Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

Tuesday, 14 May 2013

Eega Be Screened At Cannes

Telugu Film Eega Be Screened At Cannes


కేన్స్ ఫెస్టివెల్ కి ‘ఈగ ’


eega be screened at cannes.png

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు విజువల్ ఎఫెక్టు విభాగంలో పలు అవార్డులు దక్కించుకుంది. దీంతో ఆగకుండా ఎగురుకుంటూ పోయి అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈగ సినిమా కూడా వాలనుంది. ఈ చిత్రాన్ని త్వరలో జరగబోయే కేన్స్ లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈగ ’ చిత్రంతో పాటు, ‘బహుబలి ’ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కేన్స్ ప్రదర్శించబోతున్నాం అని తెలిపాడు. ఒక తెలుగు సినిమా తొలిసారిగా కేన్స్ కు వెళ్లబోతుంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

Wednesday, 10 April 2013

Pawan Kalyan Sampath Nandi Mass Movie



త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాంచి మాస్ మసాల చిత్రంతో రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అప్పట్లో సంపత్ నంది స్టోరీకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని పవన్ రమ్మన్నాడు. ఇన్ని రోజులు దీని పై పూర్తి వర్క్ చేసిన సంపత్ నంది పూర్తి మాస్ మసాలా స్టోరిగా మలిచి పవన్ కి వినిపించాడట. 

ఈ స్టోరీ విన్న పవన్ ఓకే చేశాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాని మే రెండో వారం నుండే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. . త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన డైలాగులు, మాస్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మాస్ హీరోగా అలరించడం ఖాయం అంటున్నారు.

Wednesday, 3 April 2013

Mahesh Sukumar Film Karnataka Rights Get Huge Price


Movie news
mashesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాకుండా పలు బాషల్లో క్రేజ్ ఉంది. ఈయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. ఈయన తాజాగా  ప్రేమ కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తికాక ముందే ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్లు బేరాలు మొదలు పెట్టారు. 

తాజాగా ఈసినిమా కర్ణాటక హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం. మనకు అందిన సమాచారం ప్రకారం నాలుగున్నర కోట్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. బిఎన్‌ ఆర్‌ ఫిల్మ్‌‌ ఈ రైట్స్‌ని సొంతం చేసుకుంది. గతంలో వీరే ‘దూకుడు ’ ని కర్ణాటకలో విడుదల చేసారు. ఆ సినిమా మంచి వసూళ్ళు సాధించడంతో మళ్లీ వారే భరీ రేటుకు సొంతం చేసుకున్నారు. ‘దూకుడు ’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సినీ విశ్లేషకులు మాత్రం కర్ణాటక రైట్స్ అంతకు అమ్ముడైతే తెలుగు రైట్స్ భారీ రేటుకు అమ్ముడవ్వడం ఖాయం అంటున్నారు.

Rey Climax Song Shot With 1.50 Crores

Rey climax song

మెగాస్ట్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేయ్‌’. ‘షౌట్‌ ఫర్‌ సక్సెస్‌’ అనేది ఉపశీర్షిక. సయామీ ఖేర్‌ కథానాయిక. మరో కీలకపాత్రలో శ్రద్ధాదాస్‌ నటిస్తున్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవిఎస్‌ చౌదరి స్వీయ నిర్మాణదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం కోటిన్నర ఖర్చుతో 8నిమిషాల క్లైమాక్స్‌ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీసెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్క్ష్రిత్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వైవీయస్‌ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా క్లైమాక్స్‌లో ఎలాంటి భారీ పోరాటాలు ఉండవు. ఆ స్థానే భావోద్వేగాలు నిండిన భారీ పాటను డిజైన్‌ చేశాం. అమెరికాలోని టాప్‌ పాప్‌స్టార్స్‌ మధ్య పోటీ నేపథ్యంలో పాట వస్తుంది. ఇందులో హీరో బ్యాచ్‌ ఎలా విజయం సాధిం చిందన్నది ఆసక్తికరం. 2007లో అమెరికా లాస్‌ వెగాస్‌లో నేను చూసిన ఓ లైవ్‌షో నుంచి ఇన్‌సై్పర్‌ అయి ఈ పాటను డిజైన్‌ చేశాను ’’ లిపారు.

Friday, 1 February 2013

Salman Khan May Face 10 Years Jail


hit-and-run-case

  సల్మాన్ ఖాన్ ఒక మంచి మనస్సున్న వ్యక్తిగా బాలీవుడ్ లో చెప్పుకుంటారు. అలాంటి సల్మాన్ ఖాన్ కి కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. గతంలో జింకలను వేటాడిన కేసులో కష్టాలు ఎదుర్కొన్న ఈయన 2002 స్పీడ్ గా కారు నడిపి ఒక మరణానికి, నలుగురు క్షతగాత్రులు అవ్వడానికి కారణమై ఈయన కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సెక్షన్ 304(1)(నిర్లక్ష్యపు డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న దీనిపై , ఈ కేసు విషయంలో,  భారతీయ శిక్షాస్మృతిలోని 304(2) కింద విచారణ జరిగేలా చూడాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్థానిక మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. కేసును తీవ్రంగా పరిగణిస్తూ ఈనెల 11న సెషన్స్‌ కోర్టు ముందు హాజరుకావాలంటూ సల్మాన్ ఖాన్ను ఆదేశించింది. ఈ సెక్షన్‌ కింద హత్యతో సమానం కాని శిక్షార్హ నరహత్య అభియోగాలతో విచారిస్తారు. దీనికింద దోషిగా తేలితే గరిష్ఠంగా పదేళ్ల శిక్ష పడుతుంది. ఏది ఏమైనా సల్మాన్ కి కష్టాలు మాత్రం వీడటం లేదు.