Showing posts with label Power Star. Show all posts
Showing posts with label Power Star. Show all posts

Wednesday, 10 April 2013

Pawan Kalyan Sampath Nandi Mass Movie



త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాంచి మాస్ మసాల చిత్రంతో రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అప్పట్లో సంపత్ నంది స్టోరీకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని పవన్ రమ్మన్నాడు. ఇన్ని రోజులు దీని పై పూర్తి వర్క్ చేసిన సంపత్ నంది పూర్తి మాస్ మసాలా స్టోరిగా మలిచి పవన్ కి వినిపించాడట. 

ఈ స్టోరీ విన్న పవన్ ఓకే చేశాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాని మే రెండో వారం నుండే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. . త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన డైలాగులు, మాస్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మాస్ హీరోగా అలరించడం ఖాయం అంటున్నారు.

Tuesday, 19 February 2013

Pawan Krish Combo To Fight For a Legal Cause





pawan-krish

  టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. అందరి హీరోలలో ఈయన శైలి ప్రత్యేకం. ఈయన సినిమా వచ్చిందంటే ఆయన ఫ్యాన్స్ చేసే గోల అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కి ఉందని చెప్పవచ్చు. ఇక నటన విషయానికి వస్తే పవన్ అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించగలడు. ఇక భావోద్వేగ పూరిత పాత్రలను చేయడంతో ఆయనకు ఆయనే సాటి. దాంతో పాటు వినోదాన్ని కూడా సూపర్ గా పండిస్తాడు. జల్సా సినిమాలో పవన్ కామిడీ పాత్ర ఎంత రక్తికట్టించాడో మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించనున్నాడని సమాచారం. గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్ లాంటి ఢిఫరెంట్ సినిమాలు తీసి, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఢిఫరెంటుగా, కామిడీగా ఉండబోతుందని సమాచారం. విశేషం ఏంటంటే.... పవన్ ఇందులో ప్లీడర్ (లాయర్) గా కనిపించనున్నాడట. మరీ ప్లీడర్ పాత్రలో పవన్ ఏమేరకు అలరిస్తాడో చూడాలి.