త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాంచి మాస్ మసాల చిత్రంతో రాబోతున్నారని
సమాచారం. ఇప్పటికే ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా
చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అప్పట్లో సంపత్ నంది స్టోరీకి కొన్ని
మార్పులు చేర్పులు చేసుకొని పవన్ రమ్మన్నాడు. ఇన్ని రోజులు దీని పై పూర్తి
వర్క్ చేసిన సంపత్ నంది పూర్తి మాస్ మసాలా స్టోరిగా మలిచి పవన్ కి
వినిపించాడట.
ఈ స్టోరీ విన్న పవన్ ఓకే చేశాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన
గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాని మే రెండో వారం నుండే సెట్స్ పైకి
తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు
శరత్ మరార్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. . త్వరలోనే ఈ చిత్రానికి
సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్
కి కావాల్సిన డైలాగులు, మాస్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా పవన్
మాస్ హీరోగా అలరించడం ఖాయం అంటున్నారు.
No comments:
Post a Comment