Showing posts with label nagarjuna. Show all posts
Showing posts with label nagarjuna. Show all posts

Saturday, 6 April 2013

D Siva Prasad Reddy Comment On Hero Nagarjuna

Gossips
 
d siva prasad reddy comment on hero nagarjuna

మన రాష్ట్రాంలో  ఇప్పుడు రెడ్డిఅనే పదం రాజ్యం వేలుతుంది. రాజకీయ రెడ్డిలో ఏముందో తెలియాదు గానీ, సినిమా రెడ్డిలో మాత్రం ఒక గమ్మత్తు ఉందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైన రెడ్డిఅని పిలిస్తే చాలు వారిలో ఉన్న బీపీ తగ్గిపోతుంది. అందరికి కాదులేండి. అతికొద్దిమందికే ఈ అవకాశం ఉంటుందని ప్రముఖ నిర్మాత చెబుతున్నారు. రెడ్డి అనే పిలుపులో అంతమహాత్యం ఉందా? అంటే ఉందనే చెబుతున్నారు. ఆ హీరోగారి పిలుపుతో రెడ్డిగారిలో ఉన్న బీపి ఇట్టే తగ్గిపోతుందని ఆయనే స్వయంగా చెబుతున్నారు. రెడ్డి గారు పేదల పాలిట దేవుడు అనే మాటలకు మనకు తరుచుగా వినిపిస్తాయి. రెడ్డి వర్గం వర్గం అన్ని వర్గాలను కలుపుకోని పోవటంలో నైపుణ్యం కలిగిన నాయకులు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  రెడ్డి అనే మాట ఒక మందులా పనిచేస్తుందని  ఒక సినీ నిర్మాత అంటున్నారు.  తాజాగా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న గ్రీకువీరుడు’  వేధికపై ఈ మాటలు వినిపించాయి. గ్రీకువీరుడు చిత్ర నిర్మాత శివప్రసాద్ రెడ్డి   ఆడియో ఫంక్షన్ వేధిక పై  హీరో నాగార్జున ఆయనకు ఉన్నస్నేహ సంబంధం గురించి చెప్పటం జరిగింది. ఆ సమయంలో  నాగార్జున పిలిచే పిలుపు కోసం శివప్రసాద్ రెడ్డి ఎదురుచూస్తాడట.  రెడ్డి అని నాగార్జున పిలిస్తే  శివప్రసాద్ రెడ్డిలో  ఉన్న బీపీ, అన్ని తగ్గిపోతాయాని ఆయన చెబుతున్నారు.  అంటే  వారిద్దరి మద్య  అంత అనుబంధం ఉందని తెలుస్తోంది.

d siva prasad reddy comment on hero nagarjuna
అయితే మరుజన్మలో కూడా  మా అనుబంధం ఇలాగే ఉండటాని  శివప్రసాద్ రెడ్డి కోరుకుంటున్నట్లు  టాలీవుడ్ టాక్.  టాలీవుడ్ లో నాగార్జునే అందరికి పులిహోర తినిపిస్తాడైతే.. అలాంటి నాగ్ కే .. డి. శివప్రసాద్ పులిహోర తినిపించాడని  సినీ పెద్దలు గొణుక్కుంటున్నారు.  ఆయనకు  బీపీ పెరిగిన ప్రతిసారీ  బీపి టాబ్లేట్ బదులు ..నాగ్ ఫోన్ చేసి .. రెడ్డి గారు అని పిలిస్తే .. బీపి తగ్గిపోతుందని సినీజనాలు జోకులు వేసుకుంటున్నారు. ఇలాంటి పులిహోర మాటలు  టాలీవుడ్ లో చాలా వినిపిస్తాయని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.  నాగార్జున మాత్రం రాబోయే రోజుల్లో   రాజకీయంగా  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుకు బందీ అవుతాడో..లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపుకు బందీ అవుతాడో  చూడాలని .. నాగ్ అభిమానులు  గుసగుసలాడుకుంటున్నారు.

Thursday, 7 March 2013

Nagarjuna Angry With Naga Chaitanya

Gossips

nagarjuna angry with naga chaitanya

ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోల కొడుకులు తమ తండ్రులను బాగా వాడుకుంటున్నారు. అంటే  మరొల అనుకోకండి?  మెగా స్టార్ చిరంజీవి తనయుడు  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ నటించిన సినిమాల్లో  తన తండ్రి నటించిన హిట్ సాంగ్స్  పెట్టుకోవటం జరుగుతుంది. ప్రతి సినిమాలో చిరంజీవి నటించిన సినిమా పాటను పెట్టుకొని విజయం సాధిస్తున్నారు.  రామ్ చరణ్  చిరంజీవి పాటలకే పరిమితం అయ్యాడు.  

