Tuesday, 23 April 2013

Mohanbabu Satire On Mega Family



బాబు గారి సెటైర్లు ఎవరి మీదనో

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడుతాడనే పేరుంది. ఎలాంటి వేదికైనా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకొని పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. అవి ఎవర్ని ఉద్దేశించి అంటాడనే విషయం ప్రక్కన పెడితే.... తాజాగా ఆయన టీఎస్సార్  అవార్డుల ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలొకి వచ్చే యువ హీరోలు ఒక్క సినిమా హిట్టు అయితే చాలు. వారు సీఎం అయినంతగా ఫీలవుతున్నారని, అది సాంప్రదాయం కాదని ఆయన అన్నారు. సినీ ప్రస్థానం ప్రారంభించింది ఇప్పుడే అని, అందులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, విజయాల్ని, పరాజయాల్ని రెండింటిని సమానంగా స్వీకరించినప్పుడే హీరోగా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంచి సినీ స్టార్ల కుటుంబం నుండి వెండితెరకు వస్తున్నారు. మరి ఎవర్ని ఉద్దేశించి అన్నాడో అన్నదాని పై చర్చ జరుగుతుంది.



ఆ చర్చలు సాగుతుండగానే ఈ రోజు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ రాజకీయాలలోకి వస్తానని, అయితే ఏ పార్టీలో తాను చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని, ఆ పార్టీ పెట్టి సంపాదించుకునే ధైర్యం కాని లేవని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. తనకు పదవులపై ఆసక్తి లేదనీ, తాను రాజకీయాల్లోకి వస్తే పదవులు ఆశించనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూస్తానని అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది. అయితే కొందరు మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అన్నాడని,  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై మోహన్ బాబు సెటైర్ వేసి ఉంటారని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు కు, చిరంజీవి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మళ్లీ ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

No comments:

Post a Comment