టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే
వేరు. అందరి హీరోలలో ఈయన శైలి ప్రత్యేకం. ఈయన సినిమా వచ్చిందంటే ఆయన
ఫ్యాన్స్ చేసే గోల అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఏ
హీరోకి లేనంత క్రేజ్ పవన్ కి ఉందని చెప్పవచ్చు. ఇక నటన విషయానికి వస్తే
పవన్ అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించగలడు. ఇక భావోద్వేగ పూరిత పాత్రలను
చేయడంతో ఆయనకు ఆయనే సాటి. దాంతో పాటు వినోదాన్ని కూడా సూపర్ గా
పండిస్తాడు. జల్సా సినిమాలో పవన్ కామిడీ పాత్ర ఎంత రక్తికట్టించాడో మనకు
తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించనున్నాడని
సమాచారం. గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్ లాంటి ఢిఫరెంట్ సినిమాలు
తీసి, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా
చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఢిఫరెంటుగా, కామిడీగా
ఉండబోతుందని సమాచారం. విశేషం ఏంటంటే.... పవన్ ఇందులో ప్లీడర్ (లాయర్) గా
కనిపించనున్నాడట. మరీ ప్లీడర్ పాత్రలో పవన్ ఏమేరకు అలరిస్తాడో చూడాలి.
No comments:
Post a Comment