టాలీవుడ్
టూ కోలీవుడ్ లలో మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మిల్క్
బ్యూటీ తమన్నా.. అనుకోకుండా కాలుజారి తప్పటడుగు వేసింది. టాలీవుడ్ లో నంబర్ వన్
హీరోయిన్ స్థాయికి ఎదిగిన తమన్నా ఇప్పుడు ఆమె స్థాయి ఘోరంగా పడింది.
టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు. సహ
నటీమణులే కాదు, సహ నటుల నోట కూడా తమన్నా మాటే వినిపిస్తోంది. తెలుగు, తమిళ
భాషల్లో మంచి అవకాశాలతో లైమ్‌లైట్‌లో వుండగానే బాలీవుడ్‌పై మోజుతో అక్కడ
అడుగుపెట్టి ఇక్కడి అవకాశాలను చేజేతులారా జారవిడుచుకుని తప్పటడుగు వేసిందని
చెప్పుకుంటున్నారు. తమన్నాను తెలుగు, తమిళ
పరిశ్రమలు ఎంతగానో ప్రోత్సహించి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టాయి. ఒక దశలో
తిరుగులేని స్టార్‌ని చేశాయి. ఏ సినిమా విడుదలైనా తమన్నా వుండాల్సిందే.
చిన్న హీరోలనుంచి స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాలు చేసిన తమన్నా చేతిలో
ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమాయే వుంది. అది నాగచైతన్య హీరోగా
నటిస్తున్న ‘వెట్టై’ రీమేక్ ‘తడాఖా’. ఈ చిత్రం మినహా మరే చిత్రమూ ఆమె చేతిలో లేదు.
బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న ‘హిమ్మత్‌వాలా’ తర్వాత మరో అవకాశం తమన్నాను తట్టింది. అక్షయ్‌కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రాన్ని రమేష్‌తారనీ నిర్మిస్తుండగా, సాజిద్-్ఫర్హాద్
ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ
చిత్రం బాలీవుడ్‌లో తమన్నా రేంజ్‌ని పెంచే చిత్రమవుతుందని అప్పుడు
బాలీవుడ్ అంతా చెప్పుకుంటున్నారు. ‘హిమ్మత్ వాలా’ చిత్రంలో
తమన్నా క్యారెక్టర్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు సినీ
జనాలు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలున్నప్పటికీ బాలీవుడ్‌పై మొగ్గు
చూపిన ఈ బ్యూటీ అక్కడ ఏం సాధిస్తుందో చూద్దాం అంటున్నాయి టాలీవుడ్
వర్గాలు. తమన్నా మాత్రం తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూనే
బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకుంటానంటోంది. తమన్నా బాలీవుడ్ లోకి
వెళ్లిపోవటంతో.. ఇప్పుడు టాలీవుడ్ లో సమంతా హవా సాగుతుంది. కాజల్ కూడా
బాలీవుడ్ వైపు అడుగు వేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ను కాదని వెళ్లిన
ఇలియానా పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఈ భామలు తెలుసుకోవాలని టాలీవుడ్
పెద్దలు అంటున్నారు.
No comments:
Post a Comment