవుతోన్న ఈ చిత్రం తీరు చూస్తుంటే రిలీజ్ రోజే రికార్డ్
స్థాయిలో కలెక్షన్లు రాబట్టే యోచన కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ‘నాయక్’ మూవీ
ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయిలో విడుదల కానుంది. యు ఎస్ లో కూడా
రికార్డ్ స్థాయిలో విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని అక్కడ 100
స్క్రీన్స్ లో విడుదల చెయ్యాలన్న యోచనలో ఉన్నారు. ఒక తెలుగు చిత్రం ఈ
స్థాయిలో విడుదల అవుతూ ఉండటం ఇదే మొదటి సారి. ఈ చిత్ర ప్రింట్లు రేపు
ఇక్కడనుండి బయలుదేరుతాయి. జనవరి 8న అక్కడ ప్రేమియర్లు ప్రదర్శిస్తారు.
కాగా, నిన్న సెన్సార్ సభ్యుల నుండి ఎక్సార్డనరీ రిపోర్టు రావటంతో నిర్మాత దానయ్య అతని టీం సభ్యులు మాంచి ఖుషీ మీదున్నారు. అంతేకాదు సంక్రాంతికి ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్ చిత్రం అని సెన్సారు సభ్యులు చెప్పటం ఆనందంగా వుందని. ఈ చిత్రం మెగా అభిమానులకి ఐదు రోజుల ముందే పండగ వాతావరణాన్ని కల్పిస్తుందని నిర్మాత అంటున్నారు.
చరణ్ ఫెర్ఫామెన్స్, వినాయక్ టేకింగ్, థమన్ సంగీతం, ఆకుల శివ, కథ, మాటలు. కాజల్, అమలాపాల్‌ల అందమైన అభినయాలు, పోసానికామెడీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు.
కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.
ఇక, తాజాగా అందిన వివరాల ప్రకారం తొలి రోజు ఏయే ఏరియాల్లో ‘నాయక్' చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో థియేటర్ల సంఖ్య ప్లస్ ఏరియాల వారిగా :
నైజాం : 320+
సీడెడ్ : 140+
నెల్లూరు : 45+
గుంటూరు : 90+
కృష్ణా : 85+
వెస్ట్ గోదావరి : 85+
ఈస్ట్ గోదావరి : 95+
ఉత్తరాంధ్ర : 105+
కర్నాటక : 125+
తమిళనాడు : 45(చెన్నై-24, కోయంబత్తూర్-02, మధురై-01, తంజావూరు-01,తిరువల్లూరు-06, ఇతర ప్రాంతలు-10+)
రెస్టాఫ్ ఇండియా : 40 ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్ల సంఖ్య దాదాపు గా 1200
ఇదే కాకుండా ఈ సారి యూఎస్‌తో
పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయి స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు
ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా, ఈ సంక్రాంతికి రామ్ చరణ్-వివి వినాయక్
కాంబినేషన్లో వస్తున్న ‘నాయక్' చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం
అని అభిమానగణం సంబరపడిపోతున్నారు.
...avnk
No comments:
Post a Comment