Tuesday, 12 March 2013

Stars Daughters In Film Industry


akhil-srutihasan

సినీ పరిశ్రమ లో నిన్న మొన్నటి వరకు నట వారసులాడే పై చేయి గా ఉండేది ... ఇప్పుడు కుడా ఇదే పరిస్తితి ఉన్నా కేవలం వారసులే కాక నట వారసురాళ్ళు కూడా తమ తల్లి - తండ్రులు చూబించిన బాటలో నడుస్తూ, తమదైన మార్కు లో విజయాలు సాధిస్తున్నారు ... ఇందుకు చక్కని నిదర్సనం విలక్షణ నటుడు కమల్ హస్సన్ గారాల పట్టి  హస్సన్ ... నటిగానే కాక, గాయనిగా కూడా తనని తాను నిరూపించుకున్న శ్రుతి హాస్సన్, ఇప్పుడు -తెలుగు  హిందీ చిత్ర పరిశ్రమల్లో బిజీ హీరోయిన్ ... అక్క బాటలోనే శ్రుతి చెల్లెలు అక్షర కూడా ... అయితే తెర వెనుక అద్భుతాలు సృష్టించడంలో ప్రస్తుతం అక్షర దృష్టి పెడుతోంది ... కాని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ హీరో గా తెరంగేట్రం చేస్తాడు  చిత్రం లో అఖిల్ హీరో గా అక్షరాని కధానాయికగా పరిచయం  చెయ్యాలని దర్శక - నిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నట్లు సమాచారం

karthika-tulasi

ఇక ఇప్పటికే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ  కూతుళ్ళు సినీ రంగ ప్రవేశం చెయ్యడం, అవకాశాల వేటలో పడటం జరిగిపోయింది ... ఇక మిగిలింది, సిల్వర్ స్క్రీన్ ని ఊపేసిన హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి  ... ఒక 15 ఏళ్ళు వయసు ఉన్న ఈ అమ్మడు చూడటానికి తన తల్లి పోలికలతో, మాంచి ఒద్దు పొడుగూ ఉండి ఇప్పుడే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ... 'మా అమ్మాయి ఇంకా చిన్నది' అని శ్రీ - బోనీ అంటున్నా ఇవుతల జాహ్నవి ని హీరోయిన్ గా మేము ముందు అంటే మేము ముందు పరిచయం చేస్తాం అని నిర్మాతలు తహ తహ లాడుతున్నట్లు సమాచారం ... ఇలా ఇంకా లక్ష్మి మంచు, సౌందర్య - ఐశ్వర్యా రజనీ కాంత్ లు, వారాసురాళ్ళ   తమ   నమోదు చేసుకున్నారు

Pawan Kalyan Song In Nitin Movie


pawan-nitin

హీరోలకు హీరోల మీద అభిమానం ఉండటం చాలా సహజం. కానీ వీరాభిమానం ఉండటం చాలా అరుదు. సాధారణ ప్రేక్షకులకు స్టార్స్ పై ఎంత అభిమానం ఉంటుందో, హీరో నితిన్ కి కూడా పవన్ కళ్యాణ్ అంటే అంతే పిచ్చి. ఈయన పై  ఉన్న అభిమానంలో గతంలో ఆడియో ఫంక్షన్ కి గెస్టుగా పిలిపించుకున్న నితిన్ ఈ సారి ఏకంగా ఆయన సినిమాలోని ఓ పాటనే అభిమానంతో రీమిక్స్ చేయించుకుంటున్నారు. నితిన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమా కోసం కల్యాణ్ హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా 'తొలిప్రేమ'లోని 'ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి..' పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్‌ని సీతారామశాస్త్రి రాయగా, దేవా బాణీలు కట్టారు.

ఇప్పుడు రీమిక్స్‌కి అనూప్ రూబెన్స్ స్వరాలు కూరుస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తున్న 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి విజయకుమార్ కొండా దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ పాట రీమిక్స్ తో పవన్ పై నితిన్ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడని అనుకుంటున్నారు.

Monday, 11 March 2013

Tollywood Top Heroines


tollywood top heroines

తెలుగు సినిమాలలో హీరోయిన్లు కరువయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు, విశ్లేషకులు... కాజల్, తమన్నా, తప్సీ, ఇలియానా, వంటి హీరోయిన్లు, ఇటు అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూ ఎక్కువశాతం బాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారు ... ఈ క్రమం లో తెలుగు సినిమా, హిందీ సినిమా చాన్స్ ఒకేసారి వస్తే, నిర్మొహమాటం గా, హిందీ చిత్రానికే ఓటు వేస్తున్నారు ... తెలుగు కన్నా, హిందీ చిత్ర పరిశ్రమ పెద్దది కావడం, హిందీ లో అవకాసం వస్తే చాలు అనుకునే హీరోయిన్లు పెరగడం ఈ మార్పు కి ప్రధాన కారణాలు ... అయితే, ఈ రోజు అగ్ర తారలు గా వెలుగుతూ తమ అదృష్టాన్ని హిందీ చిత్ర పరిశ్రమలో పరీక్షించుకుంటున్న అందాల తారలందరికీ తెలుగు చిత్ర పరిశ్రమే కావలసినంత గుర్తింపు ని, స్టార్ హీరోయిన్ హొదా ని తెచ్చిపెట్టింది ... కాజల్ తమ్మన్నా, ఇలియానా లను స్టార్ లని చేసిందే తెలుగు చిత్ర పరిశ్రమ అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ... 

కాని పొరుగింటి పుల్ల కూర రుచి అన్న చందం గా ఈ భామలు హిందీ కి తరలిపోయారు ... తెలుగు చిత్రం లో నటించాలంటే ఆకాశాన్ని అంటే పారితోషకం అడుగుతున్నారు ... ఇటువంటి సమయం లో అందం, అభినయం ఉన్న హీరోయిన్లను స్టార్ హీరోల దగ్గరి నుండి నూతన హీరోల పక్కన వరకు నటిమ్పచేయ్యడం, దర్శక - నిర్మాతలకు ఒక సవాల్ గానే మారింది ... 

ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడొస్తుందో, కొత్త భామలు ఎప్పుడు తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్లు గా ఎలా గుర్తింపు తెచ్చుకుంటారో, వేచి చూడాలి

Thursday, 7 March 2013

Nagarjuna Angry With Naga Chaitanya

Gossips

nagarjuna angry with naga chaitanya

ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోల కొడుకులు తమ తండ్రులను బాగా వాడుకుంటున్నారు. అంటే  మరొల అనుకోకండి?  మెగా స్టార్ చిరంజీవి తనయుడు  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ నటించిన సినిమాల్లో  తన తండ్రి నటించిన హిట్ సాంగ్స్  పెట్టుకోవటం జరుగుతుంది. ప్రతి సినిమాలో చిరంజీవి నటించిన సినిమా పాటను పెట్టుకొని విజయం సాధిస్తున్నారు.  రామ్ చరణ్  చిరంజీవి పాటలకే పరిమితం అయ్యాడు.  

టాలీవుడ్ మన్మథడు అయిన నాగార్జున  కొడుకు  నాగ చైతన్య మాత్రం తన తండ్రి నటించిన సినిమాను రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమా హల్ బ్రదర్  టాలీవుడ్ మంచి కలెక్షన్లు రాబట్టింది.  ఇప్పుడు నాగ చైతన్య హల్ బ్రదర్ సినిమాను  రీమేక్ చెయాటానికి  సిద్దమయ్యాడు. ఈ సినిమా హీరోయిన్ కూడా సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం. నాగ చైతన్య పక్కన మొదట నయన తార గానీ, అనుష్క గానీ అనుకున్నారట, కానీ నాగార్జున మాత్రం ఆ ఇద్దరుతో  వద్దని చెప్పినట్లు సమాచారం.   దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి .. ఆ ఇద్దరు అయితేనే సినిమా బాగుటుందని చెప్పటంతో.. నాగార్జున  కోపంతో  ఆవేశంగా ఆఇద్దరు నాగచైతన్యకు తల్లిలాంటి వారని ఆవేశంలో అసలు నిజం బయట పెట్టడంతో దర్శకుడు , నాగచైతన్య షాక్ తిన్నారని సమాచారం.  అయితే వెంటనే అక్కడనుండి లేచి వెళ్లిపోవటం జరిగిందని .. దర్శకుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

nagarjuna angry with naga chaitanya
  
 అయితే ఈ విషయం  అమలకు తెలుసో, లేదో అనే అనుమానం  అందరికి వస్తుందని ఫిలింనగర్లో పుక్లారు పుట్టాయి. అయితే  చివరకు నాగ చైతన్య పక్కన  కాజల్ ని ఎంపిక చేసినట్లు  టాలీవుడ్ సమాచారం.  తరువాత నాగార్జున  నాగ చైతన్య మద్య ఆ ఇద్దరు హీరోయిన్ల కోసం గొడవ పడినట్లు  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.  ఈ విషయాన్ని  నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పటంతో కొస్త గొడవ తగ్గిందట. అసల నేను నటించి సినిమా హల్ బ్రదర్ సినిమా రీమేక్ చేయవద్దు అని దర్శకుడికి ఫోన్ చేసి నాగార్జున చెప్పినట్లు  సమాచారం.  

నాగ చైతన్య తాత అయిన నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పి ఈ ఇద్దరు హీరోయిన్లు కోసం గొడవ పడకూడదు. హీరోయిన్లు మన కోసం కొట్టుకోవాలని ఆయన జీవితం జరిగిన రెండు మూడు ఉదాహరణ చెప్పి, శాంత పరిచినట్లు టాలీవుడ్ సమాచారం. చివరకు నాగచైతన్యనే తండ్రి మాటకు తగ్గి.. కొత్త హీరోయిన్లు తీసుకోవటం జరిగింది. అయితే నాగ చైతన్య కొంచెం బాధపడినట్లు తెలుస్తోంది. అంటే ఇక నయన తార, అనుష్కలతో తన సినిమాలు రావనే బాధలో ఉన్నట్లు ఫిలింనగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Tuesday, 5 March 2013

Sangeetha In Zee Telugu Bindaas Reality Show

Topnews
heroine sangeetha in zee telugu bindaas reality show

టాలీవుడ్  హీరోయిన్  సంగీత వెండి తెరపై  కన్పించింది  కొద్ది రోజులే అయిన .. కుర్రకారును మాత్రం తన చుట్టు తిప్పుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’లో ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసిన ముద్దుగుమ్మ సంగీత బుల్లితెరపై అడుగుపెడుతోంది. నవ్వుకి నవ్వు, డబ్బుకి డబ్బుని కలగలిపి ‘బిందాస్’ పేరుతో జీ తెలుగు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న గేమ్‌షోలలోనే విభిన్నతనీ, విలక్షణతనీ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘బిందాస్’ రూపొందిందనీ, ఈ కార్యక్రమంలో వెండితెర, బుల్లితెర నటీనటులు పాల్గొని ఆనందాన్ని పొందుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలకన్నా విభిన్నంగా ప్రతి రౌండు కేవలం ఒకే ఒక్క రూపాయితో మొదలై, రౌండు ముగిసేసరికి ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు గెలుపొందే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది.

heroine sangeetha in zee telugu bindaas reality show

ప్రతి ఎపిసోడ్‌లోనూ ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి మూడు జంటలుగా పాల్గొంటారు. సంగీత బిందాస్’ కార్యక్రమం అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ ఆద్యంతం వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్ర మం ప్రతి బుధవారం రాత్రి 9.30 గం.లకు ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.  అయితే  ఇప్పటికే  బుల్లి తెరపై  టాలీవుడ్ నటిమణులు చాలా మంది ఉన్నారు,  అందాల రాశి,  రోజా, ఖుష్బు,  ఆమని, రమ్యక్రిష్ణ, సిమ్రాన్, రవళి,  లాంటి హీరోయిన్లు  బుల్లి తెరపై వారి సత్తా ఏమిటో బుల్లితెర ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త  సంగీత ఏం చూపిస్తుందో చూడాలి?

Anushka Married To Hyderabad Businessman

Movie news
anushka

అందాల ముద్దుగుమ్మ అనుష్క టాలీవుడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. బొమ్మాళిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్వీటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆఫర్లు వస్తున్నా కేవలం రెండు ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేసిన అనుష్క ఈ రెండు ప్రాజెక్టుల తరువాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క హైదరాబాద్ కోడలు కాబోతుందని అంటున్నారు. 

పెళ్లి కొడుకు హైదరాబాద్ కి చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తతో జరగబోతుందని, ఇప్పటికే ఈ వియషం పై ఇరు వర్గాల పెద్దలు చర్చలు జరిపారని అంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు బాహాటంగా చెప్పకపోయినా అనుస్క సన్నిహితులు మాత్రం ఠాం ఠాం చేస్తున్నారట.  ఇప్పటికే స్వీటీకి పెళ్లి వయసు దాటేయడంతో ఇంట్లో వాళ్ళు తొందర పెట్టడం, అనుష్క కూడా  పెళ్లి చేసుకొని మద్దు ముచ్చట తీర్చుకోవాలని అనుకోవడంతో ఒప్పుకున్న సినిమాలు అయిపోయిన తరువాత మెడలో మూడుముళ్ళు వేయించుకుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అనుష్క హైదరాబాద్ కోడలుగా రావడం సంతోషించదగ్గ విషయమే.

Tamanna Wrong Step In Bollywood

Topnews
tamanna wrong step in bollywood

టాలీవుడ్  టూ కోలీవుడ్ లలో మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా.. అనుకోకుండా కాలుజారి తప్పటడుగు వేసింది. టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన  తమన్నా  ఇప్పుడు  ఆమె స్థాయి ఘోరంగా పడింది. టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు. సహ నటీమణులే కాదు, సహ నటుల నోట కూడా తమన్నా మాటే వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలతో లైమ్‌లైట్‌లో వుండగానే బాలీవుడ్‌పై మోజుతో అక్కడ అడుగుపెట్టి ఇక్కడి అవకాశాలను చేజేతులారా జారవిడుచుకుని తప్పటడుగు వేసిందని చెప్పుకుంటున్నారు. తమన్నాను తెలుగు, తమిళ పరిశ్రమలు ఎంతగానో ప్రోత్సహించి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టాయి. ఒక దశలో తిరుగులేని స్టార్‌ని చేశాయి. ఏ సినిమా విడుదలైనా తమన్నా వుండాల్సిందే. చిన్న హీరోలనుంచి స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాలు చేసిన తమన్నా చేతిలో ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమాయే వుంది. అది నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వెట్టై’ రీమేక్ ‘తడాఖా’. ఈ చిత్రం మినహా మరే చిత్రమూ ఆమె చేతిలో లేదు.

tamanna wrong step in bollywood

 బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న ‘హిమ్మత్‌వాలాతర్వాత మరో అవకాశం తమన్నాను తట్టింది. అక్షయ్‌కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రాన్ని రమేష్‌తారనీ నిర్మిస్తుండగా, సాజిద్-్ఫర్హాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో తమన్నా రేంజ్‌ని పెంచే చిత్రమవుతుందని అప్పుడు బాలీవుడ్ అంతా చెప్పుకుంటున్నారు. ‘హిమ్మత్ వాలా’ చిత్రంలో తమన్నా క్యారెక్టర్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలున్నప్పటికీ బాలీవుడ్‌పై మొగ్గు చూపిన ఈ బ్యూటీ అక్కడ ఏం సాధిస్తుందో చూద్దాం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమన్నా మాత్రం తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూనే బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకుంటానంటోంది. తమన్నా  బాలీవుడ్ లోకి వెళ్లిపోవటంతో.. ఇప్పుడు  టాలీవుడ్ లో సమంతా హవా సాగుతుంది.  కాజల్ కూడా  బాలీవుడ్ వైపు  అడుగు వేసిన విషయం తెలిసిందే.  టాలీవుడ్ ను కాదని వెళ్లిన  ఇలియానా పరిస్థితి ఏమైందో  ఒక్కసారి  ఈ భామలు  తెలుసుకోవాలని   టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.