టాలీవుడ్ మన్మథడు అయిన నాగార్జున  కొడుకు  నాగ చైతన్య మాత్రం తన తండ్రి నటించిన సినిమాను రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమా హల్ బ్రదర్  టాలీవుడ్ మంచి కలెక్షన్లు రాబట్టింది.  ఇప్పుడు నాగ చైతన్య హల్ బ్రదర్ సినిమాను  రీమేక్ చెయాటానికి  సిద్దమయ్యాడు. ఈ సినిమా హీరోయిన్ కూడా సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం. నాగ చైతన్య పక్కన మొదట నయన తార గానీ, అనుష్క గానీ అనుకున్నారట, కానీ నాగార్జున మాత్రం ఆ ఇద్దరుతో  వద్దని చెప్పినట్లు సమాచారం.   దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి .. ఆ ఇద్దరు అయితేనే సినిమా బాగుటుందని చెప్పటంతో.. నాగార్జున  కోపంతో  ఆవేశంగా ఆఇద్దరు నాగచైతన్యకు తల్లిలాంటి వారని ఆవేశంలో అసలు నిజం బయట పెట్టడంతో దర్శకుడు , నాగచైతన్య షాక్ తిన్నారని సమాచారం.  అయితే వెంటనే అక్కడనుండి లేచి వెళ్లిపోవటం జరిగిందని .. దర్శకుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

nagarjuna angry with naga chaitanya
  
 అయితే ఈ విషయం  అమలకు తెలుసో, లేదో అనే అనుమానం  అందరికి వస్తుందని ఫిలింనగర్లో పుక్లారు పుట్టాయి. అయితే  చివరకు నాగ చైతన్య పక్కన  కాజల్ ని ఎంపిక చేసినట్లు  టాలీవుడ్ సమాచారం.  తరువాత నాగార్జున  నాగ చైతన్య మద్య ఆ ఇద్దరు హీరోయిన్ల కోసం గొడవ పడినట్లు  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.  ఈ విషయాన్ని  నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పటంతో కొస్త గొడవ తగ్గిందట. అసల నేను నటించి సినిమా హల్ బ్రదర్ సినిమా రీమేక్ చేయవద్దు అని దర్శకుడికి ఫోన్ చేసి నాగార్జున చెప్పినట్లు  సమాచారం.  

నాగ చైతన్య తాత అయిన నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పి ఈ ఇద్దరు హీరోయిన్లు కోసం గొడవ పడకూడదు. హీరోయిన్లు మన కోసం కొట్టుకోవాలని ఆయన జీవితం జరిగిన రెండు మూడు ఉదాహరణ చెప్పి, శాంత పరిచినట్లు టాలీవుడ్ సమాచారం. చివరకు నాగచైతన్యనే తండ్రి మాటకు తగ్గి.. కొత్త హీరోయిన్లు తీసుకోవటం జరిగింది. అయితే నాగ చైతన్య కొంచెం బాధపడినట్లు తెలుస్తోంది. అంటే ఇక నయన తార, అనుష్కలతో తన సినిమాలు రావనే బాధలో ఉన్నట్లు ఫిలింనగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Tuesday, 12 February 2013

Nagarjuna As Bhai

      Nagarjuna-Bhai-movie-still-274x300ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వెరైటీ పాత్రలకు అధిక ప్రాధాన్యమిచ్చే నటుల్లో అక్కినేని నాగార్జున ముఖ్యులు. భక్తిరసమైనా, ఫ్యాషన్ ఒలికించే పాత్రైనా సరికొత్త పద్దతిలో ఆవిష్కరించేందుకు ఆయన ముందుంటారు. డాన్ సినిమాలో సరికొత్త మాఫియా డాన్ గా కనిపించినా, శిరిడీ సాయిలో భక్తితత్వాన్ని ప్రబోధించినా నాగ్ తరువాతే. తాజాగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘భాయ్’. దీనికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 'భాయ్' గా నాగార్జున తాజా గెటప్స్ గురించి కొంతకాలంగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తొంది.


     దీనికి ఊతమిస్తూ ‘భాయ్’ సినిమా షూటింగ్ లో నాగార్జున విచిత్రమైన వేషధారణతో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో హాట్ బ్యూటీ నతాలియా కౌర్ తో నాగార్జున ఐటెం సాంగ్ చిత్రీకరణ సమయంలో విచిత్రమైన వేషధారణలో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ షూటింగ్ లో అచ్చం కరుడుగట్టిన బ్రూనై సుల్తానును తలపిస్తూ నాగ్ అవతారం ఉంది. మెరూన్ కలర్ గౌనులాంటి డ్రెస్సులో చాతీ భాగం విశాలంగా కనిపించేలా,  భుజాలు దాటే జట్టుపైన ఎర్రటి వస్త్రాన్నిచుట్టుకొని నాగ్ ఔరా అనిపించాడు. 



         నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియో బేనర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటిస్తోంది. ఈ వారాంతం వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ షెడ్యూల్ లో రిచా-నాగ్ మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
...avnk

Friday, 18 January 2013

Nagababu Daughter Niharika As Heroine

Niharika

       ఇఫ్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చాలా మంది హీరో హీరోయిన్ల పిల్లలు తెరంగ్రేటం చేసి రాణిస్తున్నారు. కానీ మెగా హీరో ఫ్యామిలీ నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చారు కానీ, హీరోయిన్లు ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈమె నిర్మాతగా అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చాయి కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అఖిల్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమా గానీ, దానికి సంబంధించిన ప్రకటన గానీ వెలువడలేదు. ఒకవేళ వీరిద్దరు జంటగా తెరంగ్రేటం చేస్తే మాత్రం అభిమానుల్లో వీరి సినిమా పై ఆస్తకి నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది.